90 ml ప్రీ రిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే హీరో అవ్వాలనుకున్నాను – 90 ml ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఇక ఇప్పుడు సరికొత్త కిక్ ఇవ్వడానికి మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 90ML. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సంధర్భంగా శనివారం చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు.
వేడుకలో సినీ ప్రముఖులు సందీప్ కిషన్, జానీ మాస్టర్, రోల్ రిడా, తాగుబోతు రమేష్, విఠల్ రెడ్డి, రజిని, వంటి ప్రముఖులు పాల్గొన్నారు..
అజయ్ భూపతి మాట్లాడుతూ.. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నా కోసమే పుట్టింది. ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి హిట్ అందుకున్నాము. ఇప్పుడు 90ML కూడా మరో సక్సెస్ సాధించి ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు అందించాలని కోరుకుంటున్నా. అర్ఎక్స్ 100 ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ ఫోన్ చేసి 90ML కథ అతనికి కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ చెప్పారు. మా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మళ్ళీ కార్తికేయ గుర్తుపెట్టుకొని ఈ కథ సెకండ్ హాఫ్ విని ఒకే చేశాడు. ఈ సినిమాలో సాంగ్స్ డ్యాన్స్ లు కూడా బావున్నాయి. ఈ నెల 5న అందరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. కార్తికేయతో మరో సినిమా తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం కథలను సెట్ చేసుకుంటున్నాను.. అని అజయ్ వివరించారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నిన్న ఒకరోజు మొత్తం నాలో చాలా కోపం వచ్చింది. ప్రియాంక రెడ్డి ఘటన నన్ను చాలా కలచివేసింది. ముందుగా ఆమె కోసం పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నిరసనలు తెలిపిన జనాలను ప్రశంసించి తీరాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. నాకు ఒక మంచి తమ్ముడు లాంటి వ్యక్తి కార్తికేయ. పర్సనల్ లైఫ్ లో ఎన్నో విషయాల్లో నన్ను ఆకర్షించారు. అతను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు చూశాను. చాలా కష్టపడతాడు. యాక్టింగ్ లో బ్లడ్ పెట్టి చేస్తాడు. దర్శకుడు శేఖర్ నాకు ముందే తెలుసు. అతనికి ఈ సినిమా మాంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నా. అలాగే చిత్ర యూనిట్ కి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని అందరికి నా ఆల్ ది బెస్ట్.. అని సందీప్ మాట్లాడారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. శేఖర్ గారు చెప్పిన కథ చాలా అద్బుతంగా ప్రజెంట్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో మరొక మంచి డైరెక్టర్ వచ్చారనే చెప్పాలి. టీజర్ సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు అభిమానుల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందే ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి థ్యాంక్స్. కార్తికేయ కూడా హై రేంజ్ కి వెళ్లాలని కోరుకుంటున్నా. నేహా సోలంకి కూడా అద్భుతంగా నటించారు. వారిద్దరు సినిమాలో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో రోల్ రిడా కూడా యాక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. సినిమా అందరికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నా అని వివరణ ఇచ్చారు.
నేహా సోలంకీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ముందుగా డైరెక్టర్ శేఖర్ రెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. 90 ML లాంటి మంచి కథను రాసి అందులో నన్ను హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత అశోక్ రెడ్డి గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హీరో కార్తికేయ ప్రతి సీన్ లో సపోర్ట్ చేసినందుకు స్పెషల్ గా థ్యాంక్స్ చెబుతున్నా. మరోసారి అతనితో వర్క్ చేయాలని ఉంది. అనూప్ రూబెన్స్ గారు అందించిన మ్యూజిక్ ఈ సినిమాను సరికొత్తగా మార్చేసింది. ఆర్ఎక్స్ 100 కంటే గొప్పగా ఈ సినిమా హిట్టవ్వలని కోరుకుంటున్నా’ అని మాట్లాడారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. వేడుకలో ఒక సింగర్ గా నాకు మంచి గౌరవం దక్కింది. అంతా అభిమానుల దయవల్లే. కార్తికేయ బ్రదర్ కి చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. అతనికి ఈ మూవీ కెరీర్ లోనే బెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఈ సినిమాలో రెండు పాటలు నాతో పాడించిన అనూప్ రూబెన్స్ గారికి చాలా కృతజ్ఞతలు. నాకు మొదటి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. సినిమాలు అన్ని పాటలు చాలా బావున్నాయి. 90 ML సినిమా యూనిట్ కి నా బెస్ట్ విషెస్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందిస్తుంది. కార్తికేయ తన నటనతో అదరగొట్టేసాడు అని మాట్లాడారు.
డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నేను మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది డైరెక్టర్ అజయ్ బూపతి గారికి. ఆయన ద్వారానే కార్తికేయ లాంటి మంచి హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన సాయంతోనే ఈ సినిమా కథ వినిపించాను. అందుకు ఆయనకు స్పెషల్ గా కృతజ్ఞతలు చేసుబుతున్నా. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ సాంగ్స్ తీజర్స్, ట్రైలర్ కూడా అన్ని మీకు నచ్చాయి. అలాగే డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడ్డారు. అనూప్ రూబెన్స్ గారు చాలా తక్కువ సమయంలో మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఎడిటర్ శేఖర్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. సినిమాలో నటించిన నటీనటుల గురించి చాలా మాట్లాడాలని ఉంది సినిమా రిలీజ్ తరువాత వారి గురించి మాట్లాడుతా.. హీరోయిన్ నేహా సినిమాలో చాలా బాగా నటించింది. ఇక కథ వినగానే సినిమా ఒప్పుకొని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా ఉన్న హీరో కార్తికేయ.. అంటూ దర్శకుడు మాట్లాడారు.
కార్తికేయ మాట్లాడుతూ.. ఇదొక ఫ్యామిలీ ఈవెంట్ లా ఉంది. ఇంతగా సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట దర్శకుడు శేఖర్ వేరే కథ చెప్పారు. ఆ తరువాత ఫస్ట్ హాఫ్ వరకు సెట్ చేసుకున్న 90 ML అనే కథ చెప్పారు. మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి అలాగే మందు వాసన అంటే పడని ఒక తండ్రి యొక్క కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ అనగానే నాకు బాగా నచ్చేసింది. అప్పుడు ఫస్ట్ హాఫ్ ఒక్కటే చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి 90 ML టైటిల్ అనగానే డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడే మంచి బడ్జెట్ లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్ లో సినిమాని నిర్మించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి హీరో అవ్వాలని అనుకున్నా. నేను చేసిన ప్రతి సినిమాలో నేను అంత బాగా నటించడానికి కారణం నా దర్శకులు. నా పేరెంట్స్ అలాగే నా బాబాయ్ నా కోసం మరోసారి సపోర్ట్ చేశారు. వీళ్ళే నా బ్యాక్ గ్రౌండ్. ఆర్ఎక్స్ 100తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాము. ఇక ఇప్పుడు సినిమా చూశాక త్రిబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ సినిమా నాకు చాలా ముఖ్యం. అందరికంటే ఎక్కువగా శేఖర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. 15 ఏళ్ల నుంచి ఎంతో స్త్రగుల్ అవుతున్న శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రవి కిషన్ గారు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. సాధారణంగా ఆయనను రేసుగుర్రం రవికిషన్ అంటారు. ఇక ఇప్పుడు 90 ML రవికిషన్ అంటారు. ఇతర నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. నేను విలన్ గా చేసినా హీరోగా చేసినా ఏం చేసినా ఆడియేన్స్ ఆదరిస్తారు అనే ఒక ధైర్యం వచ్చింది. నా దృష్టిలో మెగాస్టార్ – మహేష్ నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఇక మిగతా టెక్నీషియన్స్ కూడా సినిమా చాలా శ్రమించారు. ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఫైనల్ గా డిసెంబర్ 5న మా సినిమాతో 90 ML కాదు.. 900 ML కిక్ వస్తది. ఈ సినిమా ఆల్కహాలిక్ ని ప్రోత్సహించదు. ఈ సినిమా ఆరోగ్యకరమైన కిక్ వస్తది’’ అని లిక్కర్ డైలాగ్ చెప్పి ఆడియెన్స్ చేత కార్తికేయ విజిల్స్ వేయించారు.