సురాపానం చిత్రం సక్సెస్ మీట్
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “సురాపానం”. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నటుడు విద్యాసాగర్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో మిస్టర్ జాన్ అనే క్యారెక్టర్ లో నటించాను. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. మంచి సినిమా తీస్తే తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పేందుకు మా సినిమానే ఉదాహరణ. ఈ సంస్థలో మరిన్ని చిత్రాలు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు లక్ష్మణ్ మీసాల మాట్లాడుతూ..సురాపానం సినిమా బాగుందన్న టాక్ వచ్చింది. అయితే కావాల్సినన్ని థియేటర్స్ దొరకలేదు. పబ్లిక్ టాక్ తో ఈ వారం థియేటర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఫన్, ఎమోషన్ ఉన్న సురాపానం సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. మంచి టీమ్ ఎఫర్ట్ వల్లే ఇవాళ చిత్రానికి విజయం దక్కింది. దర్శకుడు సంపత్ కుమార్ ప్లానింగ్ వల్లే ఇది సాధ్యమైంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు, మీడియాకు కృతజ్ఞతలు. అన్నారు.
హీరో, దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ…మేము 10 జూన్ విడుదల అని ప్రకటించినప్పుడు చాలా పెద్ద సినిమాల మధ్య ఎలా విడుదలకు వెళ్తున్నారు అని అడుగుతున్నారు. అయితే మాకు సినిమా మీదున్న నమ్మకమే ముందుకు నడిపించింది. సినిమా కొత్తగా ఉంది, ఎంటర్ టైనింగ్ గా ఉంది అని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ వారం నుంచి థియేటర్స్ పెరుగుతున్నాయి. ఆడియెన్స్ కోరుకునే కొత్తదనం మా సినిమా ద్వారా ఇవ్వడం ద్వారానే విజయం దక్కింది. చిన్న చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్స్ దొరకవు. కానీ సినిమా బాగుంటే థియేటర్స్ క్రమంగా పెరుగుతాయి. మా చిత్రం కూడా ఇలాగే జరగడం సంతోషంగా ఉంది. మా టీమ్ తో పాటు నిర్మాతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నిర్మాత మట్ట మధు యాదవ్ నేను కథ చెప్పినప్పటి నుంచి నమ్మాడు. మేము అనుకున్నట్లు సినిమాను నిర్మించాడు. అతని నమ్మకమే ఇవాళ మాకు దక్కిన విజయం అనుకుంటా. అన్నారు.
హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ…ఈ సినిమా విజయోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు తెరకు కొత్త అమ్మాయిని అయినా టీమ్ అంతా సహకరించారు. సినిమా కోసం మేము పడిన కష్టమే ఈ విజయాన్ని అందించింది అనుకుంటున్నాను. మాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. అన్నారు
ఈ కార్యక్రమంలో ఎడిటర్ జేబీ, మీసాల లక్ష్మణ్, నటులు గిరి పోతురాజ్, విద్యా సాగర్, అంజిబాబు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.