8 AM Metro (హిందీ) మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
ఐరావతి (సయామీ ఖేర్) కుటుంబం నాందేడ్ లో ఉంటుంది. భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటారు. హైదరాబాద్ లో ఉన్న తన చెల్లెలు దగ్గరినుండి ఫోన్ వస్తుంది … ఆమె ప్రేగ్మెంట్. బ్లీడింగ్ ఎక్కువ కావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని, తన భర్త నాలుగు రోజుల క్రితం అమెరికా వెళ్లాడని చెబుతుంది. తన తో డాక్టర్ ఒకరిని ఉండమని చెప్పాడని చెబుతుంది. ఐరావతి హైదరాబాద్ కు వస్తుంది. ఐరావతి చెల్లెలు ఇంటి నుండి హాస్పిటల్ కు రావడానికి మెట్రో ఎక్కాల్సి వస్తుంది. ఐరావతి కి ట్రైన్ అంటే భయం. ఒకరోజు ట్రైన్ ఎక్కే టైమ్ లో చెమటలు పట్టి ఆమె కింద పడబోతుండగా ఒక అతను (గుల్షన్ దేవయ్య ) పట్టుకుంటాడు.
తరువాత వీళ్లిద్దరు ప్రతిరోజూ ప్రొద్దున 8 గంటలకు మెట్రో లో కలుస్తుంటారు. పరిచయాలు పెంచుకుంటారు. ఇద్దరు బుక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఫిల్టర్ కాఫీ తాగడం, పుస్తకాల గురించి మాట్లాడుకొనడం, సిటీ లో ఉన్న ప్లేసెస్ చూడటం చేస్తారు.
వీళ్ళ ఇద్దరి కలయిక ఎంత వరకు సాగింది? ఐరావతి నాందేడ్ కు వెళ్లే ముందు ప్రీతం ఇంటికి వెళ్లి ఏమి తెలుసుకుంది? ప్రీతమ్ భార్య మృదుల (కల్పిక గణేష్ ) పాత్ర ఏంటి? మృదుల గురించి ఐరావతి తెలుసుకున్న నిజం ఏంటి ? చివరకు ఐరావతి ఎం చేసింది ? అనేది మిగతా కథ?
ఎనాలసిస్ :
అనుకోకుండా మెట్రో పరిచయం అయిన పెళ్ళైయిన స్త్రీ, పురుషుల మధ్యన స్నేహం ఎంతో గొప్పది అని చెప్పే సినిమా కథ ఇది.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
ఫోటోగ్రఫీ బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
పరిచయాలు, వాళ్ళ మధ్య జరిగే మధ్య తరగతి సంబాషణలు, జీవితం గురించి తెలిపే సంఘటనలు ఇందులో ఉన్నాయి
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ గా ఉంటుంది
నటీనటులు:
గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పికా గణేష్, నిమిషా నాయర్, ఉమేష్ కామత్, ’30 వెడ్స్ 21′ ఫేమ్ మహేందర్, ధీర్ చరణ్ శ్రీవాత్సవ్ తదితరులు
సాంకేతికవర్గం :
మూవీ టైటిల్ : 8 AM Metro (Hindi)
బ్యానర్ : Studio 99
సెన్సార్ రేటింగ్: U
సంగీతం : మార్క్ కె. రాబిన్
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి
నిర్మాతలు : రాజ్ రాచకొండ, కిశోర్ గంజి
దర్శకత్వం : రాజ్ రాచకొండ
రన్ టైమ్ : 120 మినిట్స్
OTT స్ట్రీమింగ్ : Zee 5
విడుదల తేదీ: మే 19, 2023
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్