సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’ 19 రోజుల్లోనే 175 కోట్లు క్రాస్ చేసి 200 కోట్లకు పరుగులు తీస్తోంది. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్ మహేష్ ట్రెమండస్ పెర్‌ఫార్మెన్స్, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్ మహేష్ గత కలెక్షన్ రికార్డులను క్రాస్ చేసి 175 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ హ్యాపీ న్యూస్ ను ఎస్ వి సి సంస్థ ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
175 కోట్లు క్రాస్ చేసిన సూపర్‌స్టార్ మహేష్ ఎపిక్ బ్లాక్‌బస్టర్ ‘మహర్షి’
Reading Time: < 1 min