Reading Time: 3 mins

Matka Movie Review
మట్కా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా మూవీ ట్రైలర్ విడుదల అవగానే సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అన్న ఆసక్తి అందరిలో కలిగింది. లుక్ కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు డైరెక్టర్ కరుణ కుమార్ మంచి పాయింట్ తో సినిమా తెరకెక్కిస్తాడు అనే నమ్మకంతో మట్కాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరీ నటించిగా, ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రస్, డ్యాన్సర్ నోరా ఫతేహీ సైతం నటించడంతో ఆడియెన్స్ కు ఉత్సాహం ఏర్పడింది. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:
ఆహారం కోసం చిన్నప్పుడే ఒకడిని చంపి జువైనల్ జైలుకు వెళుతాడు వాసు(వరుణ్ తేజ్). జైల్ అధికారి(రవిశంకర్) అతనిలోని కసిని చూసి జైలులో ఫెటింగ్ పోటీలు పెట్టి వాసుమీద డబ్బులు సంపాదిస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు విశాఖ పట్నంలో ఒక మార్కెటింగ్ యాడ్ లో పనిచేసుకుంటూ తన కుటుంబంతో ఉంటాడు. అదే సమయంలో ఒక వేశ్య(సలోని) చెల్లెలు(మీనాక్షి చౌదరి) పరిచయం ప్రేమగా మారుతుంది. లోకల్ గా జేబీ, నాని బాబుల గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవల్లో ఇరుక్కున్న వాసుకు అండగా నాని బాబు ఉంటాడు. అలా వాసు మంచి పేరుతో ఎదుగుతాడు. అదే సమయంలో అతనికి మట్కా బెట్టింగ్ లాటరీ అనే ఆలోచన వచ్చి దాన్ని మొదలు పెడుతాడు. అది దేశం అంతా విస్తరించడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్ అవుతుంది. ఈ కేసు సీబీఐకి వెళ్తుంది. వాసు ఆ గేమ్ లో ఎలా ఎదిగాడు? దాని వలన గవర్నమెంట్ కు వచ్చిన నష్టం ఏంటి? వాసు డబ్బు అంతా ఎక్కడ దాచిపెట్టాడు? ఈ గేమ్ లో తనకు సాహాయం చేసింది ఎవరు ద్రోహం చేసింది ఎవరు? అనేది తెలియాలంటే మట్కా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇది పిరియాడికల్ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. వాసు క్యారెక్టరైజేషన్ తో స్టార్ట్ అవుతుంది. అనుకున్నది చేస్తాడు, మొండోడు అన్నట్లు చూపిస్తారు. ఇక జైలులో పెట్టె కుస్తీ ఫోటీలు కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అతను పెద్దవాడై బయటకు వచ్చి విశాఖపట్నంలో నా పేరు వినపడేలా చేస్తాను అని మార్కెటింగ్ యార్డ్ లో కూలీగా చేరుతాడు. అలా లోకల్ గుండాలతో ఫైట్ చేయడం వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా ఎవరు ఎక్స్ పర్ట్ చేయకుండా ఉంటుంది. ఇక తన లైఫ్ లోకి నానిబాబు వచ్చిన తరువాత హీరో అంచెలంచెలుగా ఎదుగుతుంటాడు. ఆ తరువాత బిజినెస్ చేస్తాడు. ఇక సొంతంగా తాను బిజెనెస్ చేయాలనే ఆలోచనతో ముంబై వెళ్లి గ్యాంబ్లింగ్ ఆలోచనతో వస్తాడు. దానికి మట్కా అనే పేరు పెట్టడంతో ఫస్ట్ ముగుస్తుంది. ఫస్ట్ ఆఫ్ వరకు కాస్తా ల్యాగ్ ఉన్నా ఏదో ఉంటుంది అన్న నమ్మకంతో కూర్చుంటాము.

సెకండ్ ఆఫ్ మొదలయ్యాక సినిమా వెళుతూనే ఉంటుంది. హీరో కోటిశ్వరుడైపోతాడు. విలన్స్ అంటూ ఎవరు ఉండరు. అయితే అతను ఆడించే మట్కాతో ఇండియన్ గవర్నమెంట్ కు ఇబ్బంది వస్తుంది. దేశంలో ఉన్న డబ్బులో 60 శాతం వాసు దగ్గరే ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సీబీఐ తల దూర్చడంతో కేసు స్పీడ్ అవుతుందేమో అనుకుంటే అదీ ఉండదు. చాలా నీరసంగా సాగుతుంది. దానికి తోడు అక్కడక్క లెంగ్తీ డైలాగ్స్ చిరాకు తెప్పిస్తాయి. వరుణ్ తేజ్ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఇక సినిమా అయిపోయే సమయానికి ప్రేక్షకుడు పూర్తిగా గందరగోళ పరిస్థితికి వెలుతాడు. సినిమా ముగింపులో చిన్న ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నటీనటులు:
వాసు పాత్రలో వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. మూడు గెటప్స్ లలో కనిపించారు. డైలాగ్స్ బాగనే చెప్పారు. ఇక మీనాక్షి చౌదరి పాత్ర తగ్గట్లు యాక్ట్ చేశారు. సత్యం రాజేష్, అజయ్ ఘోష్, నవీన్ చంద్ర, సలోని, నోరా ఫతేహ్ తదితరలు వారి పాత్ర మేరకు మెప్పించారు.

సాంకేతిక అంశాలు:
రచయిత, డైరెక్టర్ కరుణ కుమార్ రాసుకున్న కథను తెరమీద ఆవిష్కరించడంలో కాస్త తడబడ్డాడు. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సంగీతం అందించిన జీ.వీ ప్రకాశ్ కుమార్ జోష్ దగ్గింది. రెట్రో మ్యూజిక్ తో మూడ్ సెట్ చేసినా ఆకట్టుకోలేకపోయారు. సాంగ్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. కెమారా అందించిన కిశోర్ కుమార్ పనితనం మెప్పించింది. ఎడిటర్ కార్తిక శ్రీకాంత్ ఇంకాస్త షార్ప్ గా పని చేయాల్సి ఉంది. ఎడిటింగ్ మిస్టేక్స్ తెరమీద కనిపిస్తాయి. ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజనింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్లు విజెందర్ తీగల, రజనీ తల్లూరి ఎక్కడ కాంప్రమైజ్ అవలేదు.

ప్లస్ పాయింట్స్
హీరో యాక్టింగ్
కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్
కథనం
ఎడిటింగ్
పాటలు
ఎమోషన్స్ కనెక్ట్ అవలేదు

అంతిమ తీర్పు: ఎమోషన్ ఎంగేజ్ మెంట్ లేని ల్యాగ్ ఫిల్మ్.. మట్కా

Movie Title : Matka
Banners: Vyra Entertainments, SRT Entertainments
Release Date : 14-11-2024
Censor Rating : “U/A”
Cast: Varun Tej, Meenakshi Chowdary, Nora Fathehi, Naveen Chandra, Kannada Kishore
Story – Screenplay – Dialogues – Direction: Karuna Kumar
Music: GV Prakash Kumar
Cinematography : A Kishor Kumar
Editor: Karthika Srinivas R
Producers: Dr Vijender Reddy Teegala, Rajani Talluri
Nizam Distributor : Global Cinemas LLP
Runtime : 169 minutes