Reading Time: 2 mins

35 చిన్న కథ కాదు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

 

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, మాష్టర్ ప్రజ్వల్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న 35-చిన్న కథ కాదు” వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదివరకే రిలీజైన టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సెప్టెంబర్ 6 న విడుదల సందర్భంలో ఈరోజు దశపల్లా హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర బృందంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి రానా దగ్గుబాటి, ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

ప్రొడ్యూసర్స్ సృజన్ మరియు సిద్ధార్థ్  మాట్లడుతూ ‘ ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మళయాలంలో ‘మంజుమల్ బాయ్స్’, కన్నడలో ‘కాంతారా ‘, తమిళ్ లో ‘ మహారాజా’, తెలుగులో ’35 చిన్న కథ కాదు ‘ . అలా గుర్తుండిపోతుంది గుర్తుపెట్టుకోండి ‘ చెప్పారు.

డైరక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా కథ మొట్టమొదటగా విన్నది రానా దగ్గుబాటి గారు. ఆయన కూడా ఈ కథ విన్నప్పటి నుండి ఇది బయోపిక్ అంటుంటారు. ఆ తర్వాత నివేతా, దర్శి, విశ్వ దేవ్ ఆంతా ప్రొఫెషనల్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీనియర్ యాక్టర్ భాగ్యరాజ్ గారితో, గౌతమి మేడమ్ తో పని చేయడం ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. వివేక్ సాగర్ తో నా జర్నీ ఎప్పటినుండో వున్నా, ఈ సినిమా కోసం అట్టకోడళ్ళు లా రోజూ కొట్టుకొని చివరికి అన్నతమ్ముళ్ళలా కలిసి పనిచేశాం. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా మ్యూజిక్ కి తగ్గట్టుగా, కథకి సందర్భానికి అనుగుణంగా అర్థవంతమైన గొప్ప లిరిక్స్ ఇచ్చిన కిట్టు విశ్శాప్రగడ, భరద్వాజ్ కి ధన్యవాదాలు. మా సినిమాటోగ్రాఫర్ నికేత్ గొప్ప విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాని మీ ఫ్యామిలీ తో, పిల్లలతో కలిసి చూడండి. మీ పిల్లల కళ్లు, చెవులు మూయకుండా హాయిగా చూడొచ్చు, ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదు.’ అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మట్లాడుతూ ‘ నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం నాకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ లాంటిది. నిజంగా ఈ సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం, నందు తో చాలా కుస్తీ పట్టాం ‘ అని చెప్పారు

హీరోయిన్ నివేతా థామస్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా ప్రతీ తల్లి తండ్రులు తమ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా., అంతే ఒక్క రోజు స్కూల్ బంక్ కొట్టి చూసినా పర్లేదు ., ఎందుకంటే ఆ ఒక్కరోజు స్కూల్లో చెప్పిన లెస్సన్ కంటే ఈ సినిమా చాలా నేర్పుతుంది., ఈ సినిమాలో నా పాత్ర పేరు సరస్వతి చెప్తుంది ” ఆడతావుంటే పరిస్థితులు మరతా ఉంటాయ్ అని ” అని నా జీవితానికి కూడా దగ్గరగా వున్న డైలాగ్ అది, మీరందరూ నన్ను తెలుగు అమ్మాయిని అనంటుంటే చాలా సంతోషంగా వుంది, 35 చిన్న కథ కాదు అనేది నిజంగానే చిన్న కథ కాదు, ఇప్పుడు సొసైటీ కి చెప్పాల్సిన పెద్ద కథ,ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఫీలవుతున్న ఈ పాజిటివ్ ఎనెర్జీ సినిమా తీస్తున్నప్పుడు ఉండింది, రేపు సినిమా చూసాక కూడా మీకూ అలాగే వుంటుంది’ అని చెప్పారు.

దగ్గుబాటి రానా మాట్లాడుతూ’ గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు,వరదల వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ మా సినిమా పరిశ్రమ నుండి ఒక సహాయ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం, అందరూ ధైర్యంగా వుండాలని కోరుకుంటున్నాను,ముందుగా డైరెక్టర్ నందు గురించి చెప్పాలి, నాకు కథ చెప్పినపుడు ఏదైతే నేను చూశానో అదే ఈరోజు సినిమాలో కనిపించింది, తనకున్న కన్విక్షన్, తన సేన్సిబిలిటీస్ అన్నీ సినిమాలో  కనిపించాయి, కొన్ని చోట్ల కన్నీళ్లు తెప్పించాడు. ఇదేదో నా బయోపిక్ లా వుందనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చుడండి. ‘ అని చెప్పారు.

ముఖ్య అతిధి గా వచ్చిన నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘ నేను ఈ సినిమా చూశా , ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప సినిమా ఇది, సరిపోదా శనివారం లాంటి ప్రతీ వారం వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయ్ అస్సలు మిస్సవకండి. మీకు కావలసినంత వినోదంతో పాటు,ఎమోషన్స్ ,మనందరి జీవితంలో జరిగిన సంఘటనలు మీకు కనిపిస్తాయి. ఈ సినిమా కొన్ని రోజులు మీకు వెంటాడుతుంది , ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ పేరెంట్స్ తో కలిసి చూడండి, తారే జమీన్ పార్ లాంటి అనుభూతినిచ్చే అద్భుతమైన సినిమా’ అని చెప్పారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ ఆద్యంతం సరదాగా సినిమాలో నటించిన పిల్లలతో ఆటలాడించి,పాటలు పాడించి , మంచి స్పీచ్ లు కూడా చెప్పించగలిగారు. మొత్తం ఈవెంట్ కి పిల్లలు మాట్లాడిన మాటలు హైలేట్ అని చెప్పాలి.