హీరో త్రిగుణ్ మీడియా సమావేశం
‘లైన్ మ్యాన్’.. నటుడిగా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే : హీరో త్రిగుణ్
తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 22న ‘లైన్ మ్యాన్’ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ సినిమా గురించి మాట్లాడుతూ
‘లైన్ మ్యాన్’ సినిమా కథతో పాటు మరో రెండు కథలను కూడా నిర్మాతలు నాకు పంపారు. అయితే ఆ మూడింటిలో నాకు లైన్ మ్యాన్ కథే బాగా నచ్చింది. ఫన్ ఎంటర్టైనర్గా సినిమా ఉంటూనే మంచి మెసేజ్‌ను కూడా సినిమా ఇస్తుంది. అది కూడా మన ప్రకృతికి సంబంధించిన విషయం కావటంతో నాకు కనెక్ట్ అయ్యింది. నేను ఈ కథను సెలక్ట్ చేసుకున్నాను.
నటుడిగా 23 సినిమాలు చేశాను. అయితే ‘లైన్ మ్యాన్’ సినిమా ఓ ప్రత్యేకమైన చిత్రంగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా చేయటంపై గర్వంగా కూడా అనిపించింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయనటువంటి లైన్ మ్యాన్ కథతో సినిమా అనేది అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను కలిగించే విషయమే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ గంటపాటు కరెంట్ పోతే మనమెంత బాధపడతామో తెలుసు. అలాంటిది ఓ గ్రామంలో పదిరోజుల పాటు కరెంట్ లేకుండా పోతే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనేది సినిమా. అయితే అన్నిరోజుల పాటు గ్రామంలో కరెంట్ ను లైన్ మ్యాన్ ఎందుకు తీసేశాడనేది సినిమా. చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్ ఉంటుంది.
డైరెక్టర్ రఘుశాస్త్రిగారు మంచి రైటర్. ఆయనతో ఉన్న అనుబంధంతో పాటు చెప్పిన పాయింట్ నచ్చటంతోనే లైన్ మ్యాన్ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. రఘశాస్త్రిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. మనం మన పల్లెటూర్లో ఉన్నట్లే నేచురల్ గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.
లైన్ మ్యాన్ సినిమాను ముందు నిర్మాతలు కన్నడలోనే చేయాలని అనుకున్నారు. కానీ నాకు ఇక్కడ కాస్త మంచి గుర్తింపు ఉండటంతో తెలుగులోనూ రిలీజ్ చేయటానికి తర్వాత డిసైడ్ అయ్యారు. ఆ పంథాలోనే మేకింగ్ ను కూడా ప్లాన్ చేసుకున్నారు కూడా. కామెడీ, చిన్న లవ్ పాయింట్‌తో పాటు హార్ట్ టచింగ్ మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది.
నేను నటుడిగా నాజర్నీని స్టార్ట్ చేసి పదిహేనేళ్లు అవుతుంది. ఇప్పటికీ కొత్తగా వచ్చినట్లే ఉంటుంది. అందుకనే కొత్తగా సినిమాలు చేయాలనే ఆలోచనతోనే సాగుతున్నాను. అదే నన్ను ఇంకా అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. కమర్షియల్ సినిమాలు చేయాలని, మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనతో నేను వర్క్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. నాతో సినిమా చేసిన నిర్మాతకు దాని వల్ల లాభాలే తప్ప నష్టాలుండకూడదని నమ్ముతాను. అదే ఫాలో అవుతున్నాను.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించటానికి వెనుకాడను. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించాను. అందులో 11 అవర్ ఒకటి. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నూ నటిస్తున్నాను. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది రిలీజ్ అవుతోన్న నా రెండో చిత్రం లైన్ మ్యాన్. మరో చిత్రాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.