సెబాస్టియన్ PC 524 మూవీ రివ్యూ
సెబాస్టియన్ పీసీ 524′ రివ్యూ
కిరణ్ అబ్బవరం రెండే సినిమాలు( ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ )తో..అతి తక్కువ కాలంలోనే తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అతని తాజా చిత్రం అనగానే ఏదో వైవిద్యం ఉంటుందనే ఆలోచన అందరిలో కలిగింది. దానికి తగినట్లుగానే ట్రైలర్స్ , పోస్టర్స్ ఆసక్తిగా ఉన్నాయి. కిరణ్ సైతం ఎగ్రిసివ్ గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా హిట్టైతే హ్యాట్రిక్ కొట్టినట్లే అని ట్రేడ్ లెక్కలు వేస్తోంది. మరి ఆ అవకాసం కిరణ్ కు ఈ సినిమా ఇచ్చిందా…భాక్సాఫీస్ ఈ సినిమా ఏ మాత్రం కలిసి వచ్చింది…సినిమా కథేంటి?
Storyline:
రేచీకటి తో ఇబ్బంది పడుతున్న సెబా అలియాస్ సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) కానిస్టేబుల్‌గా తన డ్యూటీ తను చేయలేకపోతాడు. దాంతో చాలా ట్రాన్సఫర్స్ తో ఇప్పుడు మదనపల్లి కు వస్తాడు. అక్కడ నైట్ డ్యూటీ చేస్తూంటే నీలిమా (కోమలి ప్రసాద్) అనే గృహిణి హత్యకు గురవుతుంది. తను రీచీకటితో సరిగా డ్యూటీ చేయలేకపోవడం వల్లే నీలిమా చనిపోయిందనే బాధ పడతాడు సెబా. దాంతో అసలు సెబా మర్డర్ మిస్టరీని ఛేధించాలనుకుంటాడు. తనదైన శైలిలో ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఈ క్రమంలో సెబాకు ఎదురైన సవాళ్లు ఏమిటి? సెబా దర్యాప్తుకు పై అధికారి అంబారామ్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎందుకు అడ్డు తగులుతూ వస్తున్నాడు? నీలిమా హత్యకు ఆమె భర్త రాహుల్ (ఆదర్శ బాలకృష్ణ) ఏమన్నా సంభందం ఉందా ? నీలిమాకు తేజ (రాజా విక్రమ్)కు రిలేషన్ ఏమిటి? సెబాకు తల్లి మేరీ (రోహిణి) ఎలా సపోర్ట్‌గా నిలిచింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Screenplay Analysis:
ఈ సినిమా బేస్ లైన్… రేచీకటి ఉన్నవాడికి కానిస్టేబుల్ ఉద్యోగం రావటం దగ్గరే తేలిపోయింది. ఫన్ కు వినటానికి బాగుంటుంది కానీ…రేచీకటి ఉన్నవాడికి కానిస్టేబుల్ పోస్ట్ వచ్చిందని రియలిస్టిక్ కథ చెప్పటం మొదలెడితే మాత్రం అది లాజిక్కులు లేని సినిమా మొదలెట్టినట్లే. మొదట్లోనే ఇలా తడపడిన సినిమా…కామెడీ కదా ఓకే అనుకుంటాము. అయితే కాసేపటికి మీరు చూస్తున్నది కామెడీ కాదు…క్రైమ్ మూవీ అంటారు..ఓకే క్రైమ్ కామెడీ జానర్ అనుకుంటారు. మరి కాసేపటికి అదీ కాదు థ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కామిక్ థ్రిల్లర్ అనుకోమంటారు..ఇలా అరగంటకు ఓ సారి జానర్ ని ఊసరివిల్లిగా మార్చేసుకునే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది. దానికి తోడు సినిమాలో మెయిన్ ట్విస్ట్ అయిన హంతకులు ఎవరనేది ప్రేక్షకుడుకి రివీల్ చేసేస్తాడు. దాని వల్ల చూసేవాళ్లకు ఆసక్తి ఉండదు. నిజంగా అలా ఓపెన్ చేసేస్తే…ఆ తర్వాత వాళ్ల వల్ల ఈ కానిస్టేబుల్ కు ఎదురయ్యే సమస్యలు మీద కాన్సర్టేట్ చేస్తే కథనం పుంజుకునేది. క్లైమాక్స్ లో ఏదో గొప్ప విషయం ఇన్విస్టిగేషన్ లో తేలుతుందనుకుంటే పేలవంగా తేల్చేసారు. ఫస్టాఫ్ లో ఉన్న ఫన్ …సెకండాఫ్ లో లేక విసుగ్గా అనిపిస్తుంది. ఇలాంటి కథలకు ఫన్ ప్రాణం అనే విషయం మర్చిపోయారు. సీరియస్ మ్యాటర్ ని కూడా ఫన్ సీన్స్ తో చెప్తేనే వర్కవుట్ అవుతుంది. ఏదైమైనా స్క్రిప్టు లోపాలతో ఈ సినిమా తన ప్రాణం తనే తీసుకుంది.
Analysis of its technical content:
రాజ్ కె.నల్లి ఇచ్చిన కెమెరా వర్క్ నీటుగా ఉంది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ కు ఎంచుకున్న లైటింగ్,కెమెరా ఫ్రేమింగ్ ఫెరఫెక్ట్ గా ఉన్నాయి. విప్లవ్ ఎడిటింగ్ మాత్రం షార్ప్ నెస్ మిస్సైంది. జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా నోయిస్ గా ఉంది. పాటలు విషయానికి వస్తే…’హేలీ…’, ‘రాజాధి రాజా…’ పాటలు బావున్నాయి. ‘హేలీ…’ని చిత్రీకరించిన తీరు బావుంది. ‘రాజాధి రాజా…’ ఆకట్టుకుంటుంది. మదనపల్లి టౌన్ లో నాచురల్ లొకేషన్స్ లో ఆచి,తూచి ఖర్చుపెట్టి సినిమా తీసారని అర్దమవుతోంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. స్క్రిప్టు పరంగా సినిమాలో కిక్ లేదు. రేచీకటికి, క్రైమ్ ని కలిపిన విధానం కలిసి రాలేదు. స్క్రీన్ ప్లే రేసీగా రాసుకుని ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది.
నటీనటుల్లో సెబాస్టియన్ క్యారక్టర్ కు తగినట్లు కిరణ్ తనను తాను బాడీ లాంగ్వేజీ మార్చుకున్నాడు. రేచీకటి లోపంతో ఇబ్బందిపడే సీన్స్ లో బాగా చేసాడు. ఎస్సైగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ కూడా సినిమాకు ప్లస్ అయ్యారు. హీరోయిన్స్ ఇద్దరూ తేలిపోయారు. మిగతావాళ్లు సోసో.
నచ్చినవి:
కిరణ్ అబ్బవరం ఎనర్జీ లెవిల్స్
సినిమాటోగ్రఫీ
నచ్చనవి:
బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే
వీక్ క్యారక్టరైజేషన్స్
CONCLUSION:
చూడచ్చా…?
మరీ వీకెండ్ లో ఖచ్చితంగా చూడాలనిపించే సినిమా మాత్రం కాదు. ఓటీటిలో చూసేయచ్చు.
Movie Cast & Crew
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా తదితరులు;
సంగీతం: జిబ్రాన్;
ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి;
దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి;
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు;
రన్ టైమ్ :2h 9m
విడుదల తేదీ: 04-03-2022