సీటీమార్‌ మూవీ రివ్యూ

Published On: September 10, 2021   |   Posted By:

సీటీమార్‌ మూవీ రివ్యూ

సెకండాఫ్ ‘మార్’కానీ..: ‘సీటీమార్‌’రివ్యూ
Rating:2.5/5

 

మాస్ సినిమాలలో పుట్టి,పెరిగినట్లుగా కెరీర్ ప్రారంభం నుంచి యాక్షన్ సినిమాలనే నమ్ముకుంటూ ముందుకెళ్తున్న హీరో గోపిచంద్. అతని సినిమాల్లో విలన్స్, ఆయుధాలు,ఫైట్స్ కామన్. అయితే ఈ సారి స్పోర్ట్స్ డ్రామాతో ఈ హీరో మన ముందుకు వచ్చారు. మాస్ ఎలిమెంట్స్ మాత్రం కామన్. ఈ రెంటిని ఎలా ముడేసారు. అసలు ఈ చిత్రం కథేంటి, సినిమాలో కబడ్డీకు ఉన్న ప్రయారిటీ ఏమిటి వంటి విషయాలు చూద్దాం.
 
స్టోరీ లైన్

కార్తీక్‌ సుబ్రహ్మణ్యం (గోపీచంద్‌) కు తన తండ్రి  ఆత్రేయపురంలో పెట్టిన రామకృష్ణా మెమోరియల్ స్కూల్  కు ఇప్పుడు డిమాండ్ లేదు అని బాధగా ఉంటుంది. కార్తీక్‌   స్పోర్ట్ కోటాలో బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నవాడు. ఆంధ్రా  మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌.  దాంతో తనకు వచ్చిన కబడ్డీ ఆటతోనే ఆ స్కూల్ ని తిరిగి నిలబెట్టాలనకుంటాడు. అందుకోసం ఆ స్కూల్ స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవిల్లో ఛాంపిషన్ షిప్ తేవాలనుకుంటాడు. అప్పుడు యధావిధిగా తమ స్కూల్ కు పేరు వచ్చి తిరిగి పూర్వ వైభవం వస్తుందనేది అతని ఆలోచన. అందుకోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఎంతమంది వెనక్కి లాగినా మొండిగా ముందుకు వెళ్లి టీమ్‌ ని నేషనల్‌ పోటీలకు ఎంపిక చేయిస్తాడు. అయితే అప్పుడే ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ టీమ్ కిడ్నాప్ కు గురి అవుతుంది. ఇంతకీ ఆ కిడ్నాప్ చేసిందెవరు. అసలు ఈ కిడ్నాప్ వెనక అసలు కథేంటి…చివరకు ఆ టీమ్ గెలిచిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

స్క్రీన్ ప్లే ఎనాలసిస్


ఇలాంటి కథలు మన తెలుగు తెరకు కొత్తేమీ కాదు. గతంలో ‘గోల్కొడ హైస్కూల్’, ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’లు కూడా తమ స్కూల్ ని కాపాడుకోవటానికి స్పోర్ట్స్ తో రంగంలోకి దూకుతాయి. అయితే వాటిల్లో కిడ్నాప్ డ్రామా ఉండదు. కథ ఒకే పాయింట్ చుట్టూ వెళ్తుంది. స్పోర్ట్స్ , అందులో విలన్స్ ప్రధాన కథ. ఉప కథలకు ఆస్కారం లేదు. ఇక్కడ ఉపకథను ప్రధాన కథతో సమానంగా చుట్టేసారు. అదే ఈ సినిమాకు ఉన్న ప్లస్, మైనస్. అయితే గోపిచంద్ ని హీరోగా పెట్టుకున్నప్పుడు ఇలాంటి క్రైమ్ డ్రామా తీసుకోవాల్సిందే. వేరే దారి లేదని ఫిక్స్ అయ్యి చేసినట్లున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ లోనే విలన్  తీసుకుంటే మళ్లీ పాత కథనే చెప్పినట్లు ఉంటుందని భావించినట్లున్నారు. అలా ఈ సినిమా రెండు కథలతో ముందుకు వెళ్తుంది. దాంతో అసలు కథ ఏదైతే ఉందో దాని ప్రయారిటీ తగ్గిపోయింది. సెకండాప్ వేరే కథతో నిండిపోయింది. క్లైమాక్స్ కు వచ్చేసరికి రెండు కలిసాయి. అయితే ఇది ఒక్కడు సినిమాని గుర్తు చేస్తుంది. అయితే ఒక్కడులో కబడ్డి అనే పాయింట్ చుట్టూ తిరిగే సినిమా అని చెప్పరు. స్పోర్ట్స్ డ్రామా గా ప్రచారం చేయలేదు. దాంతో కబడ్డి అనేది అందులో ఒక పార్ట్ గా కలిసిపోయింది. అదే ఈ రెండిటి తేడా.
 
 
సాంకేతికంగా చూస్తే..

టెక్నికల్ గా సినిమా సౌండ్ గానే ఉంది. మణిశర్మ ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  అదరగొట్టేశాడు. అలాగే సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌,డైలాగులు,షాట్ డివిజన్ ,నటీనటుల ఫెరఫార్మెన్స్ అన్ని సమపాళ్లలో అమిరాయి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్ వాల్యూస  సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. సంపత్ నందిలో డైరక్టర్ మరోసారి తన మాస్ జులం విదిలించాడు.

 
నటీనటుల్లో..

నటుడిగా గోపీచంద్ పాత్రకు న్యాయం చేసాడు. కథ మీద నమ్మకంతో మరికాస్త ఎనర్జీతో అలరించాడు.  యాక్షన్ & సెంటిమెంట్ ను పండించడంలో గోపీ తనేంటో చూపించాడు. తమన్నా క్యారక్టర్ చిన్నదే అయినా పాత్రోచితం అనిపించుకుంది. ఇంకో హీరోయిన్ గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. కీలక పాత్రలో భూమిక, రెహమాన్ అలరించగా.. విలన్ గా తరుణ్ ఆరోరా సినిమాకి ప్లస్ అయ్యారు. రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భర  తమ పాత్రల కి న్యాయం చేశారు.
 
చూడచ్చా
 
మాస్ సినిమాలకు నచ్చేవరికి ఇది విందు భోజనమే
 
తెర ముందు..వెనక

 బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్;
న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా, అప్సర రాణి (స్పెషల్ సాంగ్) త‌దిత‌రులు; ఛాయాగ్రహణం: ఎస్‌. సౌందర్‌ రాజన్‌;
సంగీతం: మ‌ణిశర్మ;
ఎడిటింగ్: త‌మ్మిరాజు;
 క‌ళ‌: సత్యనారాయణ డి.వై;
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి;
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నంది;
స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్;
రన్ టైమ్: 138 నిముషాలు
విడుద‌ల‌: 10-09-2021