Reading Time: < 1 min

హిందూపురం కొవిడ్ కేంద్రానికి నంద‌మూరి బాల‌కృష్ణ సాయం

హిందూపురం కొవిడ్ కేంద్రానికి రూ.55 లక్షలు సాయం అందిస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

అగ్ర క‌థానాయ‌కుడు, హిందూపురం శాస‌న‌స‌భ్యుడు నంద‌మూరి బాలకృష్ణ ఈనెల 29, 30న త‌న నియేజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు, ఈ ప‌ర్య‌ట‌న‌లో హిందూపురం  స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలోని కరోనా రోగులకు, వారికి సేవలు అందిస్తున్న యోధులకు రూ.55 లక్షలు విలువైన పరికరాలు, మందులు,  పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణిచేయ‌నున్నారు.  గ‌తంలో క‌రోనా కేసులు పెరుగుతు‌న్న నేపథ్యంలో బ‌స‌తారకం ట్రస్ట్ ద్వారా రూ. 25 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, 100 పీపీఈ యూనిట్లు, మాస్క‌లు అంద‌జేశారు. అలాగే  కరోనాపై పోరాటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయ‌లు విరాళంగా  అందించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి 25 ల‌క్ష‌లు అందించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్న  బాలయ్యను అంద‌రూ అభినందిస్తున్నారు.