Reading Time: 2 mins

90 ml సక్సెస్ మీట్

ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడానికి వంద శాతం కష్టపడతాను – హీరో కార్తికేయ 

RX100 సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయతో కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై శేఖ‌ర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో   అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన `90 ml` ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేహా సోలంకిని హీరోయిన్ గా పరిచయమైన  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సోమవారం రాత్రి హైదరాబాద్ లో  చిత్ర యూనిట్  సక్సెస్ మీట్  నిర్వహించింది. చిత్ర యూనిట్ సభ్యులు వారి ఆనందాన్ని మీడియా ద్వారా ఆడియెన్స్ కి తెలియజేశారు.

దర్శకుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “శుక్రవారం విడుదలైన ఈ సినిమా మండే టెస్ట్ కూడా పాసయ్యింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బిసి సెంటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఏదైతే అనుకున్నామో అలానే ఆడియెన్స్ నుంచి అదే రెస్పాన్స్ వస్తోంది” అని తెలియజేశారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..”బిసి సెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. వాళ్ళనే కాదు అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది . సినిమాలో మంచి కామెడి ఉంది. మంచి ఎంటర్టైన్ మూవీ. రెండు గంటల పాటు ఎంజాయ్ చేస్తూ నవ్వుకునే సినిమా ఇది ” అన్నారు. 
హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ..” ఇది నా మొదటి సినిమా. ఇంతమంచి సినిమాలో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడికి నిర్మాతలకు అందరికి చాలా థ్యాంక్స్. ఇక నన్ను ఎంతో సపోర్ట్ చేసిన కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు ” అని తెలిపారు. 

కార్తికేయ మాట్లాడుతూ.. ”శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ అయ్యిందని సోమవారంతో పూర్తిగా అర్థమైపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా నా సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఒక మంచి ప్రమోషన్స్ లా అనిపిస్తోంది. మొదట ఈ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకున్నా. కానీ ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది. నా ఫైట్ సీన్స్, డ్యాన్స్ చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఎవరైతే నన్ను ఇంకా బెటర్ గా చూడాలని కోరుకుంటున్నారో వారికి చాలా థ్యాంక్స్. ఆడియెన్స్ నన్ను డిఫరెంట్ గా చూడటానికి ఇష్టపడుతున్నారు. నా ప్రతి సినిమాతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతున్నాను. వంద శాతం కష్టపడతాను. ఎవరికైతే భిన్నాభిప్రాయం ఉందొ నెక్స్ట్ టైమ్ వారిని మెప్పించేందుకు ప్రయత్నిస్తాను. అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మా టెక్నీషియన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ” అని తెలిపారు. .