9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

Published On: June 7, 2022   |   Posted By:

9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

క్రిష్ ‘9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

Emotional Engagement Emoji
👍🏻

ఒక తరానికి బాగా జ్ఞాపకం .. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘తొమ్మిది గంటలు’ నవల. ఈ నవల ఆధారంగా తాజాగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు క్రిష్‌ స్క్రీన్‌ప్లే అందిస్తూ, తన బ్యానర్ పై నిర్మించటంతో క్రేజ్ ఏర్పడింది. అలాగే చాలా గ్యాప్‌ తర్వాత తారక రత్న ఈ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వటం మరో విశేషం. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది… చూడదగ్గ కంటెంట్ ఉందా..అసలుకథేంటి వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి?

టైటిల్ కు తగ్గట్లే ఈ వెబ్ సీరిస్ కథ కూడా తొమ్మిది గంటల్లోనే జరుగుతుంది. సెంట్రల్ జైల్ నుంచి తప్పించుకున్న ముగ్గురు ఖైదీలు మూడు చోట్ల (సైదాబాద్, మూసారాం బాగ్, కోఠి) బ్యాంకు దోపిడీ ప్లాన్ చేస్తారు. అంతా సవ్యంగా జరుగుతుంది. కానీ కోఠి బ్రాంచీలో దొంగలు ఉండగా… అఫ్జల్ గంజ్ సీఐ ప్రతాప్ (నందమూరి తారకరత్న)కు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాంతో ఆ సీఐ రంగంలోకి దూకుతాడు. దొంగలు బయటకు వచ్చేలోపు బ్యాంకును పోలీసులు చుట్టుముడతారు. వాళ్ళు బ్యాంకులో ఉన్న దొంగలను పట్టుకోగలిగారా? లేదా? ఆ దొంగలు సెంట్రల్ జైల్లో ఖైదీలు అనే సంగతి పోలీసులకు తెలిసిందా? లేదా? జైల్లో ఉండాల్సిన ఖైదీలు స్వేచ్ఛగా బయటకు ఎలా వచ్చారు? వాళ్ళకు వెనకాల సపోర్ట్ ఇస్తూ నిలిచింది ఎవరు? ఈ బ్యాంకు దోపీడీ ప్లాన్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెబ్ సిరీస్‌లో చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈకథ కు మెయిన్ కీలకం.. జైలులో ఖైదీలకు ఉదయం, సాయంత్రం రోల్ ఆన్ చేయటమే. అలా ఉదయం తప్పించుకున్న ఆ ఖైదీలు మళ్లీ రోల్ ఆన్‌కు వచ్చి హాజరు చెప్పేందుకు తొమ్మిది గంటల వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిలోనే ఈ కథ అంతా జరుగుతుంది. అయితే ఆ ముగ్గురు ఖైదీలకు దశరథ రామయ్య (అజయ్), జైలర్ (వినోద్ కుమార్) అండగా ఉంటారు.ఆ విషయం ఎప్పుడు ఎలా బయిటపడుతుందనే దిసగా కథనం ప్లాన్ చేసారు. కేవలం దొంగతనం మాత్రమే కాకుండా …లోపల ఇరుకున్న దొంగలు బయట పడేందుకు ప్లాన్స్ వేస్తూంటారు. అవి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. బందీగా ఉన్న వారిలోంచే ఓ లవ్ స్టొరీని, లస్ట్ స్టోరీని, నడిపించారు. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ.. ఒక్కో క్యారక్టర్ ..బ్యాక్ గ్రౌండ్ ని చూపించుకుంటూ వెళ్లారు.

అయితే ఈ వెబ్ సిరీస్‌లో థ్రిల్ కలిగించే అంశాలు చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కథలోచాలా డ్రామా ఉన్నా ..దాన్ని తెరకెక్కించటంలో తడబడ్డారు. అయితే ఎపిసోడ్ చివరకు వచ్చే మలుపులు మాత్రం బాగున్నాయి. క్రిష్ దర్సకుడు కావటంతో తన ముద్రవేయటానికి ప్రయత్నించారు. డైలాగులతో కాకుండా విజువల్స్‌తో కథను వివరించే ప్రయత్నం చేశారు. ముఖం మీద రక్తం చిందిన మహిళను చూసి… అప్పటివరకూ హంగామా చేసిన రవి వర్మ సైలెంట్ అవ్వడం ‘9 అవర్స్’లో బెస్ట్ సీన్ గా నిలుస్తుంది. అజయ్ పాత్ర, మధు శాలిని కారెక్టర్‌తో వచ్చే ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

టెక్నికల్ గా

1985 నాటి పరిస్థితులు కనిపించేలా అన్ని డిపార్టమెంట్స్ బాగా కష్టపడ్డాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్టమెంట్ కు పని ఎక్కువ. డైలింగ్ ఫోన్లు, ఎస్టీడీ బూత్లు, వాకీటాకీలు, అం,అంబాసిడర్ కార్లు , వీడియో పార్లర్ ..కాస్త్యుమ్స్, బ్యాంకు పరిసరాలు అన్నీ చక్కగా తీర్చిదిద్దారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అన్నట్లున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసో గా ఉంది. మనీహీస్ట్ వెబ్ సీరిస్ స్దాయిలో వెళ్లాల్సిన సీరిస్..స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటంతో మామూలు సీరిస్ గా మిగిలిపోయింది. నటీనటుల్లో …తారకరత్న, వినోద్ కుమార్, రవిప్రకాష్, అజయ్, శ్రీతేజ్… ప్రధాన తారాగణం అంతా క్యారెక్టర్లకు తగ్గట్లు నటించారు. అందరిలో రవి వర్మ స‌ర్‌ప్రైజ్‌ చేశారు.

చూడచ్చా

ఇంట్రస్టింగ్ గా నడిచిపోయే సీరిస్.ఎక్కడా అసభ్యత,అశ్లీలం లేకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడచ్చు.


నటీనటులు: నందమూరి తారకరత్న, మధుశాలిని, అజయ్, రవివర్మ, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రాని, అంకిత్, జ్వాలా కోటి, రవిప్రకాష్, శ్రీతేజ్, గిరిధర్, సమీర్, ‘జెమిని’ సురేష్, రాజ్ మాదిరాజు, మౌనిక రెడ్డి తవనం తదితరులు
మూలకథ: మల్లాది కృష్ణమూర్తి రచించిన ‘తొమ్మిది గంటలు’ నవల
ప్రొడక్షన్ డిజైనర్: రాజ్ కుమార్ గిబ్సన్ తలారి
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్
రచన, సమర్పణ: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేదీ: జూన్ 2, 2022
ఓటిటి : (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో)