సూర్య 41 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Published On: March 30, 2022   |   Posted By:

సూర్య 41 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

హీరో సూర్య – డైరెక్టర్ బాల కాంబినేషన్ లో 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న “సూర్య 41”

ప్రస్తుతం విభిన్న కథ లతో శరవేగం గా దూసుకుపోతున్న హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం ‘శివపుత్రుడు’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు ,తమిళం లో  మంచి పేరు రావడం తో ప్రేక్షకులలో ఈ కలయిక పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి .

ఈ చిత్రానికి  2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య మరియు జ్యోతిక నిర్మాత లు గా , రాజేశేఖర పాండియన్ సహా నిర్మాత గా వ్యవహరించనున్నారు.”నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని “హీరో సూర్య ట్వీట్ చేసారు.

సూర్య ని సరికొత్త గా ఒక డిఫరెంట్ రోల్ లో చూపించడానికి డైరెక్టర్ బాల ఒక యూనిక్ మరియు ఉద్వేగభరితమైన కథ ని సిద్ధం చేసారు. “సూర్య41” చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని కన్యాకుమారి లో ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం లో సూర్య కి జోడీ గా నటించనుంది, సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు..బాల సుబ్రమణియం సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

కాస్ట్ : సూర్య , కృతి శెట్టి
సాంకేతిక బృందం:
డైరెక్టర్ : బాల
బ్యానర్ : 2డి ఎంటర్టైన్మెంట్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ : బాల సుబ్రమణియం
ఎడిటర్: సతీష్ సూర్య
ఆర్ట్ : మాయపండి
నిర్మాతలు : సూర్య మరియు జ్యోతిక
సహా నిర్మాత : రాజేశేఖర పాండియన్