Reading Time: 3 mins

30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం థాంక్స్ మీట్

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా  యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ (మున్నా)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. టెస్టుఫుల్ ప్రొడ్యూసర్  యస్వీ బాబు నిర్మించిన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. దిగ్విజయంగా రన్ అవుతుంది. ఈ సందర్బంగా ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పడానికి థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఫిబ్రవరి 4న హైదరాబాద్ జే ఆర్ సి కన్విక్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ మాచిరాజు, దర్శకుడు ఫణి ప్రదీప్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివేంద్ర, నిర్మాత యస్వీ బాబు, నటులు శుభలేఖ సుధాకర్, భద్రం, నటి హేమ, నిర్మాత తనయులు  వినయ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు…

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ..’ ఇది మా అబ్బాయి సినిమా అని.. కుటుంబ సమేతంగా  థియేటర్స్ కి తరలి వచ్చి మా సినిమాని చూస్తున్న ప్రతీ ప్రేక్షకులకు నా పాదాభివందనం. రిలీజైన నాటి నుండి నేటి వరకు 25 థియేటర్స్ సందర్శించాం. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా చాలా చాలా బాగుంది అని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మేము ఊహించనంత హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. యస్వీ బాబు గారు సొంతకొడుకు సినిమాకి కేర్ తీసుకున్నంతగా నన్ను చూసుకొని హీరోగా మంచి సినిమా ద్వారా లాంచ్ చేశారు.. ఆయనకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను. అలాగే నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన మున్నాకి చాలా థాంక్స్. ఒక అన్నలా భావించి నాతో ఈ సినిమా చేశాడు మున్నా. ఈ సినిమాకి నేను హీరో కాదు.. కథే హీరో. మెయిన్ లీడ్ పాత్ర చేసానంతే. అది నచ్చబట్టే సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మా అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అలాగే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే పాటలు ఇచ్చిన మా అనూప్ కి థాంక్స్. నా మొదటి సినిమా జర్నీలో టీం అందరూ చాలా   కష్టపడి చేశారు.. ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చారు నాకు. ముఖ్యంగా మా ఆర్ట్ డైరెక్టర్ నరేష్ షూటింగ్ టైంలో అనుకోకుండా మా అందరికీ దూరమయ్యారు. ఆయన లేనిలోటు మాకు చాలా వెలిథిగా ఉంది. నా క్యారెక్టర్ ని స్కెచెస్ వేసి అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయన కుటుంబానికి మేమంతా జీవితాంతం తోడు వుంటామని ప్రామిస్ చేస్తున్నాం. ఇక నేను చేసే ప్రతీ సినిమా మొదటి సినిమాలా భావించి కష్టపడి చేస్తానని మాట ఇస్తున్నాను అన్నారు.

నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ‘ మా సినిమాని జిఎటు, యూవీ సంస్థలు గ్రాండ్ గా  ఆడియెన్స్ అందరికి రీచ్ అయ్యేలా రిలేజ్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ కావాల్సిన మా సినిమా వన్ ఇయర్ లేట్ అయినా కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడ్వాన్స్ లు ఇచ్చి  ఇప్పటిదాకా నాకోసం వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్లంతా చాలా హ్యాపీగా వున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం అనూప్. మా సంస్థకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. కథ, కథనం చాలా ఇంట్రెస్టింగా చేసి ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేసిన మా డైరెక్టర్ మున్నాకి చాలా థాంక్స్. మా సినిమాకి ఇవాళ ఇంత ఓపెనింగ్స్ రావడానికి కారణం ప్రదీప్. ప్రతిఇంట్లో ఒక మనిషిగా ఉన్న ప్రదీప్ కోసం జనాలు వచ్చి సినిమా చూస్తున్నారు. ప్రతీ ఏరియాల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇంతలా మా చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ నా అభివందనాలు. మా ఆర్ట్ డైరెక్టర్ అకాల మరణం చెందారు. వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి నా వంతు సహాయసహకారాలు అందిస్తాను అన్నారు.

దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) మాట్లాడుతూ.. ‘ మా సినిమాని ఫస్ట్ హిట్.. తర్వాత సూపర్ హిట్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అని అందరూ అంటుంటుంటే చాలా హ్యాపీగా, గర్వాంగా ఉంది.. రిలీజ్ అయిన అన్ని ఏరియాలనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేసిన ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. హిట్ అవుతుంది అని ఫస్ట్ నుండి కాన్ఫిడెన్స్ ఉంది. అది ఇవాళ నిజం అయింది. నా మొదటి సినిమాకి నన్ను నమ్మి వర్క్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ నా థాంక్స్. కథ రాయడం చాలా ఈజీ.. కానీ స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం.. ఈ సినిమాతో తెలిసింది. అంతలా కష్టపడి వర్క్ చేశాం. ప్రదీప్ నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా తోడుండి ఎంతో సపోర్ట్ చేశాడు. అతనికి నేను బాగా ఎడిట్ అయిపోయాను. అంతలా తనపై అభిమానం పెరిగిపోయింది. ముఖ్యంగా నన్ను నమ్మి కథపై నమ్మకంతో సినిమా చేసిన బాబు గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. ఈ సినిమా ఇంతలా రీచ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం అనూప్. అతను నా ఏంజెల్. మనసు పెట్టి బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్  చేశాడు.. ఇక మా భద్రం నాకంటే వాడికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతీక్షణం నను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తాడు అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకి డే వన్ నుండి సపోర్ట్ చేస్తున్న ప్రతిఒక్కరికీ చాలా చాలా థాంక్స్. మా నిర్మాత బాబు గారు లేకపోతే అసలు ఈ సినిమా లేదు. ఈ టు ఇయర్స్ జర్నీలో ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను.. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ గా వుంటారు. ఆయన మంచితనం కోసమే ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించింది. మున్నా అన్నీ ఎమోషన్స్ బాగా డీల్ చేశాడు. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మున్నా ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను గ్యారెంటీగా పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడు. ప్రదీప్ తన అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడు. హీరో కావాలనుకున్న తన కలని ఈ సినిమాతో నెరవేర్చుకున్నాడు. ఆడియోతో పాటు సినిమాని కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లందరికి మా టీం తరుపున ధన్యవాదాలు అన్నారు.

 నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. ‘ కథ నచ్చి ఎంతో ఇంప్రెస్ అయి ఈసినిమాని నిర్మించిన బాబుగారికి నా అభినందనలు. అద్భుతమైన కథ, కథనాలతో ప్రతీ క్యారెక్టర్ ని అందంగా డిజైన్ చేసి సినిమాని తెరకెక్కించాడు మున్నా. అలాగే ఫస్ట్ సినిమాతోనే అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన అబ్బాయి ప్రదీప్ కు నా శుభాశీస్సులు. అనూప్ ఆణిముత్యాల్లాంటి పాటలు ఇచ్చాడు. దాంతోనే సినిమా అందరికీ రీచ్ అయింది. ఇలాంటి ఒక మంచి సక్సెస్ ఫుల్ మూవీలో నేను ఒక బాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకూ నన్ను అందరూ హేమక్క అని పిలిచేవారు. ఇప్పుడు హేమమ్మా అని పిలుస్తున్నారు. మా ఊరు నుండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంచి క్యారెక్టర్ చేశావ్ అని. ఎక్కడికి వెళ్లినా మా అమ్మను గుర్తుచేశారు అని అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా మున్నకే చెందుతుంది.. నాకోసం అమ్మ క్యారెక్టర్ డిజైన్ చేశారు. బాబు అన్నలా సపోర్ట్ చేస్తూ బాగా చేయండి అని చెప్పేవారు. అనూప్ అమ్మ పాటతో నన్ను బాగా హైప్ చేశారు. నేను చేయాలనుకున్న డ్రీమ్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేసే అవకాశం దక్కింది. అతడులో కాపీకప్ సీన్ ఎంత గుర్తింపు తెచ్చిందో 30 రోజుల్లో సినిమాలో కూడా అమ్మ క్యారెక్టర్ లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది. అన్నారు.

అనంతరం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ సక్సెస్ షీల్డ్ లను హీరో ప్రదీప్ అందించారు.