Reading Time: < 1 min

సిద్ధు జొన్న‌ల‌గడ్డ కొత్త చిత్రం ప్రారంభం

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం

డీజే టిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 37వ సినిమా గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బొమ్మరిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్‌, యువీ క్రియేష‌న్స్ వంశీ, దామోద‌ర్ ప్ర‌సాద్‌, నందినీ రెడ్డి, రాధా మోహ‌న్‌, కార్తీక్ వ‌ర్మ‌, సుబ్బు, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, కోన వెంక‌ట్, నీర‌జ కోన త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ  భాస్క‌ర్ డైరెక్ట‌ర్‌గా సిద్ధు జొన్నలగడ్డతో మా బ్యానర్‌లో సినిమా చేయ‌టం ఎంతో హ్యాపీగా ఉంది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది. హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం అన్నారు.

న‌టీన‌టులు:

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి ప్ర‌కాష్‌