Thandel Love Tsunami
తండేల్ లవ్ సునామి
ట్రైడెంట్ హోటల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరు కాగా, వైజయంతి మూవీస్ అధినేత, దేశం లోనే గొప్ప నిర్మాత అశ్వనీదత్ గారు, నాగచైతన్య గారి సతీమణి శోభితా ధూళిపాళ, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు, ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారు, డైరెక్టర్ చందూ మొండేటి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గారు, ఇక మిగిలిన రైటర్లు, సహా నిర్మాతలు, అతిరథ మహారధులు మధ్య మీడియా సమక్షం లో చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగా వచ్చి విజయవంతంగా ఆడుతున్న సందర్భంలో చిత్రం యూనిట్ నిర్వహించిన “లవ్ సునామి” పేరుతో జరిగిన సక్సెస్ మీట్ చాలా బాగా జరిగింది,
అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం సక్సెస్ కి ముఖ్య కారణం డైరెక్టర్ చందు మొండేటి విజన్ , హీరో నాగ చైతన్య , సాయి పల్లవి కష్టం అండ్ నటన, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టి చేసిన సంగీతం అని పొగిడారు, మొదటి సారి జంటగా మీడియా ముందుకి వచ్చిన నాగచైతన్య, శోభిత ను ఆశీర్వదిస్తూ ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రజలకి, ముఖ్యఅథిధులుగా వచ్చిన నాగార్జున గారికి అశ్వని దత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు, ఇక నాగ చైతన్య మాట్లాడుతూ, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి కృతజ్ఞతలు చెప్తూ, మత్యకారుల కష్టాలు ఎలా ఉంటాయో నేను చూసి నేర్చుకున్న అన్నారు, ఇక ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారు మాట్లాడుతూ నేను ఎక్కువ సినిమాలు నాగార్జున హీరో గా చేశా ప్రేక్షకుల ఆదరణ, భగవంతుడి అనుగ్రహం ఉంటె అక్కినేని తర్వాత తరం అయిన నాగ చైతన్య తో కూడా సినిమా చెయ్యాలని ఉంది అన్నారు.
డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ నాగచైతన్య తో నెక్స్ట్ హిస్టారికల్ మూవీ చెయ్యబోతున్న అని అనౌన్స్ చేశారు. తెనాలి రామకృష్ణ కథని ఆయనతో ఎలా మార్పులు చేర్పులు చేసి చెయ్యాలా అని వర్క్ చేస్తున్న అన్నారు, కింగ్ నాగార్జున మాట్లాడుతూ సక్సెస్ ఈవెంట్స్ కి వచ్చి చాలా రోజులైంది ఇది ప్రారంభం అన్నారు, డైరెక్టర్ చందూ మొండేటి క్లైమాక్స్ చూపించిన విధానాన్ని చాలా మెచ్చుకున్నారు, నాగచైతన్య ని చూస్తే గర్వంగా ఉందని నాన్న గుర్తొచ్చారని అన్నారు, శోభిత వచ్చిన వేళా విశేషం హిట్ వచ్చిందని అన్నారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ బుజ్జి తల్లి అనే పేరు వాడుకునే పర్మిషన్ ఇచ్చినందుకు శోభిత కు థాంక్స్ చెప్తూ నాకు తెలుసు మిమ్మల్ని చైతు అలా పిలుస్తాడని ఆ పేరు పాటలో వాడనిచ్చి నందుకు థాంక్స్ అని చెప్పారు. “లవ్ సునామి” ఈవెంట్ మీడియా వారి సమక్షం లో చాలా వైభవంగా జరిగింది.