47 డేస్ మూవీ రివ్యూ
టైమ్ లాస్:’47 డేస్’ (రివ్యూ)
Rating:2/5
థ్రిల్లర్స్ సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సరిగ్గా చిక్కుముడులు వేసి, వాటిని అంతే సృజనాత్మకంగా విడతీస్తే వచ్చే మజానే వేరు. అసలేం జరిగింది. హత్యలకు కారణం ఏమిటి అంటూ ఇన్వెస్టిగేషన్ కథకు ప్రాణం పోయాలి. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా ఓటీటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో అది జరగటంలేదు. ఇలాంటి సినిమాలకు కథ, కథనం, ట్విస్టులు ప్రాణం… వీటికి సాంకేతిక నైపుణ్యంతో పనిలేదు. కానీ సినిమాలో క్వాలిటీ కనిపించాలి. అదీ కొరవడుతోంది. ఈ నేపధ్యంలో అలాంటి సినిమాలే ఓటీటికు తోసేస్తున్నారా…లేక ఓటీటిలు అలాంటివే ఎంచుకుంటున్నాయా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. తాజాగా ఈ ప్రశ్నకు పదును పెడుతూ మరో థ్రిల్లర్ సినిమా డైరక్ట్ ఓటీటిలో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది…సినిమాలో ఏమన్నా ఉందా…చూసేందుకు అవకాసం ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
వైజాగ్ అసెస్టెంట్ కమీషనల్ ఆఫ్ పోలీస్ సత్యదేవ్ (సత్యదేవ్) ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన భార్య పద్దు (రోషిణి ప్రకాష్) జ్ఞాపకాలతో మునిగితేలుతుంటాడు. ఓ రోజు తన కోలీగ్ రవి (రవివర్మ) వచ్చి…ఓ కేసు గురించి డిస్కస్ చేస్తాడు. అది ఓ పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్ శ్రీనివాస్ సూసైడ్. ఆ కేసు వివరాలు వినగానే, తన బార్య సూసైడ్ కు ఈ సూసైడ్ ఏదో లింక్ ఉందని అతని సిక్స్ సెన్స్ హెచ్చరిస్తుంది. వెంటనే తన లోని పోలీస్ ను నిద్రలేపి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ కేసుని తవ్వుతున్న కొలిదీ అనేక ఊహించని విషయాలు బయిటకు వస్తాయి. మధ్యలో ఓ మిస్టీరియస్ గర్ల్ జూలియట్ (పూజ జవేరీ) సీన్ లోకి వస్తుంది. ఆమె ఎవరు..అసలు సత్య భార్య సూసైడ్ కు అసలు కారణం ఏమిటి…అసలు ఏం జరిగింది…ఇన్విస్టిగేషన్ లో బయిటపడ్డ విషయాలు ఏమిటి వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే విశ్లేషణ
వేరే ట్రాకులు పట్టకుండా సస్సెన్స్ డ్రామాని, సస్సెన్స్ డ్రామాలానే నడిపించడానికి నిజాయతీగా చేస్తే ఫలితం బాగుంటుంది. ఈ తరహా సినిమాలు చూసే వాళ్లకు నచ్చుతుంది. అలా కాకుండా సినిమాలో ట్రాక్ లు ఎక్కువైతే ట్రాక్ తప్పుతుంది. అంతేకాకుండా ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ ముడి విప్పతీయటం ప్రాణం. కానీ ఈ సినిమాలో అది ఫట్టుమంది. కొండని తవ్వి ఎలుకను పట్టిన ఫీలింగ్ కలగింది. సినిమానిండా సినిమాటెక్ లిబర్టీలు ఎస్కేపులు కనిపించి, గౌరవం తగ్గిస్తాయి. ట్రాక్ లను కథని లాక్ చేయటానికి కాకుండా లాగ్ చేయడానికి, ఆఖరి ట్విస్టుని ఇంకాసేపు దాచడానికి వాడుకున్నాడంతే. సూసైడ్ కు కారణం తెలిశాక.. కాస్త షాకింగ్‌గానే ఉంటుంది. కానీ అలా ఎలా జరిగింది ? అని ఆలోచిస్తే మాత్రం కారణం అంత కన్వీసింగ్ అనిపించదు.
ఇక ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లలో ప్రధాన సమస్య… సెకండాఫ్ ని సరిగ్గా సస్టైన్ చేయటం. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తర్వాత సీన్ లో ఏం జరగబోతోంది అన్నది గెస్ చేయడం మొదలెడతాడు. ఆ ఆలోచలను గౌరవిస్తూనే కొత్త ట్విస్ట్ లు ఇవ్వగలగాలి. అలాగే లాగ్ ఉన్నా లాగటం మొదలెట్టినా మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి బోర్ వచ్చేస్తుంది. అయితే సెకండాఫ్ లో సినిమాని వీలైనంత లాగ్ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు. దర్శకుడి మేథస్సుకు ఇక్కడే అగ్ని పరీక్ష ఎదురైంది. ప్రేక్షకుడి ఇంటిలిజెన్స్ లెవల్స్ డిస్ట్రబ్ చేసేసారు.
డైరక్షన్ ఎలా ఉంది…మిగతా డిపార్టమెంట్స్
సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ తిరిగి రంగంలోకి దూకి మిస్టరీని ఛేదించటం అనే కాన్సెప్ట్ సిని ప్రపంచానికి కొత్తేం కాదు. అయితే ఎంత పాతదయినా ఇంట్రస్టింగ్ గా చెప్తే నచ్చుతుంది. ఆ విషయంలో డైరక్టర్ ఫెయిలయ్యారు. చాలా ప్లాట్ గా కథ,కథనాన్ని నడిపారు. ఇక మిగతా విభాగాల్లో సంగీతం సినిమాకు బాగానే ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. మిగతా విభాగాలు సినిమా స్టాండర్డ్స్ కు తగ్గట్లే ఉన్నాయి.
నటీనటుల్లో ..
సత్యదేవ్ ఈ సినిమాని తన భుజాలపై పెట్టుకుని మోసాడు. డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ ఫెరఫెక్ట్ గా ఉంది. హీరోయిన్ గా నటించిన రోషిణి ప్రకాష్ అందంగానూ ఉంది, నటనపరంగానూ బాగుంది. పూజాజవేరి, విలన్ గా నటించిన నటుడు కూడా చాల బాగా నటించారు.
చూడచ్చా
ఓటీటీలు సినిమాలకు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ సినిమా చూడటం పెద్ద కష్టమేమీ కాదు.
తెరవెనుక..ముందు
నటీనటులు : సత్యదేవ్, పూజా జవేరి, రోషిని,రవి వర్మ, హరి తేజ తదితరులు
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రాఫర్ : జి.కే
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు : శశి భూషణ్, రఘు కుంచె, శ్రీశర్,విజయ్ శంకర్