Reading Time: 2 mins
5Ws చిత్రo ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల


ఐపీఎస్ అధికారిగా పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి ‘5Ws – who, what, when, where, why’ (5 డబ్ల్యూస్ – ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?) టైటిల్ ఖరారు చేశారు. ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ అనేది ఉపశీర్షిక. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 


అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ “ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నాను. ఇకపై మాట్లాడవచ్చు. ‘5Ws’ అని టైటిల్ పెట్టారు. నాకు, నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది. పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. ఫైనల్లీ… అటువంటి గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది. నాపై, నా నటనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన ప్రణదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐపీఎస్ రోల్ చేయడం ఛాలెంజింగ్. నేను బాగా చేశానని అనుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్‌తో ఈ సినిమా చేశా. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఆలోచిస్తున్నా. ప్రణదీప్ గారు నా దగ్గరకు వచ్చి కథ  చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ పోలీస్ పాత్రలు చాలా చేశారు. ఈ ‘5Ws’లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది. నేను ఏ సినిమా చేసినా… కొంత హోమ్ వర్క్ చేస్తా. నా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి వాళ్ళతో డిస్కస్ చేశా. నేను ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నటించాలి? ఎలా ప్రవర్తించాలి? అనేవి మా మధ్య డిస్కషన్ కి వచ్చాయి. ఇంతకు ముందు నన్ను ‘ఆర్.ఎక్స్. 100’, ‘ఆర్.డి.ఎక్స్. లవ్’, ‘వెంకీమామ’ సినిమాల్లో చూశారు. ఆ స్టీరియోటైప్ ఇమేజ్ బ్రేక్ చేసే సినిమా ఇది. స్టంట్స్ అన్నీ నేనే చేశా. మంచి ఫైట్స్, డైలాగులు కుదిరాయి.” అని అన్నారు. 

దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ “ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా… ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఈ ఐదు ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ముందు ఈ సినిమాకు వేరే టైటిల్స్ చాలా అనుకున్నాం. ఏదీ యాప్ట్ అనిపించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో ఈ కథ రాశా. కథ రాసే క్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఐజీ స్వాతి లక్రా గారు, డీఐజీ బి. సుమతి గారు, డీసీపీ అనసూయ గారు… ఇలా చాలామందిని కలిసి, పరిశోధన చేసి కథ రాశా. రెగ్యులర్ పోలీస్ స్టోరీలా కాకుండా హ్యూమన్ వేల్యూస్, సెంటిమెంట్స్ ను కూడా టచ్ చేశాం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. పాయల్ కి కొత్త సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నా. ఆమె చాలా బాగా నటించింది. క్యారెక్టర్ కోసం రెండుమూడు నెలలు ప్రిపేర్ అయింది. బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అవుట్‌పుట్ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉంది. త్వరలో అది పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. నా టీమ్ కి చాలా థాంక్స్. నా ఫస్ట్ సినిమా కావడంతో ఎంకరేజ్ చేసి, సపోర్టివ్ గా ఉన్నారు. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు” అని అన్నారు.  

నిర్మాత శ్రీమతి యశోదా ఠాకోర్ మాట్లాడుతూ “ఒక రకంగా నేను స్త్రీవాదిని. నేను చేసే పనిలో, నా ఆలోచనల్లో ఎప్పుడూ మహిళా సాధికారత ఉంటుంది. నా భర్త తీస్తున్న సినిమా మహిళల గురించి, స్త్రీ శక్తి గురించి అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను, ప్రణదీప్ క్లాస్ మేట్స్. ఈ రోజు మా క్లాస్ మేట్స్, థియేటర్ ఆర్టిస్టులు… అందరూ ఒక్కసారిగా వచ్చి ఇంత సపోర్ట్ ఇస్తుంటే స్నేహానికి ఉన్న శక్తి ఏంటో నిజంగా తెలిసి వస్తోంది. నా పరిధిలో టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు. సినిమా ప్రొడక్షన్స్ లో అది మరింత ఉంటుందని ప్రణదీప్ డైరెక్టుగా ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత తెలిసింది. పాయల్ నుండి ప్రతి ఒక్క యాక్టర్, టెక్నీషియన్ మాకు ఎంతో సహకరించారు. అందరికీ పేరు పేరునా థాంక్యూ” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం:
దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్ 
నిర్మాత: శ్రీమతి యశోదా ఠాకోర్
నిర్మాణ సంస్థ: కైవల్య క్రియేషన్స్
ఛాయాగ్రహణం: అనిల్ బండారి
సంగీతం: మహతి సాగర్
సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
స్టంట్స్: వెంకట్ మాస్టర్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్
రైటర్: తయనిధి శివకుమార్
స్టిల్స్:ఎ. దాస్
పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్
వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి మయాన్
కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస 
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ & ఫణి కందుకూరి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే
ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల
కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు
మేకప్: కోటి లకావత్