ప్రేమకథాచిత్రమ్ 2 చిత్రం టీజర్ విడుదల
బ్యాక్ టు ఫియర్ గా ప్రశంశలు అందుకుంటున్న ” ప్రేమకథాచిత్రమ్ 2″ టీజర్
“ప్రేమ కథా చిత్రమ్ 2” అంటూ ప్రేమకథచిత్రమ్ కి సీక్వెల్ గా వస్తున్న చిత్రం యెక్క టీజర్ ని విడుదల చేశారు. ట్రెండి గా వుంటూ బ్యాక్ టు ఫియర్ అనిపించేలా టీజర్ అందరి చేత ప్రశంశలు పొందుతుంది. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న చిత్రాలు తరువాత హ్యట్రిక్ చిత్రంగా ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్,సిద్ధి ఇద్నాని లు జంటగా నటిస్తున్నారు. ఈ టీజర్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులకి షాక్ ఇచ్చిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా హైటెన్షన్ పెర్ఫార్మెన్స్ చూపించింది. టీజర్ లో రొమాంటిక్ మూడ్ నుండి హర్రర్ మూడ్ లోకి నందిత ఇచ్చిన ఛేంజ్ ఓవర్ మాత్రం ఈతరం హీరోయిన్స్ కి ఛాలెంజ్ గా నిలుస్తుందనే అనే చెప్పాలి. హర్రర్ కామెడి కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన ప్రేమకథాచిత్రమ్ సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో కామెడి కి మళ్ళి పెద్దపీట వేశారనేది టీజర్ ఎండింగ్ చూస్తే స్పష్టమవుతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్టైనర్గా మొదటి పార్ట్‌కి ధీటుగా వుంటుందనేది ఈ టీజర్ చెప్పే మేటర్..
ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..” ప్రేమకథా చిత్రమ్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలుసు.. ఈ రోజు విడుదల చేసిన ప్రేమకథాచిత్రమ్ 2 టీజర్ చూసినివారంతా కూడా అదే రేంజి చిత్రం అవ్వబోతుందని చెప్పటం చాలా ఆనందంగా వుంది. టీజర్ లో హీరో సుమంత్ అశ్విన్, సిద్ది ఇద్నాని లు చాలా ప్లెజంట్ గా నటిస్తే.. నందిత శ్వేత తన విశ్వరూపం చూపించింది. నిజంగా ప్రేక్షకులు చూసింది టీజర్ మాత్రమే.. ఇంకా చాలా వుంది. ఈ సినిమా మెదటి భాగాన్ని మించి వుండబోతుంది. జనవరి లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము “అని అన్నారు.
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ, విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్.టి.వి.సాయి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు : కెమెరామెన్ – సి. రాం ప్రసాద్, ఎడిటర్ – ఉద్ధవ్ యస్.బి సంగీతం – జె.బి డైలాగ్ రైటర్ – గణేష్లిరిక్ రైటర్- అనంత్ శ్రీరామ్,కాసర్ల్య శ్యామ్, పూర్ణా చారి.ఆర్ట్ – కృష్ణకో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డినిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డిదర్శకుడు – హరి కిషన్