సేవాదాస్ చిత్రం మీడియా సమావేశం

Published On: March 14, 2022   |   Posted By:

సేవాదాస్ చిత్రం మీడియా సమావేశం

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”.

సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్ర పోషించిన భానుచందర్, హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్, నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్, సెకండ్ హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష పాలుపంచుకుని చిత్ర విశేషాలు వెల్లడించారు.

బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా “సేవాదాస్” చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “సేవాదాస్” సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు.

నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ… “సేవాదాస్” రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.

ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.

ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ,  కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!