సర్కారు నౌకరి మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
ఈ సినిమా కథ 1996 లో సాగుతుంది. గోపాల్ (ఆకాష్ గోపరాజు) ఓ అనాధ. చిన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోవడటం తో కస్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం (హెల్త్ ప్రమోటర్) సాధిస్తాడు. ప్రభుత్వ జీత గాడు అని సత్య (భావన) పెళ్లి చేసుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు హెల్త్ ప్రమోటర్ గా వెళ్తాడు. ఎయిడ్స్ పైన అవగాహన కల్పించడానికి కండోమ్స్ పంచడం అతని డ్యూటీ. ఊరి వాళ్ళు కొత్తలో సర్కారు నౌకరోడు అని చాలా మర్యాదగా చూస్తారు. కానీ గోపాల్ చేసే నౌకరి కండోమ్స్ పంచడం అని తెలిసి ఊరు వాళ్ళు బుగ్గలోడు అని హేళన చేస్తుంటారు. ఈ విషయం సత్య కు తెలిసి గొడవ జరుగుతుంది. తరువాత ఊర్లో వాళ్ళు గోపాల్, సత్య ను ఊర్లో నుండి వెళ్ళగొడతారు. తరువాత ఎయిడ్స్ వ్యాధి ఊర్లోకి వచ్చాక గోపాల్ ఏమి చేసాడు? గోపాల్ సత్య చెప్పినట్టు ఉద్యోగం వదిలేసాడా? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఎయిడ్స్ కొరకు ప్రభుత్వం కండోమ్స్ గురించి అమలు చేసిన కార్యక్రమాలు తెలిపే సినిమా కథ
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
సినిమా కథ
మైనస్ పాయింట్స్ :
కొంచెం అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది
నటీనటులు:
ఆకాష్ గోపరాజు, భావన. VS,. మహాదేవ్, రమ్య పొందూరి, తనికెళ్ల భరణి
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్: సర్కార్ నూకరి
బ్యానర్: ఆర్ కే టెలి షో ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ : 01-01-2024
సెన్సార్ రేటింగ్ : “ U/A “
దర్శకుడు: గంగనమోని శేఖర్
సంగీతం : శాండిల్య పిసపాటి
నిర్మాతలు: కె.రాఘవేంద్రరావు, మాధవి కోవెలమూడి
రన్టైమ్: 120 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్