Reading Time: < 1 min

140 కోట్లు వసూలు చేసిన ఆదిపురుష్ మూవీ

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఆది పురుష్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.

అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన కథాంశం మరియు కథను మన ముందుకు తెచ్చిన విధానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ తో పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది ఈ సినిమా. ఈ మాగ్నమ్ ఓపస్ ఒక విజువల్ ట్రీట్ గా మొదటి నుండి చివరి వరకు యువత ను కట్టిపడేస్తుంది. అందరికీ ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.

ఆదిపురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు మరియు T-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.