Reading Time: 2 mins
29.4 టిఆర్‌పి రేటింగ్ తో అల‌వైకుంఠ‌పురంలో చిత్రం
 
29.4 టిఆర్‌పి రేటింగ్ తో ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రి రికార్డ్ ని స్ట్రాంగ్ చేసిన‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్ర‌మ్ ల అల‌వైకుంఠ‌పురంలో.
 
సంక్రాంతి కి విడుద‌ల‌య్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నాన్ భాహుబ‌లి2 గా ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రి రికార్డ్ ని సాధించి తెలుగుసినిమా చ‌రిత్ర‌లో ఒక మైల్‌స్టోన్ గా నిలిచిన చిత్రం అల‌వైకుంఠ‌పురంలో.. ఈ లాక్‌డౌన్ కొవిడ్ సిట్యూవేష‌న్ లో అన్ని ఎక్క‌డిక‌క్క‌డ స్థంభించిపోయాయి కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల ప‌రంప‌ర మాత్రం ఏమాత్రం ఆగ‌డం లేదు.. సంవ‌త్స‌రం గ్యాప్ తీసుకుని వ‌చ్చిన‌ అల్లు అర్జున్ త‌న ఫ్యాన్స్ కి సంవ‌త్స‌రాలు మ‌ర్చిపోని గిఫ్టి ని అల‌వైకుంఠ‌పురంలో ద్వారా ఇచ్చాడు.. మ్యూజిక్ రికార్డుల‌తో మెద‌లైన ఈ ప‌రంప‌ర దియెట్రిక‌ల్ వ‌సూళ్ళు, ఆన్‌లైన్ యాప్స్‌, యూట్యూబ్ రికార్డ్ సాధిస్తూ ఇప్ప‌టికే పాన్ ఇండియా అంత‌టా ఈ చిత్రం గురించి చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. నేష‌న‌ల్ వైడ్ సెల‌బ్రిటిలు సైతం ట్వీట్స్ చేయ‌టం ఈ చిత్రం పై వున్న క్రేజ్ ని అల్లు అర్జున్ ఇమేజ్ ని తెలియ‌జేస్తుంది. అయితే ఇప్ప‌డు టివిలో అరుదైన కొత్త రికార్డు ని క్రియెట్ చేయ‌టం విశేషం.. సినిమా విడుద‌ల‌య్యి 7 నెల‌లు కావోస్తుంది.. ఓటిటి ఫ్లాట్‌ఫామ్స్ లో విడుద‌ల‌య్యి హ‌య్య‌స్ట్ వీవ‌ర్స్ షిప్ ని సొంతం చేస‌కున్న రికార్డు ని నెల‌కొల్పి 6 నెల‌లు కావోస్తుంది. లాక్‌డౌన్ రిలాక్సెష‌న్ నుండి ప్ర‌జ‌లు అన్‌లాక్ కి వ‌చ్చేశారు.. ఈ టైం లో టివి లో అల‌వైకుంఠ‌పురంలో చిత్రం టెలికాస్ట్ అయ్యింది. దీనికి తెలుగు ప్ర‌జ‌లు భ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 29.4 టిఆర్‌పి రేటింగ్ తో గ‌తం లో ఏ చిత్రానికి రాన‌టువంటి అరుదైన రికార్డుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ లు సొంతం చేస‌కున్నారు. ప్ర‌ముఖ‌ నిర్మాణ సంస్థ‌లు  హారికా హాసిని క్రియెష‌న్స్  అండ్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ల పై అల్లు అర‌వింద్, కే రాధాకృష్ణ నిర్మాత‌లుగా నిర్మించారు.  ఈ చిత్రంలో పూజా హెగ్ధే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించారు. థ‌మ‌న్ ఈ చిత్రాల‌కి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌- మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్ ఒక మ్యాజిక్‌
 
జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి అల‌వైకుంఠ‌పురంలో చిత్రాల‌తో ఆల్‌టైమ్ హ్య‌ట్రిక్ స‌క్స‌స్ ని సోంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల‌మాత్రికుడు త్రివిక్ర‌మ్ గారు. మంచి క‌థ కి చ‌క్క‌టి కామెడి జోడించి ఎమెష‌న్ గా ప్రేక్ష‌కుడిని సినిమాలోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయించే మ్యాజిక్ వీళ్ళ కాంబినేష‌న్ కి వుంటుంద‌ని మ‌రోక్క‌సారి అల‌వైకుంఠ‌పురంలో చిత్ర ఘ‌న‌విజ‌యం తో నిరూపించారు.