సార్పట్ట పరంపర మూవీ రివ్యూ
అట్టట్టా : ఆర్య ‘సార్పట్ట’ రివ్యూ
Rating: 2.5/5
తమిళం నుంచి గొప్ప గొప్ప సినిమాలు రావడం, ఎన్నో ప్రయోగాలు జరగడం అనేది నిజం. అక్కడి నుంచి కమల్ హాసన్,ధనుష్ లాంటి గొప్ప నటులూ వచ్చారు. రజనీవంటి సూపర్ స్టార్స్ వచ్చారచు. గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా తగ్గింది. అక్కడ ప్రయోగాలు పెద్దగా జరగటం లేదు. ఎప్పుడో కానీ మంచి సినిమాలు రావట్లేదు. అయితే సామాజిక నేపధ్యాన్ని బేస్ చేసుకునే చిత్రాలు వస్తున్నాయి. పా.రంజిత్ వంటి దర్శకులు అక్కడ వచ్చాక… సినిమా జనాలను ఆలోచనలో పడేసే స్థాయికి ఎదిగింది. అసాదే ఓటీటిల పుణ్యమా అని వారి సినిమాల మార్కెట్టూ విస్తరించింది. ఇక ఈ తరహా సినిమాలు అన్ని ఏక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రక్కన పెడితే కొత్తదనం మాత్రం కనిపిస్తోంది. తాజాగా పా రంజిత్ ‘సార్పట్ట’ అనే మరో వైవిధ్యభరిత చిత్రంతో సినీప్రియుల్ని పలకరించారు. ఆంగ్లేయులపై రోషమైన పిడిగుద్దు.. ట్యాగ్ లైన్. ఆర్య హీరోగా నటించిన చిత్రమిది. బాక్సింగ్ ఆట నేపథ్యంలో పీరియాడికల్ చిత్రంగా ముస్తాబు చేసారు.
‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించిన దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాతోనూ మెప్పిస్తారా లేదా చూద్దాం.
స్టోరీ లైన్
సమర అలియాస్ సామ్రాజ్యం (ఆర్య) కు చిన్నప్పటి నుంచీ భాక్సింగ్ అంటే ప్రాణం..క్లాసులు ఎగ్గొట్టి మరీ భాక్సింగ్ చూడటానికి పోతూంటాడు. అయితే అతని తల్లికి అది ఇష్టం లేకపోవటంతో దూరంగా ఉంటాడు. నార్త్ మద్రాస్ లో లోని ఓ హార్బర్లో కూలిగా పనిచేస్తుంటాడు. కానీ భాక్సింగ్ ని గమనినిస్తూంటాడు. అలాంటి టైమ్ లో తను అమితంగా ఇష్టపడే గురువు రంగ (పశుపతి) కు అవమానం జరుగుతుంది.బ్రిటీష్ వారి టైమ్ నుంచి బాక్సింగ్ క్రీడకు బ్రాండ్ అంబాసిడర్స్ లా ఉన్న సర్పట్టా గ్రూప్ వరస ఫెయిల్యూర్స్ లో ఉంటుంది. ఆ టీమ్ ని లీడ్ చేసేది రంగ. దాంతో తన గురువు ఓటమి, పరువు పోవడాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి.. చాంఫియన్ వేటపులి( జాన్ కొక్కెన్)తో పోటీకి దిగుతాడు. వేటపులి తక్కువ వాడేమీ కాదు. అలాంటివాడితో పోటీ అంటే మామూలు విషయం కాదు. కానీ ధైర్యం చేస్తాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని గెలుస్తాడు. ఈ క్రమంలో చాలా ఛాలెంజె లు ఎదురౌతాయి. ఓ టైమ్ లో ఇక బాక్సింక్ కు పనికి రాడు అనుకుంటాడు. అసలు సమరకు ఏమైంది…ఈ ‘సార్పట్ట’ బాక్సింగ్ గ్రూప్ ఎవరు…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
సినిమా బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటే సినిమా అంతా కొత్తగా ఉంటుందా అంటే లేదు అని ఆన్సర్ వస్తుంది ఈ సినిమా చూస్తూంటే. ఎందుకంటే బ్రిటీష్ కాలం నాడు మొదలైన భాక్సింగ్..నార్త్ మద్రాస్ లో కొన్ని కుటుంబాల్లో ఓ సంప్రదాయంగా సెటిల్ అవటం వంటివి చూపిస్తూంటే కొత్తగా ఉండి సినిమా ప్రారంభం ఓ రేంజిలో ఉందే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ బ్యాక్ డ్రాప్ రొటీన్ అయ్యిపోయింది. సీన్స్ కొత్తగా కనిపించలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో డైరక్టర్ తన బ్రాండ్ ని బయిటకు తీసి బట్టలువేసి కథలో చొప్పించాలని చూసాడు. కథను కథగా చెప్తే ఏ సమస్యా ఉండదు. ఎప్పుడైతే ఇలా ప్రక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడు తెరపై హీరో గెలిచినా సినిమా ఓడిపోతుంది. అందుకు కారణం కథ పొడిచే వెన్నుపోటే అనిపిస్తుంది. మాములుగా స్పోర్ట్ డ్రామాలకు ఉండే ఫార్మెట్టే ఈ సినిమాకు ఫాలో అయ్యారు.
