Reading Time: 2 mins

హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ

ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు : హీరోయిన్ వర్ష బొల్లమ్మ

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఊరు పేరు భైరవకోన విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

ఊరు పేరు భైరవకోన ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

దర్శకుడు విఐ ఆనంద్ గారు ఈ కథ చెప్పారు. నాకు చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అసలు ఇలాంటి కథ ఎలా అలోచించగలిగారో అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. చేయగలనా? లేదా? అని ఆలోచించుకోవడానికి కొంత సమయం అడిగాను. తర్వాత ఆనంద్ గారు కంప్లీట్ నేరేషన్ ఇచ్చారు. అది విగానే చాలా ఆనందంగా అనిపించింది. చేయగలననే నమ్మకం కుదిరింది.

ఊరు పేరు భైరవకోన లో మీ పాత్ర గురించి ?
ఇందులో భూమి అనే పాత్రలో కనిపిస్తాను. భూమి ట్రైబల్ గర్ల్. తన వూర్లో తనొక్కరే చదువుకున్న అమ్మాయి. చూడటానికి అందంగా అమాయకంగా కనిపిస్తుంది. తప్పుని నిలదీసే ధైర్యం వున్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్ధమౌతుంది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మేలోడీస్ చిత్రాల్లో గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో కనిపించాను. ఇందులో మాత్రం గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ పాత్ర అనాలి(నవ్వుతూ). ట్రైలర్ లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ వుంటుంది. భూమి పాత్రలో చాలా స్ట్రెంత్, పవర్ వుంది.

ట్రైబల్ పాత్ర చేశారు కదా.. ఎలాంటి సవాళ్ళు ఎదుర్కున్నారు ?
నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను. ప్రక్రుతి జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో కూడా మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులని ఆరాధిస్తాం. ఆ రకంగా భూమి పాత్ర నేను రిలేట్ చేసుకునే విధంగా వుంది.

సందీప్ కిషన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
సందీప్ కిషన్ గారు అందరిని చాలా గౌరవంతో చూస్తారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఆయన దయగల మనిషి. మంచి హ్యూమన్ బీయింగ్. గ్రేట్ కో స్టార్.

విఐ అనంద్ గారి సినిమాలు చూశారా? ఈ పాత్రకు మిమ్మల్నే ఎంపిక చేయడానికి కారణం ఏమిటని అడిగారా ?
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా చూశాను. చాలా నచ్చింది. అందులో అన్ని ఎలిమెంట్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. ఈ కథ రాసినప్పుడే భూమి పాత్రకు నాపేరుని రాసుకున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.

ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?

ఊరు పేరు భైరవకోన అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. ప్రేక్షకుడు ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. అద్భుతమైన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇందులో చాలా మంచి సందేశం కూడా వుంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్ నిర్మాతల గురించి ?
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్ నిర్మించారు. రాజేష్ గారు చాలా కూల్ గా వుంటారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.

పాత్రల ఎంపికలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు కదా?
నిడివి తక్కువ వునప్పటికీ సినిమాలో ప్రాధన్యత వున్న పాత్రలని చేయడానికే ఆసక్తిని చూపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ అలా వచ్చినవే.

మీ అప్ కమింగ్ మూవీస్?
ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని గురించి నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు. తెలుగు తమిళ్ మలయాళంలో చిత్రాలు చేశాను. త్వరలో కన్నడలో కూడా చేసే అవకాశం వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