Reading Time: < 1 min

ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ నూతన కార్యవర్గo

ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విజయ్ వర్మ పాకలపాటి

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీరిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె.సురే్‌షబాబు ప్రకటించారు. అధ్యక్షుడిగా అంబటి మధుమోహన్‌కృష్ణ, ఉపాధ్యక్షులుగా పీవీఎ్‌స.వర్మ (విజయవర్మ), బి.వెంకటేశ్వరరావు, ఎ.జయప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శిగా జేవీ.మోహన్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనాథ్‌రావు, సుబ్బారావు కనగాల, జె.శ్రీనివాసరావు, కోశాధికారిగా పాలెపు రామారావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మధుమోహన్‌కృష్ణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. తనను ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం పట్ల విజయ్ వర్మ పాకలపాటి సంతోషాన్ని వ్యక్తం చేసారు.