సైదులు చిత్రం లోగో లాంచ్‌

Published On: August 23, 2021   |   Posted By:

సైదులు చిత్రం లోగో లాంచ్‌

 
 బ్రేవ్ హార్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై  బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం “సైదులు“.  అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను  శుక్ర‌వారం హీరో శ్రీకాంత్ త‌న నివాసంలో ఆవిష్క‌రించారు.
 
 
అనంత‌రం శ్రీకాంత్ మాట్లాడుతూ…“సైదులు` టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమా కాన్సెప్ట్ కూడా విన్నాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజ‌యం సాధించి యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ…“మా చిత్రం టైటిల్ లోగో హీరో శ్రీకాంత్ గారు లాంచ్ చేయ‌డం చాలా సంతో షంగా ఉంది. సినిమా ప్రీ -ప్రొడక్ష‌న్ అంతా పూర్త‌యింది. అక్టోబ‌ర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉంటుంది. త్వ‌ర‌లో న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డిస్తాం“ అన్నారు.
 

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః పి.య‌స్ మ‌ణిక‌ర్ణ‌న్‌; సంగీతంః ఆర్‌.ఆర్‌.ధృవ‌న్‌;
కో-డైర‌క్ట‌ర్ః ప‌వ‌న్ ల‌క్ష్మ‌ణ్‌; ఎడిటింగ్ః న‌హీద్‌;  కాస్ట్యూమ్స్ః వి.ప‌ద్మ‌; ఆర్ట్ః వెంక‌టేష్ గుల్ల‌;నిర్మాణంః బ్రేవ్ హార్ట్ పిక్చ‌ర్స్; ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వంః బాబా.పి.ఆర్‌.