Reading Time: < 1 min

8 Vasanthalu Movie First Single Release On 3rd March 2025

 

8 వసంతాలు మూవీ ఫస్ట్ సింగిల్ అందమా అందమా మార్చి 3న రిలీజ్

మైత్రి మూవీ మేకర్స్, ఫణింద్ర నర్సెట్టి & అనంతిక సనీల్‌కుమార్‌ ‘8 వసంతాలు’ ఫస్ట్ సింగిల్ అందమా అందమా మార్చి 3న రిలీజ్

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం  ఫస్ట్ లుక్ పోస్టర్,  గ్లింప్స్‌, టీజర్ ఇప్పటికే మంచి క్రియేట్ చేసింది.

మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ అందమా అందమా మార్చి 3న విడుదల కానుంది. స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాట కోసం బ్లాక్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. వనమాలి రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆవని మల్హర్ పాడారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు :

అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్

సాంకేతిక సిబ్బంది :

రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి