24 కిస్సెస్ చిత్రం ప్రెస్ మీట్
24 కిస్సెస్ ఒక క్లాసికల్ లవ్ స్టోరీ – దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
అరుణ్ ఆదిత్ హీరోగా హెబ్భా పటేల్ హీరోయిన్ గా సిల్లీ మంక్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అయోధ్యకుమార్ క్రిష్ణం శెట్టి దర్శకత్వంలో సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించిన చిత్రం 24 కిస్సెస్. ఈ చిత్రం నవంబర్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో అరుణ్ ఆదిత్, హీరోయిన్ హెబ్బా పటేల్, దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి పాల్గొన్నారు.
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు రోజుల ముందే అన్ని థియేటర్స్ ఫుల్స్ అవడం చాలా హ్యాపీగా వుంది. ప్రతి ఒక్కరు సినిమా హిట్ కావాలని మెసేజెస్ చేస్తూ, సపోర్ట్ చేస్తున్నారు. ఎవరూ మర్చిపోలేని ఒక మంచి లవ్ స్టోరీ ఇది. మంచి ఫిలిం చూసిన ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది.. అన్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదల కోసం చాలా అతృతగా ఎదురు చూస్తున్నాను. చాలా ఎక్క్సయిట్ మెంట్, నెర్వస్ నెస్ వుంది. అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం. యూనిట్ అంతా చాలా కష్టపడి వర్క్ చేసారు. మంచి రిజల్ట్ వస్తుందని నమ్మకంతో వున్నాం… అన్నారు.
దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి మాట్లాడుతూ.. 24 కిస్సెస్ అనగానే చాలా మంది ఇది భూతు సినిమా అనుకుంటున్నారు. కానేకాదు. అన్ని ఎమోషన్స్ వున్న అందమైన ప్రేమకథ. క్లీన్ ఎంటర్ టైనర్ ఫిలిం. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. మిణుగురులు లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్, భూతు సినిమా రాదు. మిణుగులు టీమ్ నుండి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్ స్టోరీ. రావు రమేష్, నరేష్ పాత్రల్లో లైటర్ వేలో కామిడీ ఉంటుంది. ధియేటర్ నుండి బయిటికి రాగానే ఎమోషనల్ తీపి గుర్తుతో వస్తారు. అందరూ కలిసి చూడ దగ్గ సినిమా.. చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అని కాన్ఫిడెంట్ గా చెపుతున్నాను…అన్నారు.