Reading Time: < 1 min

అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రo నవంబర్ విడుదల

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూడింటినీ టీజ‌ర్ లో హైలైట్ చేసారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. టీజ‌ర్ చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది. మ‌నం ఆపద‌లో ఉన్న‌పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉన్న బ‌ల‌గం కాదు.. మ‌న‌లో ఉన్న బ‌లం.. ముగింపు రాసుకున్న త‌ర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అమెరికాలోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు శ్రీనువైట్ల‌.
ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో క‌థల ఎంపికపై ప్ర‌త్యేక‌త చూపిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: శ‌్రీనువైట్ల
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, వై. ర‌విశంక‌ర్, మోహ‌న్ చెరుకూరి(సివిఎమ్)
క‌థ‌: శ్రీ‌నువైట్ల‌, వంశీ రాజేష్ కొండ‌వీటి
స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ మ‌ర్పూరి
సీఈఓ: చెర్రీ
సినిమాటోగ్ర‌ఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: ఎంఆర్ వ‌ర్మ‌
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్