Reading Time: 3 mins

సిద్ధార్థ్ రాయ్ టీజర్ లాంచ్ ఈవెంట్

సిద్ధార్థ్ రాయ్ కథని నమ్మి చేసిన చిత్రం. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

దీపక్ సరోజ్, వి యేశస్వి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ సిద్ధార్థ్ రాయ్ టీజర్ విడుదల

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్లు అందరినీ, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ భగవద్గీత శ్లోకంతో ప్రారంభమై హీరో పాత్రని చాలా ఆసక్తికరంగా ప్రజంట్ చేసింది. హీరో పుట్టుకతో మేధావి. లాజిక్స్ తో బ్రతుకుతాడు. లాజిక్స్‌ లో తనకి ఎవరూ సాటిలేరు. హీరోయిన్ తన్వి నేగి ద్వారా అతనకి నిజమైన ప్రేమ ఎదురౌతుంది.

దీపక్ సరోజ్ తన క్యారెక్టర్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ చక్కగా చూపించారు. క్యారెక్టర్ ఆర్క్ నిజంగా ఆకట్టుకుంటుంది. వివిధ గెటప్‌లలో వైవిధ్యాన్ని మనం గమనించవచ్చు. దీపక్ తన పాత్రలో జీవించాడు. సామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, రధన్ మ్యూజిక్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి

ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ వర్మ దండు, నిర్మాత వంశీ , రైటర్ లక్ష్మీ భూపాల ఈ ఈవెంట్ కు అతిధులుగా హాజరయ్యారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. సిద్ధార్థ్ రాయ్ టీజర్ చాలా ఎఫెక్టివ్, ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. దీపక్ సరోజ్ చాలా అద్భుతంగా చేశాడు. ఇకపై తనని హీరోగా గుర్తుపెట్టుకుంటారు. తన్వి కూడా చక్కగా నటించింది. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రదీప్ పూడి ఇండస్ట్రీలో నాకు బ్రదర్ లాంటి వాడు. తను ఎదున్న మొహం మీదే చెప్పేస్తాడు. అలాంటిది ఇందులో భాగమైవున్నారంటే ఖచ్చితంగా సినిమా చాలా బావుందని నమ్ముతున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.

కార్తీక్ వర్మ దండు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి దర్శకుడు నిర్మాతగా కూడా చేయడం గ్రేట్ జాబ్. నిజంగా రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయడం గొప్ప విషయం. సినిమాలో కంటెంట్ వుంది. టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. తప్పకుండా డబ్బులు వస్తాయి. ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ రాబోతుంది. టీజర్ లో హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

వంశీ మాట్లాడుతూ.. టీజర్ అద్భుతంగా వుంది. సినిమా సూపర్ డూపర్ హిట్. అందులో ఎలాంటి అనుమానం లేదు. దర్శకుడు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అది టీజర్ చూస్తే తెలుస్తుంది. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ కావాలి. దీపక్ కూడా పెద్ద హీరో అవుతాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి సినిమా హిట్ ఐతే అందులో వున్న ఆనందం వేరు. ఈ బ్యానర్ లో చేస్తున్న మొదటి సినిమా పెద్ద విజయం సాధించి మరిన్ని చిత్రాలు నిర్మించి ఇండస్ట్రీలో నిలబడాలి అని కోరారు

హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. ఆర్యలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నా కెరీర్ మొదలైయింది. లెజెండ్ సినిమాలో బాలయ్య గారి చిన్నప్పటి పాత్ర చేశాను. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు., సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇలా ఎంతోమంది గొప్పవారితో పని చేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం. హీరోగా మంచి సినిమా చేయాలి ప్రేక్షకుల మనసులు గెలవాలనే ఆలోచనలో వున్నప్పుడు ఈ కథ వచ్చింది. దర్శకుడు యేశస్వి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కథని నమ్మి చేసిన సినిమా ఇది. ప్రతిఒక్కరూ కష్టపడి పని చేశారు. ఆ కష్టతెరపై కనిపిస్తుంది. సామ్ కె నాయుడు గారు లెజండ్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ఆయనకి కృతజ్ఞతలు. రథన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సిద్ధార్థ్ రాయ్ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. తన్వి బలమైన పాత్ర చేసింది. చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. . సిద్ధార్థ్ రాయ్.. పైసా వసూల్ సినిమా అన్నారు.

దర్శకుడు వి యేశస్వి మాట్లాడుతూ కథ పుట్టిన తర్వాత తనకి ఏం కావాలో అది తీసుకుంటుందనడానికి సిద్ధార్థ్ రాయ్ సినిమానే నిదర్శనం. ఇలాంటి మంచి కథని చెప్పడానికి నేను కూడా నిర్మాణంలో భాగమయ్యాను. ఈ కథకు మంచి నటుడు కావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ బాల్య నటుడిగా అనుభవం వున్న దీపక్ ని తీసుకున్నాం. టీజర్ చూస్తే సినిమాపై ఒక అవగాహన వచ్చివుంటుంది. కథని నమ్ముకొని నిజాయితీగా చేసిన సినిమా ఇది. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది ఒప్పిస్తుంది అలరిస్తుంది. సినిమాలో మేము చెప్పిన ఎమోషన్ బలంగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. మేము పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందని నమ్ముతున్నాను. ఇది మా అందరికీ మంచి ప్రారంభం అవుతుంది అన్నారు.

లక్షీ భూపాల మాట్లాడుతూ దర్శకుడు యేశస్వి ఇండస్ట్రీ జెండా పాతడానికి తగిన కథని ఎంచుకున్నారు. సిద్ధార్థ్ రాయ్ సినిమా ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. దీపక్ అద్భుతంగా నటించారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

తన్వి నేగి మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో ఇందు పాత్ర నాకు చాలా స్పెషల్. మీ అందరికీ నచ్చుతుంది. దీపిక్ బ్రిలియంట్ వర్క్ చేశారు. టీం అందరికీ థాంక్స్.

ప్రదీప్ పూడి మాట్లాడుతూ.. యేశస్వి గారి కోసం ఈ సినిమాలో ఇన్వాల్ అవ్వడం జరిగింది. తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. అన్నారు.

సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు.

తారాగణం :

దీపక్ సరోజ్, తన్వి నేగి, నాదిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్

సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యేశస్వి
నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్ మరియు విహిన్ క్రియేషన్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సామ్ కె నాయుడు
సంగీత దర్శకుడు: రధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి