Reading Time: 3 mins

సినీ ప్ర‌ముఖుల చ‌మ్మ‌క్కులు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

ఆనాటి సినీ ప్ర‌ముఖులు ర‌చ‌యిత‌లు, న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు వారి మ‌ధ్య జ‌రిగే వివిధ సంద‌ర్భాల్లో చెప్పిన సంభాష‌ణ‌లు అన్ని సేక‌రించి ఒక గ్రంధంగా చేసి మ‌న ముందు ఉంచారు స‌హ‌ద‌ర్శ‌కులు క‌న‌గాల జ‌య‌కుమార్‌గారు. విద్యాసాగ‌ర్‌గారు ఈ పుస్త‌కాల‌ను ప్ర‌చురించారు.   బుధ‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని వాసిరెడ్డి విద్యాసాగ‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో …

రేలంగి న‌ర్సింహారావు మాట్లాడుతూ… జ‌య్‌కుమార్‌కి నాకు మ‌ద్రాస్ నుంచి ప‌రిచ‌యం ఉంది. మేమిద్ద‌రం రూమ్‌మేట్స్‌. అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న‌కు సాహిత్యం మీద చాలా అభిలాష‌ ఉండేది. అప్ప‌ట్లో మ‌న జ‌య్‌కుమార్‌గారిని దేవుల‌ప‌ల్లికృష్ణ‌శాస్ర్తిగారు చాలా గౌర‌వించేవారు. ఆయ‌నతో క‌లిసి జ‌య్‌కుమార్‌గారు వెళితే ఆయ‌న మై యంగ్ ఫ్రెండ్ అని చెప్పేవారు. రెండుసార్లు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చికూడా ఆయ‌న ఎందుకో డైరెక్ట‌ర్ కాలేక‌పోయారు. ఆయ‌న‌లో చాలా మంచి సాహిత్యం ఉంది. ఆయ‌న పాట‌లు రాస్తారు, క‌విత‌లు రాస్తారు. చాలా సింపుల్‌గా ఉంటారు. జ‌య్‌కుమార్‌గారికోసం ఈ పుస్త‌కంలో బ్ర‌హ్మానందంగారు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు ముందుమాట రాసినందుకు వాళ్ళ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.ఇ.వి.వి.గారి ద‌గ్గ‌ర రెండు సినిమాల‌కు ప‌ని చేశారు. జ‌య్‌కుమార్‌గారికి ఇద్ద‌రు భార్య‌లు ఒక‌రు గుంటూరులో ఉంటే మ‌రొక‌రు విద్యాసాగ‌ర్‌గారు. ఎంతో మంచి మ‌న‌సుతో శ్రీ‌కాంత్ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ చేయడం చాలా ఆనందంగా ఉంది.విద్యాసాగ‌ర్‌గారికి రెండు పెద్ద విద్యాశాల‌లు ఉన్నాయి ఆయ‌న వాటికి చైర్‌మెన్‌.కాని చాలా సింపుల్‌గా ఉంటారు ఎవ్వ‌రికీ చెప్ప‌నివ్వ‌రు అని అన్నారు.

వాసిరెడ్డి విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ… సినిమాలు అంటే నాకు చాలా ప్యాష‌న్‌. నేను జ‌య్‌కుమార్ మంచి ఫ్రెండ్స్ ఆయ‌న నేను రెగ్యుల‌ర్‌గా క‌లుస్తుంటాము. ఆయ‌న క‌వితలు, పాట‌లు బాగా రాస్తారు. ఆయ‌నే బుక్స్ ప‌బ్లిష్ చెయ్య‌డం పెద్ద విష‌యం ఏమీ కాదు. లైమ్‌లైట్‌లోకి రాని వాళ్ల‌కి ఇండ‌స్ర్టీ ఇలాగే చేయూత నివ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఎండ్లూరి సుధాక‌ర్‌రావు (ప్రొఫెస‌ర్ ఆఫ్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ) మాట్లాడుతూ… వాల్మీకి లేక‌పోతే రామాయ‌ణం లేదు. సాహిత్యంలో రెండు జ‌కారాలు ఉన్నాయి. జాషువా 18, 20 వ‌య‌సులో ఆరోజుల్లో మూకీ చిత్రాల‌ను తీశారు. 1920లో క‌దిలేబొమ్మ‌ల‌కు కంఠం క‌ల‌ప‌డం గుర్రం జాషువా. అటువంటి వారే మా క‌న‌గాల జ‌య్‌కుమార్‌గారు. ఇప్ప‌టికీ ఆ పాత సినిమాలు నా గుండె తెర‌మీద వేసుకుంటే హాయిగా నిద్ర‌ప‌డుతుంది. ఈ పుస్త‌కానికి మంచి పుర‌స్కారం రావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

క‌ర‌పాల సుధాక‌ర్(జ‌డ్జి) మాట్లాడుతూ… పుస్త‌కం చూడ‌గానే చ‌ద‌వాల‌నిపిస్తుంది. చిరిగిన చొక్కాతొడుక్కో కాని మంచి పుస్త‌కం కొనుక్కో అన్నారు ఓ మ‌హా క‌వి.పుస్త‌క ప‌రిజ్ఞానంతో విద్యాప‌రిజ్ఞానం  వ‌స్తుంది. జ‌య్‌కుమార్‌గారి కృషికి అభినందిస్తున్నాను అన్నారు.

