1945 మూవీ రివ్యూ

Published On: January 8, 2022   |   Posted By:

1945 మూవీ రివ్యూ

Rana Daggubati-Regina Cassandra's '1945' is a Bilingual Period Drama Set in Burma | Silverscreen India

రానా ‘1945’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)
👎

బాహుబలి తర్వాత రానా సినిమాలపై అమాంతం ఆసక్తి పెరిగిన మాట వాస్తవమే. అయితే అందుకు తగ్గ సినిమాలు అయితే ఆయన నుంచి రావటం లేదు. ఏదో కొత్తదనం ఉందనో,మొహమాటంతో ఒప్పుకున్న ప్రాజెక్టులు ఇలా సహన పరీక్షకు దిగుతున్నాయి. అందులోనూ ఈ సినిమా గురించి రానా ఇంతకు ముందు తనుకు ఇష్టం లేకుండా రిలీజ్ అవుతోందని గోలెత్తిపోయాడు. అయినా ఆగలేదు. అతని డబ్బింగ్ కూడా లేకుండా థియోటర్ లో దిగింది. ఇంతకీ రానా అసలు ఈ సినిమాలో ఏముందని కమిటయ్యాడు..కథేంటి, ఓ మాదిరిగా అయినా ఉందా వంటి విషయాలు చూద్దాం.స్టోరీ లైన్నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం తర్వాత మొదలయ్యే కథ ఇది.  త‌న కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవ‌డం కోసం ఆది (రానా ద‌గ్గుబాటి) బ‌ర్మా వెళ్తాడు. అదే స‌మ‌యంలో బ్రిటిష్ తహసీల్దార్‌ (నాజ‌ర్‌) కుమార్తె (రెజీనా)తో ఎంగేజ్మెంట్ కూడా కుదురుతుంది. పెళ్లికి రెడీ అవుతున్న ద‌శ‌లో బ్రిటిష‌ర్ల దురాగ‌తాలు హద్దు మీరుతాయి. అక్కడ నుంచి ఆది ..తన జీవితంలో అన్ని వదిలేసి నేతాజీ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది… బ్రిటీష్  వాళ్ల‌పై ఆది పోరాటం ఎలా సాగిందన్న‌దే  తెరపై చూడాలి.ఎనాలసిస్ …ఈ సినిమా ప్రారంభం అప్పుడు ఇది ఆర్ ఆర్ ఆర్ లాంటి స్టోరీ లైన్ అన్నారు. యాదృచ్చికంగా ఇదీ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అనుకున్న రోజునే రిలీజైంది. అలాగే ఇదీ  దేశభక్తి కథే. బ్రిటీష్ వారిని ఎదిరించిన కథే. స్వాతంత్ర్య కాలం నాటి పీరియడ్ కథే. మరి ఎక్కడ దెబ్బ కొట్టింటీ అంటే కథ,కథనాలు,కంటిన్యుటి లేని సీన్లలోనే. అప్పుడెప్పుడో వచ్చిన అనీల్ కపూర్ “1942 ఏ లవ్ స్టోరీ” ని గుర్తు చేసే టైటిల్. ఆ సినిమాలోదే ప్లాట్ కూడా లేపారు. ఆ సినిమాలోంచి కొన్ని క్యారక్టర్స్ కూడా తీసుకున్నారు.  రఘువీర్ యాదవ్  గుర్తు చేసే సప్తగిరి ,అనుపం ఖేర్ లాంటి పాత్ర  సత్యరాజ్..  దివాన్ పాత్రలో నాజర్ కనిపిస్తారు. హీరోయిన మనీషా కోయిరాలా పాత్రలో రెజీనా ఉన్నా లవ్ ట్రాక్.  మిగతాదంతా సొంత పైత్యం. ఫార్ములాలో సినిమాని నింపేసే ప్రయత్నం. జమీందార్ల అరాచకాలు..ఎదిరించే హీరో..ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటం లోకి దూకుతాడు. లో బడ్జెట్ లో పీరియడ్ లుక్ లో వచ్చే వెబ్ సీరిస్ లు వెయ్యిరెట్లు బెటర్ అనిపిస్తాయి.  ఏ సీన్ కు మరో సీన్ కు లింక్ సరిగ్గా ఉండదు. సీన్స్ సైతం విసుగిస్తూంటాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఏ ద‌శలోనూ సినిమాని పరుగెట్టించదు. శ‌క్తిమంత‌మైన బ్రిటిష్ సైన్యంపై పోరాటం అంటే… దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఎమోషన్స్ బాగా పండాలి. కానీ, ఈ సినిమా విష‌యంలో ఆ సీన్స్ అన్నీ కూడా ఫోర్సెడ్  అనిపిస్తాయి.  చాలా సీన్స్  హ‌ఠాత్తుగా వచ్చి వెళ్లిపోతూంటాయి. సినిమా ముగింపు కూడా అసంపూర్ణమే.

