హీరో సందీప్ కిషన్ ఇంటర్వ్యూ
మైఖేల్ విజువల్ గ్రాండియర్ వున్న ఎక్సయిటెడ్ మూవీ : హీరో సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మైఖేల్. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన మైఖేల్కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో హీరో సందీప్ కిషన్ విలేఖరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మైఖేల్ తో పాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా ఈ ఫీలింగ్ ఎలా వుంది ?
మైఖేల్ కథకి, విజువల్ నెరేటివ్ కి, సినిమాకి పాన్ ఇండియా కెపాసిటీ వుంది. విజువల్ గా చాలా ఎక్సయిటింగ్ గా వుంది. యాక్షన్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. యాక్షన్ చాలా రియలిస్టిక్ వైబ్ తో వుంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
ఇందులో మీ పాత్ర వైల్డ్ గా ఉంటుందా ?
మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్ స్టర్ కాకపోయినా మైఖేల్ అనెన్ పాత్ర చాలా ఎగ్రెసివ్. చాలా నెమ్మది అదే సమయంలో రైజ్ అయినప్పుడు మాత్రం చాలా ఎగ్రెసివ్.
మైఖేల్ లో నిజ జీవితానికి సంబధించిన సంఘటనలు కనిపిస్తాయా ?
ఇందులో జరిగిన చాలా సంఘటనలు నాకైతే జరగలేదు. నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందని ఊహించి చేశాను. మైఖేల్ కి ఫ్రండ్స్ వుండరు. ఎవరితో మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సయిటింగా వుంటాయి. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ చేయలేదు.
మైఖేల్ జోనర్ ఏమిటి ?
మైఖేల్ చాలా యూనిక్ స్టొరీ. చాలా కొత్త నెరేటివ్ స్టయిల్ వుంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ చాలా బలంగా వుంటాయి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్ గాయ్స్. బ్యాడ్ పీపుల్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది.
మైఖేల్ ప్రాజెక్ట్ డిజైన్ ఐడియా ఎవరిదీ ?
మైఖేల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన నాదే. దానికి సరపడే డైరెక్టర్ ని ఎంచుకోవడంతో సగం పని పూర్తయింది. భరత్ చౌదరి, మోహన్ రావు గారి లాంటి నిర్మాతలు తోడవ్వడంతో ఇక మా ద్రుష్టి అంతా ప్రోడక్ట్ ని సరిగా డెలివర్ చేయడంపైనే పెట్టాం. మైఖేల్ సినిమా చేయడమే మా సక్సెస్. ఇప్పుడు వరకూ నేను చెయ్యాలనుకోని చేయలేనిది ఏమిటని అలోచించినపుడు మైఖేల్ ఐడియా వచ్చింది. రంజిత్ తీసిన ఒక సినిమా చూశాను. నా ఆలోచన ఆయనకి చెప్పిన నెల రోజుల తర్వాత మైఖేల్ కథ చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ తనకు ఏం కావాలో అది ఇస్తూ సపోర్టు చేసుకుంటూ వెళ్తున్న.
మైఖేల్ తారాగణం గురించి చెప్పండి ?
విజయ్ సేతుపతి గారి పాత్ర సినిమాని ఇరవై నిమిషాలు పాటు మోసుకెళుతుంది. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ఫ్రెష్ గా వుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతు పతి ఎప్పుడూ జంటగా కనిపించలేదు. ఇందులో వారి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంటుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ట్రిక్కిగా వుంటుంది. వీళ్ళంతా కథ, దర్శకుడిపై నమ్మకంతో చేశారు.
ఇంత మంచి నటీనటు ల తో పని చేయడం సవాల్ గా అనిపించిందా ?
లేదండీ. నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో ఎప్పుడూ భయపడలేదు. పాత్రని,, సన్నివేశాన్ని అర్ధం చేసుకోవడంపైనే నా దృష్టి వుంటుంది.
మైఖేల్ లో మీ కష్టం కనిపిస్తోంది. 18 రోజులు పాటు ఏం తీసుకోలేదని విన్నాం ?
