హీరో శ్రీ‌రామ్ ఇంటర్వ్యూ

Published On: October 22, 2021   |   Posted By:
 
హీరో శ్రీ‌రామ్ ఇంటర్వ్యూ
 
వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన “అస‌లేం జ‌రిగింది” సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యింది.  
 
గ‌తంలో ‘ఒక‌రికి ఒక‌రు’ సినిమాలో న‌టించిన శ్రీ‌రామ్ ఈ సినిమాతో మ‌ళ్లీ హీరోగా తిరిగొస్తున్నారు.
 
ఇంత‌కుముందు సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేసిన ఎన్‌వీఆర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైనేని నీలిమా చౌద‌రి, కొయ్యాడ కింగ్ జాన్స‌న్ క‌లిసి ఎక్సోడ‌స్ మీడియా ప‌తాకంపై నిర్మించారు. సంచితా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టించింది. గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇందులో ప్రేమ‌, స‌స్పెన్స్, యాక్ష‌న్.. అన్నీ రంగ‌రించి ఉంటాయి.
 
సినిమా గురించి మీడియా ప్ర‌శ్న‌ల‌కు హీరో శ్రీ‌రామ్ ఇలా చెప్పారు..
 
ఈ ప్రాజెక్టు చేయాల‌ని ఎందుకు అనిపించింది?
రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) మంచి ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు. అస‌లేం జ‌రిగింది సినిమా క‌థ నాకు చెప్పేట‌ప్పుడే దాంతో ప్రేమ‌లో ప‌డిపోయాను. క‌థ వినేట‌ప్పుడే ఇది మంచి ప్రాజెక్టు అయినా, ఇందులో చాలా ప‌రిమితులుంటాయ‌ని అర్థ‌మైంది. సినిమాలు చేయ‌డంలో ఈ బృందం మొత్తం చాలా ఉత్సాహంగా ఉండి, నిజాయితీగా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని నాకు తెలియ‌డంతో ఇందులో చేసి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాను.
 
డ‌బ్బింగ్‌లో తెలంగాణ యాస చెప్ప‌డం క‌ష్టం అనిపించిందా?
ఇంత‌కుముందు నా సినిమాల‌కు తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకునేట‌ప్పుడు కొన్ని ప‌దాలు ఇలా కాదు, అలా అనాల‌ని చెప్పేవారు. నాకు హైద‌రాబాదీ తెలుగు బాగా వ‌చ్చు. అది తెలంగాణ యాస‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో నా ప‌ని సులువైంది. హైద‌రాబాదీని కావ‌డంతో ఈ సినిమా డ‌బ్బింగ్ చెప్ప‌గ‌లిగాను. అదొక్క‌టే కాదు, తెలంగాణ ప‌ల్లెల్లో షూటింగ్ జ‌ర‌గ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని ప్రాంతాల‌కు వెళ్ల‌గ‌లిగాను. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు నిర్మాత జాన్స‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు.
 
చెన్నై నుంచి ఇక్క‌డ‌కు షూటింగ్ రావ‌డం ఇబ్బంది అనిపించ‌లేదా?
మొద‌ట్లో అంద‌రూ అలాగే అనుకున్నారు. కానీ చ‌క‌చ‌కా సింగిల్ టేక్‌ల‌లోనే షాట్ల‌న్నీ ఓకే అవుతున్న తీరు చూసి మా యూనిట్ అంతా ఆశ్చ‌ర్య‌పోయింది. మ‌రిన్ని తెలుగు సినిమాలు చేయాల‌ని అంద‌రూ కోరారు. నిజంగానే అవ‌కాశాలొస్తే త‌ప్ప‌కుండా తెలుగు సినిమాలు చేస్తా. రొమాన్స్, ప్రేమ, ఫిక్ష‌న్ అన్నీ క‌ల‌గ‌లిసి ఉన్న ఈ సినిమాలో పాట‌ల్లోని సాహిత్యం నాకు చాలా బాగా న‌చ్చింది.
 
కొత్త హీరోయిన్‌తో చేయ‌డం ఇబ్బంది కాలేదా?
సంచిత సినిమాల‌కు కొత్తే అయినా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం ఆమెది. భాష తెలియ‌క‌పోయినా, త‌న శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డింది. ఈ సినిమా షూటింగ్ బాగా వేడివాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌డం, కొన్నిసార్లు అస‌లు గ్యాప్ లేకుండా చేయ‌డం.. ఇలాంటివి ఎన్నో ఉన్నా అన్నింటినీ సుల‌భంగా త‌ట్టుకుంది. కొన్ని లొకేష‌న్లు అస‌లు అమ్మాయిల‌కు స‌రిపోయేవి కావు. అయినా ఆమె ముందుకు రావ‌డం నాకు చాలా న‌చ్చింది.
 
సినిమా గురించి ఏమంటారు?
ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూసి తీరాల్సిన సినిమా ఇది. టీం మొత్తం చాలా నిజాయితీగా ప‌ని చేసింది. అందుకే ఈ సినిమా చాలా ఆహ్లాద‌క‌రంగా ఉండ‌బోతోంది.