పూర్తయిన డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్
వరస విజయాలతో దూసుకుపోతున్న సంచలన హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కడుతున్నారు. గీత గోవిందం తర్వాత వీళ్ళు నటిస్తున్న రెండో సినిమా ఇది. కాకినాడలోని అందమైన లోకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. చాలా మంది విద్యార్థులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాలో అతిపెద్ద షెడ్యూల్ ఇదే. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది డియర్ కామ్రేడ్ చిత్రం. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫర్ వాట్ యు లవ్.. అనే ట్యాగ్ లైన్ తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులువిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, మోహన్ చెరుకూరి(సివిఎం), యశ్ రంగినేనిసీఈవో: చెర్రీ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ ఎడిటర్ అండ్ డిఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్ డైలాగ్స్: జై కృష్ణ ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు లిరిక్స్: చైతన్య ప్రసాద్, రెహమాన్, కృష్ణకాంత్ కొరియోగ్రాఫర్: దినేష్ మాస్టర్ కాస్ట్యూమ్ డిజైనర్: యశ్వంత్ బైరి, రజిని యాక్షన్ డైరెక్టర్: జి మురళి పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను పిఆర్ఓ: వంశీ శేఖర్