Reading Time: 5 mins
సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు
 
 
హైదరాబాద్ :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  అల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు ,టి .ఆర్ .యస్. నాయకుడు మరియు మాజీ జి. హెచ్.యమ్ .సి. ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ ఆద్వర్యం లో అభిమానులు నానక్రామగుడ లోని విజయ నిర్మల హౌస్ లో సూపర్ స్టార్ కృష్ణ ను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసారు . తదనంతరం సమస్త కార్యాలయం లో దిడ్డి రాంబాబు కేక్ కట్ చేయగా, అభిమానులు రాజా రెడ్డి , యన్ .యస్ కే . రాజు , యస్ . మహేందర్ , యశ్వంత్, నాగేంద్ర, శరత్, శ్రీను, బ్యాంకు రాజు, తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .  
 
విజయవాడ-1:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా అల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షుడు సుధా స్వామి ఆద్వర్యం లో విజయవాడ గవర్నర్ పేట లెనిన్ సెంటర్ ఓం శ్రీ నాగ సాయి బాబా మందిరం వద్ద సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు . ఈ కార్యక్రమం లో  ముఖ్య అతిధి గా పాల్గొన్న సెంట్రల్ యమ్ .యల్ .ఏ . మల్లాది విష్ణు కేక్ కట్ చేసి 200 మంది పేదలకు నిత్యావసర సరుకులను అందించారు . ఈ కార్యక్రమం లో విజయవాడ సానిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్బారావు తో పాటు అభిమానులు నాగరాజు , మురళి , టైలర్ బాబు, శ్రీనివాస్  తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు . 
 
గుంటూరు-1:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా గుంటూరు లిబర్టీ థియేటర్ ఆవరణ లో జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షులు మహమ్మద్ పర్వేజ్ చిష్టి ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న గుంటూరు  తూర్పు వై.యస్.ఆర్.సి.పీ  యమ్ . యల్ ఏ . ముస్తఫా పాల్గొని థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణి చేసారు . యేసు , ముక్కంటి , అబ్రహం , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .
 
ఖమ్మం-1:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  ఖమ్మం లో  సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు తోట  రంగా రావు ,  మహిళా అధ్యక్షురాలు తోట దమయంతి సారధ్యం లో , ఖమ్మం జిల్లా కృష్ణ ఫాన్స్ వ్యవస్థాపకులు బి. బాబాజీ రావు కేక్ కట్ చేయగా , 50 మునిసిపల్  పరిశుద్ధ కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులను  పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు చింతమల్ల గురుమూర్తి , నగర ఉపాధ్యక్షులు మునగాల బాలు , సంఘపు అనిల్ కుమార్ , మురళి మోహన్ రావు , కందుకూరి అశోక్ తదితర అభిమానులు పాల్గొని  తెలియజేసారు . 
 
వైజాగ్-1:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫాన్స్ అసోసియేషన్- డైమండ్ పార్క్ , ఆద్వర్యం లో  జరిగిన జన్మదినోత్సవ వేడుకలలో సంఘం శరత్ థియేటర్ సిబ్బంది కి మరియు ఉత్తరాంధ్ర సినిమా పంపిణి సంస్థలలో పని చేసే ఏజెంట్స్, ఆఫీస్ బాయ్స్ కి నిత్యావసర సరుకులను అందజేశారు . ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షుడు బాగి అప్పల రాజు రెడ్డి , అధ్యక్షుడు వి. సుబ్రహ్మణ్యం (బుజ్జి) , జీరి రమేష్ రెడ్డి, వి. ప్రసాద్ , శ్రీకాంత్, మహేష్ బాబు, జన చైతన్య శ్రీనివాస్ , కేబుల్ శ్రీను, బి. వెంకటప్పారావు , కాకి శ్రీనివాస్ రెడ్డి , సంతోష్ , నాని , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
 
వైజాగ్ -2:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా వైజాగ్ గాజువాక క్లబ్ లో భావినేని సురేష్ , పి . శ్రీధర్ , సి . హెచ్. వేణు ఆద్వర్యం లో నిర్వహించిన రక్త దాన శిబిరం లో 40 మంది అభిమానులు రక్త దానం చేసారు . ఈ సందర్బంగా సీనియర్ అభిమాని భావినేని సురేష్ , “ఈరోజు కృష్ణ గారి అభిమానుల పండగ  రోజు అని , అభిమానులు ఎప్పుడు ప్రజా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అని ఆ స్ఫూర్తి తోనే ఈ రక్త దాన శిబిరం నిర్వహించాము” అని చెప్పారు. మాతా రమణ , ఈశ్వర్ రావు , రెడ్డి , శ్రీను , కంచెరపాలెం డి .మురళి కృష్ణ,  తదితర అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసారు 
 
రాజమండ్రి :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా కృష్ణ అండ్‌ ‌మహేష్‌బాబు సేవా సమితి, తనూజ్‌ ‌ఫ్రెండ్స్ ‌సర్కిల్‌ ‌సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని 13 సినిమా ధియెటర్లలో పనిచేసే 300 మంది సిబ్బందికి కూరగాయలు, కోడిగుడ్లు అందచేశారు. స్ధానిక అశోకాధియెటర్‌ ‌ప్రాంగణంలో కృష్ణ పుట్టిన రోజు వేడుకను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. వైఎస్సార్‌సిపి రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ కోఆర్దినేటర్‌ ‌శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సిపి నాయకుడు జక్కంపూడి గణేష్‌, ‌సిఆర్‌డి డెంటల్‌ ‌హాస్పిటల్‌ ‌వైద్యులు డాక్టర్‌ ‌చింతకుంట రజనీష్‌రెడ్డి, స్వర్ణాంధ్ర సేవాసంస్ధ కార్యదర్శి డాక్టర్‌ ‌గుబ్బల రాంబాబులు ముఖ్యఅతిధిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు సీనియర్‌ అభిమాని ఆసూరి సుధాకర్‌, ‌తనూజ్‌, అయ్యప్ప, ధోని, మణికంఠ, రాజేష్‌, ‌నరేష్‌, ‌కిషోర్‌, ‌శేషు, నక్కిన, మురళి తదితరులు పాల్గొన్నారు.   
 
గుంటూరు-2:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  గుంటూరు లో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు కోట శేషగిరి , కొండబల్లి శ్రీను ఆద్వర్యం లో మునిసిపల్ పరిశుద్ధ కార్మికులు , పోలీస్ సిబ్బంది పండ్లు , బిస్కెట్స్ , మజ్జిగ ప్యాకెట్లను పంపిణి చేయగా , పేద వారికీ అన్నదానం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో సీనియర్ అభిమానులు  యస్ . కే . బాజీ , మోనాజ్ , రమేష్ , నాగేంద్ర , శ్రీనివాస్ రెడ్డి , గుండా హరి , ఉదయ్ ,టి .  నాని, యమ్ . శ్రీను , సుధాకర్ , దేసు , రవి(చిరు ఫ్యాన్ ), తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
  
సత్తెనపల్లి :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా సత్తెనపల్లి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు బాల నాగు ఆద్వర్యం లో శివ షాప్ వద్ద కేక్ కట్ చేసి , వేసవి తాపం తీర్చడానికి శీతల పానీయాలని పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయ వాదులు యమ్ . వి . సుబ్బా రెడ్డి , ఎల్లా రెడ్డి,కటుకం సుధాకర్ , కొబ్బరికాయల సుబ్బా రావు , అంజలి , రంగా , వంకా శ్రీను, సుభాని , సహారా మీరా , సైదా , సయ్యద్ మాబు , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
తెనాలి :
సూపర్ స్టార్ కృష్ణ గారి 78 వ జన్మదినోత్సవం సందర్భముగా తెనాలి సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఆద్వర్యం లో  శ్రీ శ్రద్ధానంద హరిజన కాలనీ లో ని శ్రీ శబరి వృద్ధాలయం లో ఈదర వెంకట పూర్ణ చందు మరియు  షావుల్ సయ్యద్ సౌజన్యం తో భోజన సదుపాయం , ఇన్నమూరి చిన్న (వెంకటేశ్వర్లు ) సౌజన్యం తో వస్త్రాలు పంపిణి చేశారు .
 
ఈ కార్యక్రమం లో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం “సర్కార్ వారి పాట ” టైటిల్ లోగో ఆవిష్కరించి తమ ఆనందం వ్యక్తం చేసారు . ఆకురాతి ఆదినారాయణ , వెజెండ్ల రామకష్ణ , అఫ్రిది సయ్యద్ , సీ యెచ్ పీ సాయి తదితర అభిమానులు   పాల్గొన్నారు. 
 