దర్శకత్వం …మిగతా విభాగాల పనితీరు…

అప్పటి 1945 నేపథ్యానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ – లొకేషన్స్ – కాస్ట్యూమ్స్  సెట్ చేసుకున్నారు కానీ.. సినిమాలో బలమైన సన్నివేశాలు – సరైన ఎమోషన్ సెట్ చేయలేకపోయాడు దర్శకుడు. అయితే కెమెరా వర్క్ బాగుంది. స‌త్య పొన్మార్   1945 కాలాన్ని, అప్ప‌టి ప‌రిస్థితుల్ని, లొకేష‌న్ల‌ని చాలా స‌హ‌జంగా రీ క్రియేట్ చేసారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం సోసోగా సాగుతుంది. ఆకుల శివ పెద్దగా విషయంలేనట్లు అనిపిస్తాయి. ప్రొడక్షన్  నాసిర‌కంగా ఉంది.  కాస్ట్యూం, కళా దర్శకత్వం బాగా కష్టపడ్డారు.

నటీనటుల్లో…

రానా ద‌గ్గుబాటి కొన్ని సీన్లల్లో ప‌ర్వాలేదనిపించారు  కానీ, చాలా చోట్ల పెద్ద‌గా ఇష్టం  లేకుండా న‌టించారని అర్దమవుతుంది. ఇక ఆది పాత్రకు రానా గొంతు వినిపించకపోవడంతో ఆ ఫీల్ రాలేదు.   రానా తన పాత్రకు న్యాయం చేసినా.. మిగతా ప్రధాన పాత్రలకు ఆ మాత్రం స్కోప్ కూడా లేదు.  సత్యరాజ్ – నాజర్ – సప్తగిరి – కాళీ వెంకట్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించినా ఫలితం లేదు.రెజీనా కసాండ్రా కు కలిసొచ్చే సినిమా కాదు.

బాగున్నవి

+ 1945 లో కథ సెట్ చేయటం

+ కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, ఆర్ట్

బాగోలేనివి

– బోర్ కొట్టించే క‌థ, కథనం

–  ప్రొడక్షన్ వాల్యూస్

–   నిర్మాణం, దర్శకత్వంలో లోపాలు

చూడచ్చా..

పనిగట్టుకుని థియోటర్ కు వెళ్లి మరీ చూడటం కష్టమే.

ఎవరెవరు…
న‌టీన‌టులు: రానా దగ్గుబాటి, రెజీనా, సత్యరాజ్, నాజర్ తదితరులు;
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా;
ఛాయాగ్ర‌హ‌ణం: స‌త్య పొన్మార్‌;
ఎడిటింగ్‌: గోపీకృష్ణ‌,
మాట‌లు: ఆకుల శివ‌;
పాట‌లు: అనంత శ్రీరామ్‌;
నిర్మాత: సి.కల్యాణ్‌;
దర్శకుడు: సత్య శివ;
రన్ టైమ్: 2h 2m
విడుద‌ల‌: 07-01-2022