14 డేస్ లవ్ మూవీ లిరికల్ సాంగ్ విడుదల
సుప్రసిద్ధ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 14 డేస్ లవ్ లోని ఏమ్ మాయో చేసేసి లిరికల్ సాంగ్ విడుదల
అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 14 డేస్ లవ్ . నాగరాజ్ బొడెమ్ దర్శకత్వంలో డి. హరిబాబు నిర్మించిన ఈ చిత్ర ఫస్ట్ లిరికల్ సాంగ్ ఏమ్ మాయో చేసేసి ని సుప్రసిద్ధ రచయిత, పార్లమెంట్ మెంబర్ వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేతుల మీద ఈ పాట విడుదలైనందుకు చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా హీరోయిన్ చాందిని భగవానిని మాట్లాడుతూ 14 డేస్ లవ్ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విజయేంద్రప్రసాద్‌గారు విడుదల చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ పాట విడుదలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా వేచి చూస్తున్నానని తెలిపారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ 14 డేస్ లవ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని ది గ్రేట్ ఇండియన్ రైటర్ అయిన వి. విజయేంద్రప్రసాద్‌గారు విడుదల చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకిది ఊహించని సర్‌ప్రైజ్. దర్శకనిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా మా యూనిట్ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
దర్శకుడు నాగరాజ్ మాట్లాడుతూ సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబుగారు నిర్మించిన 14 డేస్ లవ్ చిత్రంలోని మొదటి పాట గ్రేట్ రైటర్, దర్శకులు అయిన వి విజయేంద్రప్రసాద్‌గారి చేతుల మీదుగా విడుదలవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు మా యూనిట్ తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాము అని తెలిపారు.
నిర్మాత డి. హరిబాబు మాట్లాడుతూ మా సినిమాలోని పాటని శ్రీ విజయేంద్రప్రసాద్‌గారు విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకి థ్యాంక్స్. దర్శకుడు నాగరాజ్ ఈ సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. మంచి క్యాస్ట్ అండ్ క్రూ కుదిరింది. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ మాట్లాడుతూ పాట విడుదల పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
బ్యానర్: సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: అఖిల్ అండ్ నిఖిల్
మ్యూజిక్: కిరణ్ వెన్న
పాటలు: గిరి పట్ల
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: డి. హరిబాబు
దర్శకత్వం: నాగరాజ్ బొడెమ్