Reading Time: 2 mins

18 పేజెస్ సినిమా సక్సెస్ మీట్

2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది నిఖిల్

కార్తికేయ-2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 18 పేజెస్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ
18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది,
ఈ సినిమా మౌత్ టాక్ తో డే బై డే పెరుగుకుంటూ వెళ్ళింది. సినిమా మొదటిరోజు కలక్షన్స్ కంటే 3 వ రోజు కలక్షన్స్ ఎక్కువ ఉన్నాయ్.తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు, మీరెప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీ, వ్యూ ఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్. ఒక ప్రొడ్యూసర్ కి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది.

దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ
మీడియాకి చాలా థాంక్యూ అండి. ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు క్యూట్ లవ్ స్టోరీ గా తీద్దామనుకున్నాం. ఈ సినిమాను అరవింద్ గారికి, బన్నీవాసు గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమి ఫీల్ అయ్యారో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాకు మేమే ప్రేమలో పడిన ఫీల్ వస్తుందండి అంటున్నారు. అది మాకు పెద్ద అప్రిసెషన్. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాను చూసి ఆదరించిన ఆడియన్స్ కి చాలా చాలా థాంక్స్.

అనుపమ మాట్లాడుతూ
మీడియాకు చాలా థాంక్యూ, కొన్ని సినిమాలు చేసినప్పుడు మనకు కిక్ వస్తుంది. కానీ 18 పేజెస్ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఒక యాక్టర్ గా చాలా మంచి సినిమా చేసిన ఫీల్ వచ్చింది. శతమానం భవతి నిత్యా కేరక్టర్ కి ఎలా పేరు వచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఉంది. థాంక్యూ సో మచ్ ఇలాంటి ఒక క్రేజి లవ్ స్టోరీ ను ఎంకరేజ్ చేసినందుకు. థాంక్యూ అల్.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ
ఫీల్ గుడ్ సినిమా ఆడదు, లవ్ స్టోరీస్ ఇంటికొస్తాయి అవి చూసుకుంటాం ఇలా అనుకున్న తరుణంలో సీతారామం సినిమా వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లైమాక్స్ కి ఉన్న ఫీలింగ్ ఈ సినిమాకి వచ్చిందని చాలామంది పోల్చి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాలో హీరోహీన్స్ కలుస్తూ ఉంటారు, కానీ ఈ సినిమా ఒక నవలను చదివినా ఫీలింగ్ ఇస్తుంది. సినిమాను దర్శకుడు కూడా అలానే ఆసక్తికరంగా మలిచాడు. నిఖిల్ ఇంకో రెండు సినిమాలు మా బ్యానర్ లో చేయమని అడిగాం, దానికి తాను ఇంకా ఒప్పుకోలేదు, పార్టనర్ అయిపోమని సలహా ఇచ్చాను, ఆ పనిమీద ప్రస్తుతం బన్నీవాసు ఉన్నాడు (నవ్వుతూ). థాంక్యూ మీడియా మీరు మాకు ప్రేక్షకులకు సంధానకర్తగా ఉన్నారు. మీరు లేకపోతే ఇది సాధ్యం కాదు.

నిఖిల్ మాట్లాడుతూ
థాంక్యూ మీడియా, సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది, నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్ కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచివ్మెంట్. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సప్రైజ్ అవుతున్నాను, ఒక మంచి కథను బ్యూటిఫుల్ గా చెప్తే సినిమా చాలా బాగుంటుంది. ఇది మాస్ ఎంటెర్టైమెంట్ కాదు, సిచ్యువేషన్స్ తో వెళ్తున్న కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా క్లైమాక్స్ ను మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అరవింద్ గారికి, బన్నీవాసు గారికి థాంక్యూ, ఈ కథను నాకు ఇచ్చిన సుకుమార్ గారికి అందరికి థాంక్యూ. కెరియర్ వైజ్ గా నాకు నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్ థాంక్యూ.