Reading Time: 2 mins

సీతారామం చిత్రం ప్రీరిలీజ్ఈవెంట్

సీతారామం’ అందరూ తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా: ‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ?  మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది.  దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, సూపర్ స్టార్. మహానటి లాంటి గ్రేట్ ఫిల్మ్ లో చేశారు. మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే రష్మిక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదు.  స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుంది. హను గారు అద్భుతమైన దర్శకుడు. సుమంత్ ఒక పాత్ర చేశారంటే చాలా స్పెషల్ గా వుంటుంది. దాని గురించి తెలుసుకోవాలని వుంది. అశ్విన్ దత్ గారు లాంటి గొప్ప నిర్మాత తెలుగులో వుండటం మా అదృష్టం. ‘సీతారామం’ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి. భారీ బడ్జెట్, గొప్ప నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి” అని కోరారు.

దుల్కర్ సల్మాన్  మాట్లాడుతూ..  ప్రభాస్ గారు ఈ ఈవెంట్ కి రావడం ఎంతో ఆనందంగా వుంది. సీతారామం గ్రేట్ జర్నీ. స్వప్న దత్ వండర్ విమెన్. అశ్విన్ దత్ గారు నా ఫేవరేట్ పర్శన్. నాపై ఎంతో వాత్సల్యం చూపిస్తారు. హను రాఘవపూడి గారు గొప్ప ప్యాషన్ వున్న దర్శకుడు. సీతారామం అనే గొప్ప కల కన్నారు. ఆ కలలో నన్ను భాగం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చాలా ప్రదేశాలు చూశాను. సీతారామం చాలా స్పెషల్ ఫిల్మ్. సీత పాత్రలో మృణాల్ చాలా సిన్సియర్ గా అందంగా నటించారు. సుమంత్ నాకు బిగ్ బ్రదర్. విష్ణు శర్మ పాత్రని అద్భుతంగా చేశారు.  తరుణ్ భాస్కర్ స్మైల్ గొప్ప ఎనర్జీ ఇస్తుంటుంది. సీతారామం అద్భుతమైన సంగీతం, సాంకేతిక విలువలు వున్న లార్జర్ దెన్ లైఫ్ మూవీ. ఈ సినిమాని అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ప్రభాస్ గారు ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది. సీతారామం నన్ను నేను సంస్కరించుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఫిలిం మేకింగ్ లో సలహాలు తీసుకోవడం చాలా అవసరం. నాకు ఇన్నాళ్ళు అలా సలహాలు ఇచ్చే వాళ్ళు లేరు.  సీతారామంలో మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది వున్నారు.  సీతారామం తో మరో మెట్టు ఎదిగానని భావిస్తున్నా.  ఆగస్ట్ 5న మీరే చూస్తారు. సీతారామం జర్నీలో కలసిన మొదటి వ్యక్తి స్వప్న దత్. సీతారామం ఇంత గొప్పగా రావడానికి కారణం స్వప్న. ఈ సినిమాక్రిడిట్ అంతా స్వప్నకి దక్కుతుంది. వైజయంతీ మూవీస్,  స్వప్న సినిమా కలసి చేస్తున్న  ఈ చిత్రం గొప్పగా ఉండాలనే తపన స్వప్న గారిలో ప్రతి క్షణం కనిపించేది. సీతారామం లాంటి సినిమా చేయడం అంత సులువు కాదు. ఇదొక యుద్ధం. యుద్ధానికి రాజు మంత్రి వెళ్తే సరిపోదు. వందలాది మంది సైన్యం కావాలి. స్వప్న గారు ఈ యుద్ధానికి యోధాలని తెచ్చిపెట్టింది. చివరికి సినిమా ప్రమోషన్స్ కి బాహుబలిని తెచ్చి పెట్టింది. రామ్ పాత్ర కోసం అన్వేషణ చేస్తున్నపుడు స్వప్నగారు మళ్ళీ దారి చూపించారు. దుల్కర్ ఐతే అద్భుతంగా వుంటుందని చెప్పారు. దుల్కర్ కి కథ నచ్చింది. అలా రాముడు ఈ కథలోకి వచ్చారు. షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకునే లోపల కరోనా వచ్చింది. అయితే ఈ గ్యాప్ లో దొరికిన సమయం ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఉపయోగపడింది. సీత పాత్రకు మరో ఛాలెంజ్. నటన అద్భుతంగా వచ్చుండాలి. కొత్త ముఖం కావాలి. చాలా విరుద్దమైన కాంబినేషన్ ఇది. మృణాల్ పేరుని నాగ్ అశ్విన్ గారు స్వప్నకి చెప్పారు. స్వప్న నాకు చెప్పారు. అలా సీత దొరికింది. విష్ణు శర్మ పాత్ర కోసం సుమంత్ గారిని అనుకున్నపుడు ఆయన్ని కలవడానికి మొదట భయం వేసింది. స్వప్న గారి ద్వారా వెళ్లాను. ఆయన కథ మొత్తం చదివి  గొప్పగా వుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అఫ్రిన్ పాత్ర కోసం రష్మికని అనుకున్నాను. మళ్ళీ స్వప్న గారి ద్వారానే వెళ్లాను. కథ ఆమెకు చాలా నచ్చి వెంటనే సైన్ చేశారు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ గారికి స్పెషల్ థాంక్స్. నేను కేవలం దర్శకత్వం చేసుకుంటే చాలు అనే కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి చేసిన సంగీతం చిరకాలం నిలిచిపోతుంది. సీతారామం ఇప్పటికే ముఫ్ఫై సార్లు చూశాను. ఈ సినిమా చూస్తున్నపుడు మీ ఫోన్ వైపు ఒక్కసారి కూడా చూడరు. మిమ్మల్ని మీరు స్క్రీన్ కి అంకితం చేసుకుంటారు. మీ చూపు ఒక్క సెకన్ కూడా పక్కకు జరగదు. ఇది గ్యారెంటీ. మనకి బాగా కావాల్సిన బంధువులు ఇంటికి వచ్చి వెళ్లిపోతున్నపుడు మరికాసేపు వుంటే బావుండనిపిస్తుంది. సీతారామం కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ కి వస్తారు. మళ్ళీ చూస్తారు. మళ్ళీ మళ్ళీ వస్తారు. సీతారామం ఒక మంచి వ్యసనం. ఈ సినిమా మీ మనసు నుండి వెళ్ళదు. నాకు బేసిగ్గా సభా పిరికి. కానీ ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం సినిమా వచ్చిన విధానం. నటీనటులు అద్భుతమైన ఫెర్ఫార్మమెన్స్. అందరికీ థాంక్స్. స్వప్న, అశ్వనీదత్ లకు స్పెషల్ థాంక్స్” తెలియజేశారు.

నిర్మాత స్వప్న మాట్లాడుతూ.. ప్రభాస్ గారికి స్పెషల్ థాంక్స్. ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి..  మా కోసం వచ్చారు. రెండు..  సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు. హను వండర్ ఫుల్ ఫిలిం మేకర్. దుల్కర్,  మృణాల్, సుమంత్, రష్మిక .. అందరికీ థాంక్స్. ఇలాంటి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. నాన్నగారి వలనే ఇది సాధ్యమైయింది.

మృణాళ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారు ఈ ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా వుంది. సీతారామం మెస్మరైజ్   జర్నీ. కాశ్మీర్, సిద్ పూర్, హైదరాబాద్, రష్యా.. ఇలా అనేక చోట్ల షూటింగ్ చేశాం. ఒక నటిగా ఎంతో తృప్తిని ఇచ్చిన చిత్రమిది. సీత లాంటి గొప్ప పాత్ర ఇచ్చిన దర్శకుడు హను గారికి కృతజ్ఞతలు. సీత పాత్రకు న్యాయం చేశాననే భావిస్తున్నా.  సీత పాత్రని హను గారు అద్భుతంగా రాస్తే.., స్వప్న గారు అత్యద్భుతంగా ఇమాజిన్ చేశారు. అశ్విన్ దత్  గారు గొప్ప వాత్సలన్ని చూపించారు. రామ్ పాత్రలో దుల్కర్ గారు మ్యాజిక్ చేశారు. వైజయంతి మూవీస్, హను, దుల్కర్, రష్మిక, సుమంత్ .. ఇదంతా డ్రీం కాంబినేషన్. సీతారామం గ్రేట్ లవ్ స్టొరీ. విజువల్ వండర్. ప్రేక్షకులు తప్పకుండా ఆగస్ట్ 5న సినిమాని థియేటర్ లో చూడాలి”  అని కోరారు.

నిర్మాత అశ్వనీ దత్ మాట్లాడుతూ.. మై డార్లింగ్ ఇంటర్ నేషనల్ హీరో ప్రభాస్ కి థాంక్స్. దుల్కర్ సల్మాన్, మృణాల్, సుమంత్  అందరికీ థాంక్స్. ప్రియాంక ప్రాజెక్ట్ కే పనుల్లో బిజీగా వుంటే స్వప్న  సింగల్ హ్యాండ్ తో సీతారామం ను చాలా చాకచక్యంగా నడిపింది. స్వప్నకి హ్యాట్సప్. హను దగ్గర మంచి కథ వుంది వినమని స్వప్న చెప్పింది. ఆ కొద్దిరోజులకే వరల్డ్ హీరో నాకు కాల్సీట్లు ఇస్తున్నారని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇది మనకి స్వర్ణ యుగమే అనుకున్నాను. మృణాల్, దుల్కర్, సుమంత్ కి థాంక్స్. కరోనా సమయంలో కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఓ సీత కథతో ఇండస్ట్రీలోకి వచ్చిన నేను ఎప్పటికైనా మంచి ప్రేమకథ తీయాలని కోరుకునే వాడిని. సీతారామంతో ఆ కోరిక తీరింది. డీవోపీ పీఎస్ వినోద్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారికి కి థాంక్స్. అందరికీ కృతజ్ఞతలు. ప్రభాస్ గారు ఈ ఈవెంట్ రావడం ఎంతో ఆనందంగా వుంది” అన్నారు.

సుమంత్ మాట్లాడుతూ.. ఈవెంట్ కి వచ్చిన డార్లింగ్ ప్రభాస్ గారికి థాంక్స్. ఆగస్ట్ 5న వింటేజ్. ఎపిక్, దృశ్యకావ్యం చూడబోతున్నారు.  నా పాత్ర గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. అందులో ఒక సర్ ప్రైజ్ వుంటుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన హను, స్వప్న కి థాంక్స్. దుల్కర్, మృణాల్, రష్మిక.. ఇలా వండర్ ఫుల్ టీంతో కలసి పని చేయడం చాలా హ్యాపీ గా వుంది. ఆగస్ట్ 5 న సీతారామం వస్తోంది. ఈ చిత్రాన్ని మీరంతా ఖచ్చితంగా ప్రేమిస్తారు” అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ వేడుక విచ్చేసిన ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. శేఖర్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా వున్నపుడు ‘అందాల రాక్షసి’  సినిమాని థియేటర్లో చూశా. ప్రమోషన్స్, విజువల్స్, మ్యూజిక్ చాలా నచ్చాయి. దర్శకుడిగా హను రాఘవపూడి ఒక స్ఫూర్తి. సీతారామంను అద్భుతంగా తీశారు. నాకు చాలా నచ్చింది. దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం సీతారామంలో చూస్తారు. దుల్కర్  ఫెర్ఫార్మమెన్స్ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. ప్రేక్షకులని నవ్విస్తాడు ఏడిపిస్తాడు రామ్ పాత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాడు. వైజయంతి మూవీస్ లో మృణాల్ పరిచయం కావడం ఆనందంగా వుంది. సీత పాత్రలో చాలా అందంగా కనిపిస్తుంది. సీతారామం గ్రేట్ లవ్ స్టొరీ. హను చాలా అందంగా జలసీ ఫీలయ్యేలా తీశారు (నవ్వుతూ). స్వప్న, ప్రియాంక, మావయ్య చాలా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. స్మాల్ బడ్జెట్ ఫిలిం మేకర్ ని  సీతారామం లాంటి బిగ్ బడ్జెట్ సినిమాకి పరిచయం చేసిన దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న  గారి థాంక్స్. హను, దుల్కర్, మృణాల్ .. చాలా స్ఫూర్తిని ఇచ్చారు” అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రభాస్ గారికి థాంక్స్. నన్ను ఈ ఈవెంట్ కి పిలిచిన నాగ్ అశ్విన్ గారికి థాంక్స్. దర్శకుడు హను రాఘవపూడి గారు నాకు ముందు నుండి తెలుసు. మైనస్ 24డిగ్రీలో ఎంతో ప్యాషనేట్ గా షూటింగ్ చేశారు. దుల్కర్ , మృణాల్, సుమంత్, రష్మిక, తరుణ్ భాస్కర్ అందరికీ మంచి హిట్ రావాలి’ అని కోరుకున్నారు.