మ‌రుడూరి రాజా మాట్లాడుతూ… నేను ఇండ‌స్ర్టీలో పెద్ద‌వారిని ఎవ్వ‌రినీ చూడ‌లేదు. పుస్త‌కాలంటే చాలా ఇష్టం. ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్లు డ‌బ్బులు, పుస్త‌కాలు ఇస్తే డ‌బ్బులు వ‌దిలేసి పుస్త‌కాన్ని తెచ్చుకుంటా పుస్త‌కాలంటే అంత ఇష్టం. నాకు జ‌య్‌కుమార్‌గారికి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ అనుబంధం ఏర్ప‌డింది. ఈ పుస్త‌కంలో ఎన్నో మంచి అనుభ‌వాల‌ను సేక‌రించారు. ఇవ‌న్నీ గొప్ప అనుభ‌వాలు దీన్ని పుస్త‌క రూపంలో అందించ‌డం చాలా గొప్ప ప‌ని అని అన్నారు. 

రాం ప్ర‌సాద్ మాట్లాడుతూ… నాకు జ‌య్‌కుమార్‌గారు గుంటూరులో ప‌రిచ‌యం. ఈ పుస్త‌కం ద్వారా పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకోవ‌చ్చు. క‌ళారంగానికి ఎంతో స‌హాయ‌ప‌డిన విద్యాసాగ‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హేమ‌సుంద‌ర్ మాట్లాడుతూ… ఈ పుస్తం పార్ట్ -2 కూడా రావాల‌ని నా కోరిక  త‌ప్ప‌కుండా ఇలాంటిది మ‌రిన్ని విశేషాల‌తో మ‌రో పుస్త‌కం రావాలి అని అన్నారు.

శివ‌నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… 130 సినిమాలు చేసిన మా శ్రీ‌కాంత్‌కి ఇంకా మొహ‌మాటం పోలేదు. శ్రీ‌కాంత్ చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. జ‌య్‌కుమార్‌గారు ఎప్పుడూ ఎక్క‌డా ఏ విష‌యంలో కూడా టెన్ష‌న్‌ప‌డ‌రు. చాలా కూల్‌గా ఉంటారు. ఆయ‌న నేను క‌లిసి కొంత కాలం ప‌ని చేశాం. ఈ పుస్తకం పార్ట్ -2 రావ‌డం అనేది చాలా మంచి ఆలోచ‌న ఆల్ ద బెస్ట్ జ‌య్‌కుమార్ అని అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… 5రోజుల క్రితం నాకు ప్ర‌భు గారు ఫోన్ చేసి చెప్పారు ఇలా పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ చేయాల‌ని అని గుంటూరు నుంచి జ‌య్‌కుమార్‌గారు కూడా చెప్పారు. నా సినిమాల‌కు కూడా ఆయ‌న కో డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఆయ‌న‌ది ఎంత చ‌క్క‌టి ప్లానింగ్ ఉంటుందంటే. చాలా ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఇటువంటి మంచి పుస్త‌కాన్ని నా చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుస్త‌కం చ‌దువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్త‌కం మంచి స‌క్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావ్ మాట్లాడుతూ…చాలా మంచి ఫంక్ష‌న్‌లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుస్త‌కాలు రావ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

జ‌య్‌కుమార్ మాట్లాడుతూ… 40ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. దీనికి బ‌దులు ఏ రెవెన్యూ  డిపార్ట్ మెంట్‌లోనో ఉండేవాడ్ని కాని ఈ ఆనందం ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉండ‌దు. ఇంత పెద్ద‌వాళ్ళ‌తో ప‌రిచ‌యం ఎంతోమంది ప్ర‌ముఖుల‌తో పంచుకున్న ఆనందం ఇవ‌న్నీ ఎప్పుడూ ఉంటాయి. విద్యాసాగ‌ర్‌గారు ఫిల్మ్ అప్రిసియేష‌న్ క్లాసెస్ అని త‌న క‌ళాశాల‌లో నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆయ‌న‌కు అది చాలా చిన్న జాబ్ కావొచ్చుకాని నాకు అది చాలా పెద్ద ఉద్యోగం. నాకు ఉద్యోగం ఇచ్చి న‌న్ను ప్రోత్స‌హించారు. నేను అడ‌గ‌కుండానే నా పుస్త‌కాల‌ను ప్ర‌చురించినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ పుస్త‌కంలోని జోకులు చాలా మంది చ‌దివి చాలా బావున్నాయ‌ని చెప్పారు. ఇవ‌న్నీ నాకు మ‌ధుర‌జ్ఞాప‌కాలు. ముఖ్యంగా మా చైర్మెన్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు