75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం
75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన నితిన్, కృతి శెట్టి చిత్రం మాచర్ల నియోజకవర్గం
మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ప్రేక్షకుడు అభిరుచి మారిపోతుంది. ఎంటర్టైన్మెంట్ ప్రపంచం విస్తృతి పెరిగిపోవటంతో రొటీన్ కంటెంట్‌ను కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌కు అలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ మాధ్యమం జీ 5. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా జీ 5 టాప్‌లో దూసుకెళుతోంది. డిఫరెంట్ ఒరిజినల్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లో, షోస్, సినిమాలతో ప్రేక్షకులను నిరంతంర అలరిస్తోన్న జీ 5 తాజాగా మరో చిత్రాన్ని తన లిస్టులో చేర్చుకుంది. ఆ సినిమాయే మాచర్ల నియోజక వర్గం . నితిన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సముద్ర ఖని, క్యాథరిన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, జయప్రకాష్, వెన్నెల కిషోర్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి జీ 5 ఓటీటీ మాధ్యమంలో ఆడియెన్స్‌ని అలరిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చింది.
సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. గుంటూరు జిల్లాలోని మాచర్లకు చెందిన స్వాతి తన నియోజక వర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై సాయం కోసం ఎదురు చూస్తుంటుంది. రాజప్ప (సముద్రఖని) మాచర్ల నియోజక వర్గంలో ఎన్నికలు జరగకుండా చూస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఎదురెళుతుంది స్వాతి. ఆమె చంపటానికి రాజప్ప ప్రయత్నిస్తాడు. స్వాతిని సిద్ధార్థ్ కాపాడుతాడు. రాజప్ప గురించిన నిజం అతనికి తెలుస్తుంది. అదే సమయంలో అతనికి గుంటూరు జిల్లాకే కలెక్టర్‌గా పోస్టింగ్ వస్తుంది. అప్పటి వరకు జరిగిన పోరాటం ఇంకా ఉధృతంగా మారుతుంది. చివరకు రాజప్పను సిద్ధార్థ్ ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా. స్వర సాగర్ మహతి ఇటు క్లాస్, అటు మాస్ ఆడియెన్స్‌ను అలరించేలా సంగీతాన్ని అందించారు. ప్రసాద్ మూరెళ్ల సన్నివేశాలను తన సినిమాటోగ్రఫీతో అద్భుతంగా ఆవిష్కరించారు.
ఎం.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జీ 5లో విడుదలైన కొన్నిరోజులకే 75 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ రావటంపై టీమ్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
నటీనటులు :
నితిన్, కృతి శెట్టి, క్యాథరిన్ త్రెసా, సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్, ఇంద్రజ, మురళీ శర్మ, అంజలి, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక వర్గం :
దర్శకత్వం : ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి
నిర్మాత : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం : స్వర సాగర్ మహతి
ఓటీటీ : జీ 5