హరోం హర మూవీ షూటింగ్ పూర్తి
సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, SSCS హరోం హర షూటింగ్ పూర్తి
సుధీర్ బాబు అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ హరోం హర. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా సుధీర్ బాబు పూర్తి యాక్షన్‌తో కూడిన అవతార్‌లో కనిపించిన టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఫస్ట్ టైటిల్ సింగిల్, ఎనర్జిటిక్ లార్డ్ శివ పాట, సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా సెట్‌లో కేక్ కట్ చేసి చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. వీడియోలో టీమ్ సంతృప్తిగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్ అనేది ఈ హైబడ్జెట్ చిత్రం ట్యాగ్‌లైన్. ఇందులో సుధీర్ బాబుకు జోడిగా మాళవిక శర్మ నటిస్తోంది. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తారాగణం :
సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత : సుమంత్ జి నాయుడు
సంగీతం : చైతన్ భరద్వాజ్
డీవోపీ అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
బ్యానర్ : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్