Reading Time: < 1 min

18 పేజెస్ మూవీ సక్సెస్ మీట్

సెలిబ్రిటిస్ తో ఘనంగా సాగిన 18 పేజెస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 18పేజిస్. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఈ 18పేజిస్ టీజర్ కి, నన్నయ్య రాసిన అలానే టైం ఇవ్వు పిల్ల ఏడు రంగుల వాన పాటలు అలానే ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను సక్సెస్ఫుల్ గా అందుకుంది.

సినిమాలో అనుపమ చేసిన నందిని కేరెక్టర్ ఆకట్టుకుంది, ఈ సినిమా క్లైమాక్స్,అలానే కొన్ని కొత్త ఫీల్ ను తీసుకొచ్చే సీన్స్,గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

అనుకున్న విజయం సాధించడంతో ఈ చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది.రాత్రి ఈ చిత్ర యూనిట్ ప్రముఖ సెలిబ్రిటిస్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ మెగా నిర్మాత అల్లు అరవింద్,పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్, చందు మొండేటి,వశిష్ట, ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖుల మధ్య ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా సాగాయి.