ఈ కథలో మైఖేల్ పాత్రని కొట్టి ఐదు రోజులు పాటు తిండి తిప్పలు లేకుండా ఎక్కడో పారేసుంటారు. ఆ సీన్ చేస్తున్నపుడు నిజంగానే వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజులు పాటు ఆ డైట్ లో వున్నాను. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అప్పుడు ఒక ఫైట్ షూట్ చేశాం. పొరపాటు న కాలు రాంగ్ గా లాండ్ కావడంతో ఇంక ప్యాకప్ చెప్పాం. దీంతో పాటు షూటింగ్ కూడా చాలా డార్క్ ఏరియాల్లో చేశాం. గాజు పెంకులు గుచ్చుకునేవే. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించుకున్న సినిమా ఇది. చాలా వర్క్ సాటిస్ఫాక్షన్ వుంది.
గ్యాంగ్ స్టర్ సినిమాల్లో మైఖేల్ ప్రత్యేకత ఏమిటి ?
గ్యాంగ్ స్టర్ ప్రపంచంలో సెట్ చేసిన ఎమోషనల్ డ్రామా ఇది. కథనం చాలా కొత్తగా వుంటుంది. మనం ఊహించిన దాని కంటే సర్ప్రైజ్ వుంటుంది.
అన్ని భాషల్లో మీరే డబ్బింగ్ చెప్పారా ?
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. డైరెక్టర్, డీవోపీ ఇలా అందరం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మైఖేల్ సెట్స్ లో చాలా గొప్ప వర్క్ సాటిస్ఫాక్షన్ దొరికింది.
నాని గారు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మీకు అదృష్టం కలసి రావాలని కోరుకున్నారు కదా ?
నాని చాలా స్వీట్. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినది రాలేదని చాలా మంది అంటారు. నాని చెప్పినట్లు ఈ సినిమాతో అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాను. మైఖేల్ దర్శకుడు రంజిత్ మేము అనుకున్న దాని కంటే గొప్ప సినిమా తీశాడు. మైఖేల్ విజువల్ గ్రాండియర్ ఎక్సయిటెడ్ మూవీ.
తమిళ్ ఫిల్మ్ మేకర్స్ తో తరచుగా సినిమాలు చేస్తున్నారు కదా ?
మైఖేల్ లాంటి సినిమా చేయాలంటే నేను డైరెక్టర్ ని నమ్మడమే కాదు. నన్నూ డైరెక్టర్ నమ్మాలి. రంజింత్ నన్ను నమ్మారు. గొప్పగా తీశారు. తమిళ్ సినిమాల విషయానికి వస్తే అక్కడ కల్చర్, భాష నాకు తెలుసు. అందుకే విజయ్ సేతు గారు మైఖేల్ లో భాగమయ్యారు. ధనుష్ గారు కెప్టెన్ మిల్లర్ లో తీసుకున్నారు. దినితో పాటు తమిళ ఆడియన్స్ ని చాలా ప్రేమ లభించింది. అందుకే మైఖేల్ తమిళంలో కూడా షూట్ చేశాం.
మైఖేల్ జర్నీలో సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను. బరువు తగ్గాను, స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నాను, అండర్ వాటర్ లో షూట్ చేశాం ఇవన్నీ ఎక్సయిటెడ్ గా చేశాను. మైఖేల్ చాలా స్పెషల్ జర్నీ.
నిర్మాతల గురించి ?
భరత్, మోహన్, సునీల్ గారు వండర్ ఫుల్ నిర్మాతలు. ఎక్కడా రాజీపడలేదు. అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీ, కాన్ఫిడెంట్ గా వున్నాం.
కొత్త ప్రాజెక్ట్స్
భైరవ కోన, బడ్డీ, కెప్టన్ మిల్లర్ సినిమాలు చేస్తున్నా. ఈ మూడు భిన్నమైన సినిమాలు. దీనితో పాటు ఫ్యామిలీ మ్యాన్ 3 వుంది. అలాగే త్వరలోనె మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్