99 సాంగ్స్ సినిమా స్పెషల్ కాన్సర్ట్ విడుదల
ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సమర్పణలో ‘99 సాంగ్స్’ స్పెషల్ కాన్సర్ట్
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం `99 సాంగ్స్`. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16, 2021న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ‘99 సాంగ్స్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ కాన్స్టర్ను విడుదల చేశారు. ‘99 సాంగ్స్’ సినిమా సంగీతానికి సంబంధించి ప్రాభవాన్ని వివరించే డిజిటల్ షో ఇది. ‘99 సాంగ్స్’ సినిమా సంగీతానికి ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ఇది వరకు చూడని అద్భుతమైన అనుభవాన్ని అందించింది. ఇప్పుడు ఈ డిజిటల్ కాన్సర్ట్ జియో సావన్‌లో లైవ్ ప్రదర్శితమవుతుంది.
ఏప్రిల్ 16న ‘99 సాంగ్స్’ విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే శ్రోతలకు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ అద్భుతమైన ఓ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘99 సాంగ్స్’ స్పెషల్ కాన్సర్ట్‌లో అకాడమీ, గ్రామీ అవార్డ్ విజేత అద్భుతమైన స్వరాలను ఎ.ఆర్.రెహాన్ ఏకం చేశారు. ఈ సినిమాలో సంగీతం సినిమాలో హీరోగా నటించిన ఇహాన్ భట్ ‘99 సాంగ్స్’ సినిమా కోసం ఏడాది పాటు పియానోను ప్రత్యేకంగా నేర్చుకున్నారు. సంగీతంపై అవగాహన ఉన్న విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకుడిగా.. ఎ.ఆర్.రెహమాన్‌తో జత చేరడం విశేషం. అందరూ కలిసి చేసిన ‘99 సాంగ్స్’ డిజిటల్ మ్యూజికల్ మాంటేజ్‌ను అందించారు. ఈ సంగీత స్ఫూర్తిని, సినిమా కథకు ఈ మ్యూజికల్ మాంటేజ్ ఓ గౌరవాన్ని తీసుకొచ్చింది.
ఈ ‘99 సాంగ్స్’ స్పెషల్ కచేరీలో గ్లోబల్ మ్యూజిక్ లెజెండ్, గాయకులు బెన్నీ దయాల్, శష్వత్ సింగ్, షాషా తిరుపతి, విజయ్ యేసుదాస్, శ్రీకాంత్ హరిహరన్, పూర్వి కౌతీష్, హరిచరన్, సన్‌షైన్ ఆర్కెస్ట్రా సమ్మిళతమై ఉన్నారు. ఈ మ్యూజిక్ కాన్‌స్టర్ అనేది సంగీతం యొక్క శక్తి, సెలబ్రేషన్స్ గురించి తెలియజేసేది. మూవీ మేకింగ్‌లో సంగీత పరంగానే కాకుండా కథా రచయితగా కూడా ఎ.ఆర్.రెహమాన్ భాగమైయ్యారు. కథతో సంగీతాన్ని మిళితం చేసి ‘99 సాంగ్స్’ ప్రయాణంలో ప్రేక్షకులను రెహమాన్ తీసుకెళ్తారు. ఒక పుస్తకంలోని అధ్యాయాలను తిప్పినట్లుగా. పాటలతో పాటు మాస్ట్రో, గేయ రచయితలు నవనీత్ విర్క్, దిల్షాద్ షబ్బీర్ షేక్, కల్ప్రదా ఇతరులు, గాయకులు, ట్రాక్స్ ఎలా క్రియేట్ అయ్యాయనే వాటి గురించి వివరించారు.
ఈ మ్యూజికల్ కాన్‌స్టర్ శష్వత్ సింగ్ పాడిన ఆధ్యాత్మిక ప్రేమ పాట “ఓ ఆషికా” తో ప్రారంభమైంది. ఈ కాన్సర్ట్ అంతా రెహమాన్ వేదికపైనే ఉంన్నారు. ‘ఓ ఆషికా.’ బృంద స్వరాలతో మరియు రెహమాన్ అందించిన చిరస్మరణీయ పియానో రిఫ్. సింగ్ యొక్క ఉద్వేగభరితమైన వంతెన పాట యొక్క సందేశం ప్రేక్షకులను ఇంటికి నడిపిస్తుంది. గేయ రచయిత విర్క్ 99 సాంగ్స్ స్పిరిట్‌ను వివరించారు.