విజయవాడ -2:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  కృష్ణ జిల్లా , విజయవాడ కృష్ణ లంక నల్ల గేట్ కృష్ణ టీ స్టాల్ లొల్లా కృష్ణ మోహన్ ఆద్వర్యం లో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ అభిమానులు అయినా దొంత రాజు బాబురావు , మాధవ్ శర్మ , వేగి దుర్గా రావు లను సన్మానించారు . మరియు కరోనా విపత్కర పరిస్థితులలో విధులు నిర్వహిస్తున్న మునిసిపల్ పరిశుద్ధ కార్మికులను , పోలీస్ సిబ్బంది 50 మందికి బిర్యానీ ప్యాకెట్  అందజేశారు .   ఈ కార్యక్రమం  లో సుబ్బరామయ్య , రాధా కృష్ణ , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
విజయవాడ-3:
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  విజయవాడ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు యస్.చంటి మరియు వి . యల్. రెడ్డి యూత్ , టీమ్ మహేష్ యూత్ ఫోర్స్ ఆద్వర్యం లో గాంధీ నగరం లో ని  యస్.కే.వి.సి  చిల్డ్రన్స్ ట్రస్ట్ లో నిత్య అవసర సరుకులను అందజేశారు, సున్నపుబట్టీల సెంటర్ లో పండ్లు, మజ్జిగ ప్యాకెట్ లు పంపిణి చేసారు .  ఈ కార్యక్రమం లో సాకేత్ , నవీన్ , ఇబ్రహీం, బాజీ , మహేష్, పాల్గొన్నారు . 
 
ఖమ్మం-2 :
సూపర్ స్టార్ కృష్ణ గారి 78 వ జన్మదినోత్సవం సందర్భముగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ జిల్లా కమిటీ ఆద్వర్యం లో ఖమ్మం ప్రధాన ఆసుపత్రి ఆవరణ లో జిల్లా ప్రధాన వైద్యాధికారి బి వెంకటేశ్వర్లు గారు అన్నం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారు ముఖ్య అతిధి లు గా మాస్క్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహింప బడినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాణోత్ కృష్ణ నగర అధ్యక్షులు పాలెపు రాజేష్ సహాయ కార్యదర్శి సాలే నారాయణ  జిల్లా ఉపాధ్యక్షులు కుక్కల చక్రి కట్ల శ్రీకాంత్ దనాల రవి చిన్నోడు పెద్దోడు టీంకు నరేష్ తదితరులు పాల్గొన్నారు
 
ఖమ్మం-3:
సూపర్ స్టార్ కృష్ణ గారి 78 వ జన్మదినోత్సవం సందర్భముగా కృష్ణ గారి అభిమానులం వాట్సాప్ గ్రూప్ మరియు అల్ ఇండియా ఘట్టమనేని చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం సంయుక్త ఆద్వర్యం లో ఖమ్మం అన్నం అనాదాశ్రమం లో అన్నదానం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో కృష్ణగారి అభిమానులం గ్రూప్ అడ్మిన్ గుమ్మడి రవి కృష్ణ ట్రస్ట్ సభ్యులు పాలెపు రాజేష్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు బాణోత్ కృష్ణIకట్ల. శ్రీకాంత్ పెద్దోడు చిన్నోడు టీంకు నరేష్ తదితరులు పాల్గొన్నారు
 
తిరుపతి :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా తిరుపతి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆద్వర్యం లో డి . ఆర్ . మహల్ ఆవరణ లో కేక్ కట్ చేసి , 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా టౌన్ బ్యాంకు చైర్మన్ నరసింహ చారీ , గంగమ్మ గుడి మాజీ చైర్మన్ దొడ్డా రెడ్డి మునిశేఖర్ రెడ్డి , హేమంత్ యాదవ్ తులసి యాదవ్ ల తో పాటు , అభిమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ , యస్. కే . బాబు , నాగేంద్ర , మధుసూదన్ రెడ్డి , దినకర్ , అచ్చుల సుబ్రహ్మణ్యం ,తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు  
 
ధర్మవరం :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా ధర్మవరం లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల ఆద్వర్యం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమం లో రాజా రెడ్డి, రమణ, జాబి , బాషా, కృష్ణ, షైక్ షా , రంగస్వామి ,  అసిఫ్ , మురళి , జయ , కార్తీక్ , నాని తదితర అభిమానులు  పాల్గొన్నారు . 
 
అమలాపురం :
సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్బంగా  అమలాపురం లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొప్పిశెట్టి నరసింహ మూర్తి ఆద్వర్యం లో గోఖలే సెంటర్ పిల్లల పార్క్ వద్ద కేక్ కట్ చేసి పిల్లలకు  పండ్లు, స్వీట్స్, బిస్కెట్ ప్యాకెట్ లను  పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో  అభిమానులు దొమ్మేటి  శ్రీనివాస్ , కొప్పాడి రమేష్ , పాటి రవి, గోవింద్ ,  వెంకటేష్ తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .