హిట్ 2 మూవీ రివ్యూ   

Published On: December 2, 2022   |   Posted By:

హిట్ 2 మూవీ రివ్యూ   

image.png

అడవి శేషు ‘హిట్ 2’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

👍

హిట్ సినిమాకు సీక్వెల్ రాయటం, డైరక్ట్ చేయటం అంటే మాటలు కాదు. ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. ఎక్కువ మంది దృష్టీ ఉంటుంది. బిజినెస్ పరంగా ఎక్కువ లగేజీ ఉంటుంది. వీటిన్నటినీ తట్టుకుని మొదటి దాన్ని దాటడం అంటే పెద్ద పులి మీద స్వారీనే. ఆ పని ఈ సినిమా చెయ్యగలిగిందా..హిట్ కొట్టగలిగిందా..మొదట సినిమా స్దాయిలో ఉందా ..దాటిందా…అసలు కథేంటి..అడవి శేషు ఏ మేరకు న్యాయం చేసారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

వైజాగ్  యస్పీ  కృష్ణ‌దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) ..ఎలాంటి కేసు ని అయినా ఇట్టే తేల్చేస్తాడు.  అతనికి ఓ స్ట్రాంగ్ కేసు తగిలితే…   క్రిమిన‌ల్స్‌వి కోడి బుర్ర‌లనీ, వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని మీడియా సాక్షిగా స్టేట్మంట్ ఇస్తారు. అయితే ఓ క్రిమినల్ దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సిటీలో  ఓ ప‌బ్‌లో పనిచేసే ఓ అమ్మాయి దారుణ హ‌త్య‌కి గుర‌వుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృత‌దేహాన్ని చూసిన కేడీకి.. ఇన్విస్టిగేషన్ మొదలెడతారు. అందులో ఓ షాకిచ్చే  నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒక‌రివి కాద‌ని.. మొత్తం న‌లుగురు అమ్మాయిలు హ‌త్య‌కి గుర‌య్యార‌నేది అర్దమవుతుంది.  అమ్మాయి మెడపై ఉన్న పంటిగాటు త‌ప్ప మ‌రే ఆధారం లేకుండా హ‌త్య‌లు చేస్తున్న ఆ కిల్ల‌ర్ ఎవ‌రు? అనే దిసగా విచారణ ముమ్మరం చేస్తాడు. ఇంతకీ ఎవరా సైకో కిల్లర్… అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? కేడీ ..ఆ కిల్లర్ ఎవరో పట్టుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇలాంటి సినిమాలకి అసలు సైకో రివిల్ అయినపుడు ప్రేక్షకుడు పొందే థ్రిల్ చాలా ముఖ్యం. ఇందులో మాత్రం ఆ థ్రిల్ మిస్ అయ్యింది. సైకో కిల్లింగ్ కి అతడు ఇచ్చుకున్న కారణం కూడా అసహజంగా వుంటుంది. ఎప్పుడైతే రాధకి సైకో కిల్లర్ గురించి ఒక లీడ్ దొరికిందో అప్పుడే ముగింపు అర్ధమైపోతుంది. అయితే సైకో కిల్లర్ కథని ఆ పాయింట్ అంతగా సమర్ధించదు.  ఏదైమైనా థ్రిల్లర్స్ రాసేటప్పుడు..తీసేటప్పుడు ఒకే విషయం గుర్తుండాలి.మన ఐడియాలు మనని థ్రిల్ చేయటం కోసం కాదు…చూసే జనాలు థ్రిల్ అవటం కోసం. అయితే తీసేవాళ్లు మొదట తమ మస్తిష్కంలో సినిమా మొత్తాన్ని చూస్తారనేది నిజం. కానీ అదే సినిమాని మిగతావాళ్ళకు ప్రెజెంట్ చేసేటప్పుడు అదే థ్రిల్ ని అందించగలిగాలి. ఆ విషయంలో సగం వరకూ డైరక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ మిగతా సగం తేలిపోయింది. అయితే థ్రిల్లర్స్ చూసేవారికి ఈ సినిమా బాగానే తీసాడనిపిస్తుంది. ఈ జానర్ కు కొత్తవాళ్లకు భలే ఉందే అనిపిస్తుంది. కాబట్టి ఎవరి పాయింటాఫ్ వ్యూ వాళ్లదే.  పంటి గాటు, దాని చుట్టూ అల్లిన స‌న్నివేశాలు ద్వితీయార్ధంలో కీల‌కం. దాని ఆధారంగానే కేస్ చిక్కుముడిని విప్పే తీరు ఆక‌ట్టుకుంటుంది.

ఇక ఓటీటిలు వచ్చాక తెలుగు జనాలకు బాగా థ్రిల్లర్ జానర్ కు అలవాటు పడిపోయారు. ఆ సినిమా ఫార్మెట్ వారికి కంటస్దమైపోయింది. ఏ సీన్ తర్వాత ఏమి వస్తుందో చెప్పేయగలుగుతున్నారు. డైరక్టర్ ఎంతో కష్టపడి..ఎన్నో కేసులు రిఫర్ చేసి, ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ లో హంతకుడు ఎవరో ఇట్టే కనిపెట్టేస్తున్నారు. దాంతో ఓ మాదిరి థ్రిల్లర్స్ తో తెలుగు ప్రేక్షకుడుని అలరించి థ్రిల్ చేయటం కష్టం…ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలో  ‘హిట్’తో హిట్ కొట్టి సీక్వెల్ కు తెరఎత్తాడు శైలేష్ కొలను,హీరో నాని. ఈ సినిమాని ఓ మాదిరిగా గెస్ చేయచ్చు. కిల్లర్ ఎవరో తెలిసిపోతూంటుంది. మనకు తెలుస్తుందనే విషయం డైరక్టర్ కు తెలియదంతే. దాంతో ఓ పెద్ద సస్పెన్స్ సినిమాలా సీన్స్ వేసుకుంటూ వెళ్తే..ఆ పజిల్ ని వెనకాలే విప్పుకుంటూ మనం వెళతాం. అఫ్ కోర్స్ ఇదీ ఓ రకమైన ఇన్విస్టిగేషనే అనుకోండి.

ఇక ఈ సినిమా అడవి శేషు వన్  మ్యాన్ షో. కానీ డైరక్టర్ మిగతా పాత్రలకి ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది.  హీరోయిన్ పాత్ర ఉందంటే ఉంది లేదంటే లేదు.అన్నట్లు డిజైన్ చేసారు.  పోసాని, తణికెళ్ల వంటి సీనియర్స్  ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లారు.

టెక్నికల్ గా ఈ సినిమా బాగా సౌండ్ గా ఉంది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఇట్చారు. నిర్మాణం బాగుంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి.

చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా  చూసేవారికి తప్పించి మిగతావారికి  ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటులు : అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : మ‌ణి కంద‌న్‌ ఎస్‌
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని
Runtime:120 minutes ·
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022