ఈ సందర్బంగా ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘‘నిజానికి ‘99 సాంగ్స్’లోని పాటలను నేను ప్రతి నగరం, కాలేజీకి ప్రదర్శనగా చేయాలని అనుకున్నాను. కానీ ప్రస్తుత సమయంలో గొప్ప గాయకులు, సంగీత దర్శకులు ఇందులో భాగమైన ఈ సినిమా మ్యూజిక్ షోను అందించడానికి నిర్ణయించుకున్నాం. ప్రేక్షకులు ఏప్రిల్ 16న మాస్క్‌లతో సినిమాకెళ్లి సినిమాపై మీకున్న ప్రేమను చూపిస్తారని భావిస్తున్నాం. ‘99 సాంగ్స్’ అనేది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్య ఒక మనిషి పోరాటం గురించి తెలియజేసే కథ. మనిషి బాధలకు విరుగుడు సంగీతం అనే చెప్పేలా ఈ కథ ఉంటుంది.
దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎ.ఆర్.రెహమాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘దర్శకుడు నేనొక క్రియేటర్‌గా ఎదిగే క్రమంలో రెహమాన్‌గారి సంగీత సారథ్యంలో సినిమా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో నేనీ ప్రయాణంలో ఎంతో అన్వేషణ చేశాను. దర్శకుడిగా మరింత మెరుగైన ఫలితాన్ని అందివ్వడానికి రెహమాన్‌గారు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు’’ అన్ని తెలిపారు.
అలాగే 99 సాంగ్ చిత్రంలో ‘సోఫియా’ సాంగ్‌ను కార్ల్ ఫెర్నాండెజ్, జాషువా సత్య పెర్ఫామ్ చేశారు. తర్వాత ‘జ్వాలాముఖి’ పాటలనో అర్థాన్ని… సందర్భాన్ని విర్క్ వివరించారు. తర్వాత సింగ్ రాసిన ‘తేరి నజర్’ సాంగ్ ప్రదర్శన జరిగింది. దీని గురించి రచయిత షేక్ వివరించారు. తదుపరి ‘ఓ మేరా చాంద్’, ‘సాయి షిర్డి సాయి’ సాంగ్స్ సహా ‘సోజా సోజా’ సాంగ్‌తో పాటు ‘నాయి నాయి’ సాంగ్‌ను కాన్స్టర్లో ప్రదర్శించారు.
‘99 సాంగ్స్’ స్పెషల్ కాన్‌స్టర్ క్రెడిట్స్:
సింగర్స్:
బేలా షెండే, షాషా తిరుపతి, పూర్వి కౌతీష్, బెన్నీ దయాల్, హరిచరన్, శ్రీకాంత్ హరిహరన్, సార్థక్ కల్యాణి, శశ్వత్ సింగ్, రక్షా సురేష్, విజయ్ యేసుదాస్, అభయ్ జోధ్పూర్కర్
బ్యాండ్:
డ్రమ్స్: డేవిడ్ జోసెఫ్
ప్రీకాషన్: యష్ పాథక్
కీ బోర్డ్: కార్తీక్ దేవ్‌రాజ్, నకుల్ అభయంకర్
బేస్ గిటార్: కార్ల్ ఫెర్నాండెజ్
గిటార్: జాషువా సత్య
తబలా: సాయి శ్రవణం
ఫ్లూట్: నవీన్ కుమార్
గటం: కార్తీక్
సన్‌షైన్ ఆర్కెస్ట్రా – ఆదిత్యనారాయణన్ శంకర్, అంగద్ సింగ్, దీప్తి రఘు, దృష్టే తాండెల్, నూర్ భాటియా, రాజ్నరేంద్రన్ రాజగోపాలన్, రమీత వి, రిద్దిమన్ దత్తా, రిజుల్ చక్రవర్తి, శివం కరాద్వాల్, స్నేహ సిమోన్, వన్షైకాన్