‘హౌస్ అరెస్ట్ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్
హౌస్ అరెస్ట్’ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది- ప్రి రిలీజ్ ఈవెంట్ లో అతిథుల ఆకాంక్ష
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రదారులుగా ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి చైతన్య సమర్పణలో ’90ml’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆత్మీయ అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు చంద్రమహేష్, మధుర శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి, చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి, అనూప్ రూబెన్స్, చంద్రబోస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, డీవోపీ యువరాజ్, కళాదర్శకుడు శేఖర్, వేణుమాధవ్ పెద్ది తదితరులు పాల్గొన్నారు..
దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ.. “నేను యుఎస్ లో వున్నప్పుడు శేఖర్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పాడు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే వున్నాను. అంత బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎవరూ చేయకపోతే నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని శేఖర్ కి చెప్పాను. ‘హౌస్ అరెస్ట్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ చూసే కొద్దీ చూడలనిపిస్తుంది. గ్యారెంటీగా ఈ చిత్రం పెద్ద హిట్ అయి దర్శకుడు శేఖర్ ఆడియెన్స్ గుండెల్లో అరెస్ట్ అయిపోతాడు” అన్నారు.
దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రైమ్ షోస్ బ్యానర్ నా ఓన్ ప్రొడక్షన్ లాంటిది. నిరంజన్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. యుఎస్ లో ఉండి కూడా ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేసి గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ చాలా బాగుంది. శేఖర్ సూపర్బ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమెడియెన్స్ అందరూ ఈ చిత్రంలో నటించడం సినిమాకి బిగ్ ఎస్సెట్. ‘హౌస్ అరెస్ట్’ బిగ్ హిట్ కావాలి” అన్నారు.
‘ఆర్ ఎక్స్ 100’ నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. “శేఖర్ మంచి ఫ్రెండ్. టైటిల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. టీజర్ బ్యూటిఫుల్ గా ఉంది. హిలేరియస్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. దర్శకుడు శేఖర్ కి ఈ చిత్రం మంచి పేరు తేవాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ.. “ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్. ఒక చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. చిల్డ్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ నవ్వులు ఉంటాయి. చైతన్య, నిరంజన్ రెడ్డి, అశ్విన్ రెడ్డి గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి అందరూ నాకు ఎంతో సహకారం అందించారు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది. పిల్లలు కడుపుబ్బా నవ్విస్తారు. యువరాజ్ బ్యూటిఫుల్ విజువల్స్, అనూప్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ అద్భుతమైన పాటలు రాశారు. త్వరలో ఆయన రాసిన ఒక స్పెషల్ పాటని లాంచ్ చేస్తాం. అది చాలా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం” అన్నారు.
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత పిల్లల సినిమా వస్తుంది. ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.. నో డౌట్” అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. “శేఖర్ తో ఇది సెకండ్ ఫిల్మ్. ఆయనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. అది శేఖర్ కి చాలా ప్లస్ పాయింట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్. అందరూ చూసి ఎంజాయ్ చేయాలి” అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ.. “లాక్డౌన్ తరువాత నేను యాక్సెప్ట్ చేసిన ఫిల్మ్ ఇది. డే అండ్ నైట్ చాలా కష్టపడి ఇష్టంతో ఈ సినిమా చేశాం. శేఖర్ స్క్రిప్టులో అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. ఔట్‌పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. డెఫినెట్ గా హిట్ కొడతాం. ఈ సినిమాతో శేఖర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు” అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “ఒక హౌస్ సెట్ వేసి దాదాపు షూటింగ్ అంతా అందులోనే చేశాం. పిల్లలు అందరూ బాగా నటించారు. షూటింగ్ అంతా పిక్నిక్ లా జరిగింది. ఈ సినిమాకి అన్నీ తానై పని రాక్షసుడిలా శేఖర్ చేశాడు. ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. అద్భుతమైన సినిమా చేసిన నిరంజన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక అందమైన సినిమాని నిర్మించారు” అన్నారు.