క్యూరియస్ కేస్ ఆఫ్ …(7 సెవెన్ మూవీ రివ్యూ)
రేటింగ్ : 2.0/5
ఏసీపీ విజయ్ ప్రకాష్ (రెహమాన్) దగ్గరకు ఓ కేసు వస్తుంది. రమ్య( నందితా శ్వేతా) అనే ఆమె తన భర్త కార్తీక్ రఘునాథ్ (హవీష్) కనిపించటం లేదని, ఫొటోలు ఇస్తుంది. ఆమె కథ సగం విన్న విజయ్ మిగతా కథ తాను చెప్తాడు. ఆశ్చర్యపోయిన ఆమెతో సేమ్ ఇలాంటి కేసే కొంతకాలం కాలం క్రితం వచ్చిందని చెప్తాడు. జెన్నీ(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయి కూడా కార్తీక్ తనని మోసం చేసి మిస్ అయ్యాడని చెప్తుంది. కార్తీక్ కావాలని మిస్ అయ్యాడని,అతనో ఓ మోసగాడు అని అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాడని చెప్పి ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు.
ఈ లోగా ప్రియ (త్రిధా చౌదరి) అనే మరో అమ్మాయి వచ్చి …తానను సైతం కార్తీక్ వదిలి వెళ్లిపోయాడంటుంది. దాంతో ఇంకా ఎంత మందిని కార్తీక్ మోసం చేసాడో అని ఫొటోలు విడుదల చేస్తాడు. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఆ ఫొటోలో ఉన్నది కార్తిక్ కాదని, కృష్ణమూర్తి అని బాంబు పేలుస్తాడు. అంతేకాకుండా ఆ కృష్ణమూర్తి కూడా చాలా కాలం క్రితమే చనిపోయాడని చెబుతాడు. ఎప్పుడో చనిపోతే ఇప్పుడు అమ్మాయిలను మోసం చేయటం ఏమిటి.. కార్తిక్ పోలికలో వేరే వారు ఉన్నారా…కార్తీక్, కృష్ణమూర్తి ఒకరేనా..అసలు ఈ మిస్టరీ వెనుక ఉన్నదిఎవరు? అలాగే ఈ కథలో సరస్వతమ్మ (రెజీనా) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
థ్రిల్లరే కానీ…
నిజానికి ఇదో రొటీన్ స్టోరీ. కాకపోతే రకరకాల ట్విస్ట్ లు, థ్రిల్లర్ ఫార్మెట్ లో నడిపారు. ఈ సినిమాలో హీరో నిజానికి మొదటి నుంచీ చెప్పుకున్నట్లు హవీష్ కాదు..రహమాన్. ఓ పోలీస్ అధికారి తన దగ్గరకు వచ్చిన ఓ కేసుని ఎలా పరిష్కరించాడు అన్న యాంగిల్ లో ఈ కథనం సాగుతుంది. సర్లే ఇలాంటి సినిమాలకు ఎవరు హీరో అయితేనేం అనే విషయం ప్రక్కన పెడితే సినిమా తన జానర్ మర్యాదను నిలబెట్టుకోదు. చాలా సార్లు థ్రిల్ చేయాల్సిన అవకాసమిచ్చే ఎలిమెంట్స్ ని వదిలేస్తుంది. అలాగే సినిమాలో రిపీట్ నెస్ ఎక్కువయ్యి..బోర్ కొట్టే స్దితికి తెచ్చింది. దానికి తోడు స్లోగా నడిచే సెకండాఫ్ సినిమాపై ఇంట్రస్ట్ ని కిల్ చేసేస్తుంది. ఇక హాలీవుడ్ సినిమాలు చూసేవారికి 2008 లో వచ్చిన ‘ది క్యూరియస్ కేసు ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే సినిమా గుర్తు చేస్తుంది.
హైలెట్స్
ఈ సినిమా హైలెట్స్ డిఫరెంట్ స్టోరీ లైనే. స్క్రీన్ ప్లే వీక్ గా ఉన్నా …కథ ఎత్తుగడ ఇంట్రస్ట్ గా ఉంది. అలాగే ఈ సినిమాకు ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా ఉంది. రహ్మాన్ తనకు కొట్టిన పిండి అయిన పోలీస్ అధికారి పాత్రను నల్లేరు పై నడకలా మంచి ఈజ్ తో పోషించారు.
సాంకేతికంగా…
దర్శకుడుగా, కెమెరామెన్ గా మంచి నైపుణ్యం కనపరిచిన నిజార్ షఫీ స్క్రీన్ ప్లే విషయంలోనే తడబడ్డారు. ఎంతసేపూ మంచి షాట్స్ తెరపై చూపటానికి చూపాలని తాపత్రయమే తప్ప ఆ సీన్స్ లో, షాట్స్ లో ఎమోషన్ ని నింపడానికి ట్రై చేయలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ కు వచ్చేసరికి అసలు ట్విస్ట్ రివీల్ అయినప్పుడు సీరియస్ గా ఉండాల్సింది కామెడీగా మారిపోయింది. ప్రేమించినవాడు తనకు దక్కలేదనే పగతో రగిలిపోయిన ఓ అమ్మాయి, ఎవరెవరి జీవితాల్ని ఎలా మలుపు తిప్పిందన్నదనే పాయింట్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ముఖ్యంగా లవ్ స్టోరీ చెప్పినప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్ కలిపి ఉంటే బాగుండేది.
చైతన్ భరద్వాజ్ పాటలు పెద్దగా బాగోకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్రానికి బలంగా నిలిచింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. డైలాగులు మాత్రం బాగోలేవు.
చూడచ్చా
ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈ థ్రిల్లర్ ఫరవాలేదనిపిస్తుంది.
————
తెర వెనక..ముందు
నిర్మాణ సంస్థలు: కిరణ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్
నటీనటులు: హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ, రహమాన్, సుంకర లక్ష్మి, పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ
లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్,
డైలాగ్స్: జీఆర్ మహర్షి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ
స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ
సినిమాటోగ్రఫీ – దర్శకత్వం: నిజార్ షఫీ.