కథకు అవరస పరిస్దితుల్లో హీరో తెరపైకి రావటం..నానా కష్టాలు పడటం..గెలిపించటం జరుగుతుంది.దాంతో సినిమాకు పీరియడ్ టచ్ ఇచ్చినా, పా.రంజిత్ ఓ రేంజిలో మేకింగ్ చేసినా ఆ తంత్రాలు ఏమీ ఫలించలేదు. సెకండాఫ్ లో ఓ అరగంట లేపేస్తే ఖచ్చితంగా ‘సార్పట్ట’ సినీ చరిత్రలో నిలచిపోయే డ్రామా అయ్యేది. అలాగే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ చాలా సినిమాటెక్ గా ఉంటాయి. హీరో ఎలాగైనా గెలిస్తే బాగుణ్ణు.. అని ప్రేక్షకుడే ఫీలయ్యే ఎమోషన్. ఆ సన్నివేశాల్లో మిస్సైంది. ఓ స్పోర్ట్స్ డ్రామాని, కొంత లిబర్టీ తీసుకున్నా – దర్శకుడు రియలిస్టిక్ పంధాలో నడిపించుకుంటూ వెళ్లటం నచ్చుతుంది.
ఇక ఈ సినిమాని బాగా లౌడ్ గా ఉండటం కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా చోట్ల డ్రామా కన్నా హడావిడి డామినేట్ చేసేస్తుంది. ప్రిన్సిపుల్ క్యారక్టర్ ఆర్క్ ఏదైతే అది పూర్తి గా సర్పైజ్ లతో నిండి ఉండదు. మనకు తెలిసినట్లే కథలోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. హిస్టారికల్ హ్యాంగోవర్ లో పా.రంజింత్ మిగతా విషయాలపై దృష్టి పెట్టలేదు.ఏదైమైనా స్పోర్ట్స్ ఫిల్మ్ గా ఇది లగాన్ స్దాయికి వెళ్లాల్సింది…కానీ ఆ స్దాయిని అందుకోలేకపోయింది. పా రంజిత్ కెరీర్ ప్రారంభ స్దాయిలో తీసిన మద్రాస్ సినిమాని ఈ నేపధ్యం గుర్తు చేసింది.మెయిన్ క్యారక్టర్స్ మధ్య ఎమోషన్ ట్రాక్ సరిగాలేకపోవటం ఒక డ్రా బ్యాక్ అని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్‌ని ఇంకొంచెం కొత్తగా చూపించి ఉంటే బెటర్‌గా అనిపించేది.
టెక్నికల్ గా..
దర్శకుడు పా.రంజిత్ సినిమా. తాను అనుకున్న కథని.. అనుకున్నట్టు తెరపై చూపించగలిగాడు. చాలా చోట్ల.. ఆయన మార్క్ పనితనం కనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాని నెక్ట్స్ లెవిల్ లోకి తీసుకెళ్లాయి. రన్‌టైంను తగ్గించి స్క్రీన్‌ప్లే టైట్ చేసి ఉంటే బాగుండేది. పీరియాడిక్ లుక్ కోసం ఆర్ట్ డైరక్టర్ పడిన కష్టం బాగా కనిపిస్తుంది. నటీనటులు సార్పట్ట కు పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఆర్య బాక్సర్ పాత్రలో చాలా బాగా నటించాడు. మిగిలిన వాళ్లు కూడా అతనికి మంచి మద్ధతు అందించారు. దుషారా విజయన్, పసుపతి, సంచన నటరాజన్, జాన్ కొక్కెన్ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు.
చూడచ్చా
స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక రెగ్యులర్ సినీ గోయర్ కూడా ఈ సినిమాను ఒకసారి చూసేయవచ్చు.
తెర వెనుక..ముందు
నటీనటులు: ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, సంచన నటరాజన్, జాన్ కొక్కెన్, కలైరాసన్, సంతోష్ ప్రతాప్, జాన్ విజయ్, షబీర్ తదితరులు;
సంగీతం: సంతోష్ నారాయణ్;
సినిమాటోగ్రఫీ: మురళి.జి;
ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.;
స్టంట్స్: అన్బరివ్;
ఆర్ట్: టి.రామలింగం;
నిర్మాత: షణ్ముగమ్ దక్షణ్‌రాజ్;
రచన, దర్శకత్వం: పా.రంజిత్;
రిలీజ్ డేట్:-22.07.2021
రన్‌టైం:174 నిమిషాలు
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో