సురాపానం చిత్రం జూన్ విడుదల

Published On: May 19, 2022   |   Posted By:

సురాపానం చిత్రం జూన్ విడుదల

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మాతగా సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుంది.

హీరో చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా చూపిస్తూ , హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచామని, సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా నయన్ నటించగా ఇతర ముఖ్య పాత్రలలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్ ,మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , విద్యాసాగర్ , అంజి బాబు , మాస్టర్ అఖిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించగా , ఫోటోగ్రఫీ : విజయ్ ఠాగూర్ , ఎడిటర్ : J P,మాటలు : రాజేంద్రప్రసాద్ చిరుత, సాహిత్యం : సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్, ఆర్ట్ : భూపతి యాదగిరి, కొరియోగ్రఫీ : సురేష్ కనకం, కో-డైరెక్టర్ : శ్రీనివాస్ రాయి,
నిర్మాత : మట్ట మధు యాదవ్,కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సంపత్ కుమార్.