హీరో రాహుల్ విజయ్ ఇంటర్వ్యూ
కాలేజ్ కుమార్ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. – హీరో
రాహుల్ విజయ్.
ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో హరి సంతోష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మార్చి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సందర్భంగా హీరో రాహుల్ విజయ్ తో ఇంటర్వ్యూ…
కాలేజ్ కుమార్ టైటిల్ క్యాచీ గా అనిపించింది, అందుకే ఈ టైటిల్ ను ఫిక్స్
చేశాం, కన్నడలో ఈ సినిమా కాలేజ్ కుమార్ టైటిల్ తో విడుదలై పెద్ద సక్సెస్
అయ్యింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారని
నమ్మకం ఉంది.
కాలేజ్ కుమార్ అనేది కన్నడ రీమేక్, సబ్జెక్టు నచ్చి ఈ సినిమాను తెలుగులో
చేశాం. బేసిక్ లైన్ తీసుకొని తెలుగులో మన నెటివిటీకి తగ్గట్లు చేసాం.
తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు సినిమాలో మెయిన్ హైలెట్ గా ఉంటాయి.
ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన చదువుకు తగ్గట్లు జాబ్ చెయ్యడం వంటి
విషయాలు ఈ వినిమాలో చర్చించడం జరిగింది. డైరెక్టర్ సంతు గారు కన్నడలో
సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయనే మళ్లీ తెలుగులో డైరెక్ట్ చేశారు.
ప్రస్తుతం ఉన్న పతిస్థితులను బేస్ చేసుకుని ఈ సినిమాను మలచడం జరిగింది.
మధుబాల గారితో, నాజర్ గారితో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చెయ్యడం
సంతోషంగా అనిపించింది, వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా షూటింగ్
అంతా చాలా సరదాగా జరిగింది. మా ట్రైలర్ , సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి
రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని నమ్ముతున్నాను.
నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నేను
నా వంతు పూర్తి కృషి చేస్తాను, రిజస్ట్ అనేది మన చేతిలో ఉండదు.
ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఉన్న సినిమా కాలేజ్ కుమార్. అందరూ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు, కనెక్ట్ అవుతారు.
ప్రసుతం “బ్లాక్ అండ్ వైట్” అనే థ్రిల్లర్ చేస్తున్నాను. కొత్త దర్శకుడు
ఈ సినిమా చేస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి వాటి
వివరాలు త్వరలో తెలుపుతానని ఇంటర్వ్యూ ముగించారు.
బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్: ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్
నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు