Reading Time: 2 mins
14 డేస్ లవ్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల
 డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించిన ‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్
అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ బోడెమ్ దర్శకత్వంలో హరిబాబు. డి నిర్మిస్తోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ మరియు ఫస్ట్ లుక్‌ని తాజాగా సంచలన దర్శకుడు వి. వి. వినాయక్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజ్ బోడెమ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వినాయక్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరికో ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు. మా టీమ్‌ని ఆశీర్వదించి, సినిమా సక్సెస్ కావాలని కోరిన వినాయక్‌గారికి ఈ సందర్భంగా మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇది ప్యూర్ లవ్ స్టోరి. చిత్రీకరణ అంతా బాగా జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు.
నిర్మాత హరిబాబు. డి మాట్లాడుతూ.. ‘‘మేము అడగగానే మరో ఆలోచన చేయకుండా.. మా చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన దర్శకులు వివి వినాయక్‌గారికి కృతజ్ఞతలు. దర్శకుడు నాగరాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ముందు ముందు మంచి దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ‘14 డేస్ లవ్’ మూవీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంది. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్నదే మా బ్యానర్ లక్ష్యం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.
హీరో మనోజ్ పుట్టుర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే మా చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి, ఆశీర్వదించిన దర్శకులు వినాయక్ గారికి ధన్యవాదాలు..’’ అని తెలపగా హీరోయిన్ చాందిని భగవానిని మాట్లాడుతూ ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని, రాజా రవీంద్ర, సనా షానూర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్,
సమర్పణ: అఖిల్ అండ్ నిఖిల్,
సినిమాటోగ్రఫీ: కన్నన్ మునుస్వామి,
ఎడిటింగ్: ఎస్.ఎస్.వి. సుంకర,
సంగీతం: కిరణ్ వెన్న,
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్.కె. బాజీ,
మాటలు: గౌరీశ్వర్, శివ ప్రసాద్ సామల,
లిరిక్స్: గిరి పట్ల,
కొరియోగ్రఫీ: గబ్బర్ సింగ్ గణేశ్ స్వామి,
నిర్మాత: హరిబాబు. డి,
రచన, దర్శకత్వం: నాగరాజ్ బోడెమ్.